మూడు స్తంభాలు | Congress Group Politics In karimnagar district | Sakshi
Sakshi News home page

మూడు స్తంభాలు

Published Wed, Apr 2 2014 9:23 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

మూడు స్తంభాలు - Sakshi

మూడు స్తంభాలు

కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ  మూడు ముక్కలైంది. నిన్నటివరకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు... ఎంపీ పొన్న ప్రభాకర్ మధ్య అంతర్గత విభేదాలతో రెండుగా చీలిన పార్టీలో.. పెద్దపల్లి ఎంపీ వివేక్ పునరాగవునం మరో గ్రూపునకు పురుడు పోసింది.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఏడాది కిందటి వరకు ఈ ముగ్గురు నేతలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభాలుగా చెలావుణి అయ్యారు. అదే సమయంలో ఎవరికి వారుగా ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారు. శ్రీధర్‌బాబు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌కు సన్నిహితునిగా ఉండటంతో ఒకదశలో తాను చెప్పిందే వేదమన్నట్లుగా అధికారం చెలాయించారు. అటు పార్టీలోనూ... ఇటు పరిపాలనాపరంగా అన్నింటా చక్రం తిప్పారు.

అదే సమయంలో ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎంపీ వివేక్ తెలంగాణ ఉద్యమ్యంలో చురుకైన పాత్ర పోషించి.. అధిష్టానాన్ని ధిక్కరించటంతో పాటు సీఎం కిరణ్‌కు రెబెల్స్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం సమావేశాలు.. మంతనాలన్నింటా వీరిద్దరి మాటే చెల్లుబాటైంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సీఎంను జిల్లాకు రప్పించేందుకు శ్రీధర్‌బాబు పలుమార్లు తనవంతు ప్రయత్నాలు చేశారు.
 
 అదే సమయంలో తెలంగాణ నినాదాలతో ఎంపీలు సీఎంను చిక్కుల్లో పడేసేందుకు తిరుగుబాటు చేశారు. మంథని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో సీఎం హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిసారి జిల్లాకు వచ్చారు. ఆ సభలో ఎవరూ తెలంగాణ ఊసెత్తకపోగా, ఇద్దరు ఎంపీలు మాత్రమే జై తెలంగాణ అని నినాదాలు చేసి కిరణ్‌కు ఇబ్బంది కలిగించారు.
 
 ఆ సమయంలో రెండు గ్రూపుల నడుమ వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమంలో ఎంపీలపై కేసులు కావడంతో పొన్నం జైలుకు వెళ్లారు. సీఎం వ్యక్తిగత కక్షతోనే అధికార పార్టీకి చెందిన తమను జైలుకు పంపించాడంటూ ఎంపీలు విమర్శించారు. అప్పటినుంచి సీఎం పేరెత్తితే చాలు ఇద్దరు ఎంపీలు బహిరంగంగానే మండిపడ్డారు.
 
 కాంగ్రెస్‌ను వీడకముందే వివేక్, శ్రీధర్‌బాబుల నడుమ ఆధిపత్య పోరు మొదలైంది. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోనే వుంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న వుంథని నియోజకవర్గం ఉంది. దీంతో పలుమార్లు ప్రొటోకాల్ వివాదాలు రగులుకున్నాయి. ఇరువురు కలిసి పాల్గొనే సమావేశాల్లో తాను రాకముందే ప్రారంభిస్తున్నారంటూ వివేక్ బహిరంగంగానే మంత్రిని విమర్శించిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంత్రి, ఎంపీల గ్రూపులు సమాంతరంగా విస్తరించాయి. ఇరువురి నడుమ రాజకీయ విభేదాలు కాస్తా వ్యక్తిగత వైరంగా మారాయి.
 
 కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం వివేక్ మంథనిపై ప్రత్యేక దృష్టి సారించటం జిల్లా అంతటా చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో శ్రీధర్‌బాబును దెబ్బతీయాలనే లక్ష్యంతో వ్యతిరేక వర్గంతో పావులు కదిపారు. గత ఎన్నికల్లో శ్రీధర్‌బాబుకు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగిన పుట్ట మధును టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంలో వివేక్‌దే ప్రధాన పాత్ర అనే ప్రచారం సాగింది. వివేక్ తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో మళ్లీ పాత గ్రూపులు తెరపైకి వచ్చాయి. ఆయున సొంత గూటికి చేరిన రోజునే శ్రీధర్‌బాబు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
మరోవైపు కరీంనగర్‌లో వుంత్రికి, ఎంపీ పొన్నంకు మధ్య అంతర్గత పోరు కార్పొరేషన్ ఎన్నికలతో బహిర్గతమైంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలో పొన్నం ఒంటి చేత్తో చక్రం తిప్పారు. శ్రీధర్‌బాబు అనుచరవర్గంగా చెలావుణిలో ఉన్న కరీంనగర్‌లోని నాయుకులందరికీ చెక్ పెట్టారు. నామినేషన్లు దాఖలు చేసిన మంత్రి అనుచరులు ఆరుగురికి బీ ఫారం ఇవ్వకుండా తన వర్గీయుులకు రంగంలోకి దింపారు. అసెంబ్లీ టికెట్ల రేసు.. ప్రతిపాదనలు.. జాబితాలన్నింటా ఇరువురి వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు గజ్జెల కాంతంను కాంగ్రెస్‌లో చేర్చుకొని చొప్పదండి నుంచి పోటీకి నిలపాలని శ్రీధర్‌బాబు భావించారు.
 
 టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యను కాంగ్రెస్‌లో చేర్పించి, అదే స్థానం నుంచి పోటీకి దింపేందుకు పొన్నం పావులు కదుపుతున్నారు. కరీంనగర్, వేములవాడ,  హుజూరాబాద్, పెద్దపల్లిలో ఇంచుమించుగా ఇదే పరిస్థితి. మంత్రి ఒకరి పేరును సూచిస్తే.. పొన్నం మరొకరి పేరును తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ వేర్వేరు జాబితాలను టీపీసీసీకి, స్క్రీనింగ్ కమిటీకి అందించినట్లు తెలిసింది. దీంతో రేసులో టిక్కెట్టు ఎవరిని వరిస్తుందనేది రెండు గ్రూపుల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.
 
 మరోవైపు పార్టీ అధిష్ఠానం ఆశీస్సులతో పార్టీలో చేరిన వివేక్ సైతం టిక్కెట్లపై తనదైన ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మంత్రి తన వర్గీయుులకు.. వివేక్ తాను సూచించిన వారికి ఇవ్వాలని పట్టుబట్టే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఇద్దరు ఎంపీలతో అంతర్గతంగా రాజుకున్న విభేదాలు శ్రీధర్‌బాబుకు తలపోటుగా మారాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement