సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఎస్‌సీ విభాగం ఏర్పాటుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం అమోదించారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ ఎస్‌సీ విభాగ విస్తరణకు కూడా ఆమె ఆమోదముద్ర వేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. టీపీసీసీ ఎస్‌సీ విభాగంలో ఆరుగురు వైస్ చైర్మన్లు, ఐదుగురు కన్వీనర్లను నియమించారు. గజ్జెల కాంతం, బి.కైలాష్, పి.యాకస్వామి, ఏవీ స్వామి, నగరిగారి ప్రీతం, కృశాంక్ మన్నె వైస్‌చైర్మన్లుగా... ఎం.ఆగమయ్య, జేబీ శౌరి, నీలం వెంకటస్వామి, బుర్రి కృష్ణవేణి, ఐతా రజనీదేవి కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఏపీపీసీసీ ఎస్‌సీ విభాగ విస్తరణలో.. అదనంగా నలుగురు కన్వీనర్లను నియమించారు. వీరిలో సత్యశ్రీ, ఎం.అన్నపూర్ణ, గాడి సరోజినీదేవి, మేకల జ్ఞానేశ్వరి ఉన్నారు.