ఎన్నికల ప్రచారానికి తెరపడ్డాక కూడా కాంగ్రెస్ నాయకులు ఊరుకోలేదు. మోడల్ కోడ్ కన్నుగప్పి పార్టీ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్.. వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థులతో ఆయా పట్టణాల్లో బైక్ షికార్లు చేశారు.
వేములవాడ/సిరిసిల్లటౌన్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారానికి తెరపడ్డాక కూడా కాంగ్రెస్ నాయకులు ఊరుకోలేదు. మోడల్ కోడ్ కన్నుగప్పి పార్టీ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్.. వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థులతో ఆయా పట్టణాల్లో బైక్ షికార్లు చేశారు. ఇది వివాదాస్పదమైంది. సిరిసిల్లలో అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుతో బైక్‌పై వెళ్లి నేరుగా ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. స్థానిక నెహ్రూనగర్ అంబాభవానీ ఆలయం వద్ద వందమందితో సమావేశమయ్యారని స్థానికు లు తెలిపారు.
సుందరయ్యనగర్‌లో ప్రజలను ఓట్లను అభ్యర్థించారు. అక్కడి నుంచి పద్మనగర్‌కు వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. విషయం పోలీసులకు తెలియడంతో ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రచార వివాదం ముదురుతుందన్న భావనతో అభ్యర్థులు వెనుదిరిగినట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి వేములవాడ రాజన్నను పొన్నం దర్శించుకున్నారు. అంతకుముందే ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ వెంకటేశ్వర్లును బైక్‌పై ఎక్కిం చుకుని వీధుల్లో తిరిగారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థుల తీరును తీవ్రంగా ఖండి స్తున్నారు. ప్రచార గడువు ముగిశాక ఓటర్లను కలవడంపై మోడల్‌కోడ్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొంటున్నారు.
కార్యకర్తలను కలిసిన పొన్నం!
బోయినపల్లి: పొన్నం ప్రభాకర్ మంగళవారం పార్టీ స్థానిక కార్యాలయంలో కార్యకర్తలను కలిసివెళ్లినట్లు తెలిసింది. ప్రచా ర సమయంలో మండలానికి రాలేదు. కార్యకర్తలు అంసతృప్తికి గురి కాకుండా ఆయన ఇక్కడికి వచ్చినట్లు సమాచారం.