హాలియా :హాలియా వాసులకు హైవే టెన్షన్ పట్టుకుంది. జిల్లాలోని నార్కట్‌పల్లి నుం చి నాగార్జునసాగర్ వరకు సాగుతున్న జాతీయ రహదారి 565 విస్తరణ పనులు ఆ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రహదారి విస్తరణలో తమ దుకాణాలను ఎక్కడ కూల్చివేస్తారోనని వ్యాపారుల్లో భయం పట్టుకుంది. బైపాస్ ద్వారా రహదారిని మళ్లిం చాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
చురుగ్గా పనులు
నార్కట్‌పల్లి నుంచి నాగార్జునసాగర్ మధ్య 86 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.200 కోట్లతో చేపట్టిన రోడ్డు విసర్తణ పనులను జీవీఆర్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే సర్వే పనులు పూర్తి కాగా, జిల్లా కేంద్రం నుంచి దాదాపు పది కిలోమీటర్ల మేర రహదారి పనులు పూర్తి కావస్తున్నాయి. కాగా, ఈ పనులను కాంట్ట్రాక్టు దక్కించుకున్న సదరు కంపెనీ ఏడాదిన్న కాలంలో పూర్తి చేయాల్సి ఉంది.
ఏడాదిగా తగ్గిన అభివృద్ధి వేగం
హైవే విస్తరణ ప్రకటనతో హాలియా ఏడాదిగా అభివృద్ధి వేగం తగ్గిపోయింది. గత ఎన్నికలకు ముందు జిల్లాలోని కోదాడ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాజడ్జర్ల వరకు నాలుగులైన్ల రహదారి పరిశీలనలో ఉందని మాజీ మంత్రి జానారెడ్డి ప్రకటించారు. ఇప్పుడు నల్లగొండ నుంచి నాగార్జునసాగర్ వరకు ఎన్‌హెచ్ 565 రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కావడంతో హాలియా వాసు ల్లో ఆందోళన ప్రారంభమైనది. 565 రహదారికి రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్లు, కోదాడ నుంచి జడ్చర్ల వరకు 75ఫీట్లు పోతుందని పుకార్లు షికార్లు చేస్తుండడంతో ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు.
చర్చోపర్చలు
రహదారిని విస్తరణలో ఎన్ని ఫీట్ల రోడ్డు పోతుందనే విషయంపై చర్చోపచర్చలు జరగుతున్నాయి. ఫోర్‌వే నిర్మాణానికి ఒకవేళ 75 ఫీట్ల మేర రోడ్డు పోతే హాలియాలో ఒక దుకాణ సముదాయం కూడా మిగిలే పరిస్థితి లేదు. దీంతో తమ పరిస్థితి ఏంటని వ్యాపారులు మదనపడుతున్నారు. మండల కేంద్రంలో 50 ఫీట్లు, శివారు నుంచి 75ఫీట్ల రోడ్డును నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తగ్గిన ‘రియల్’ జోరు
ఏడాది కాలంగా మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపార జోరు తగ్గింది. నార్కట్‌పల్లి నాగార్జున సాగర్ రోడ్డు విస్తరణ జరుగుతుండటం, కోదాడ నుంచి జడ్జర్ల వరకు ఫోర్‌వే లైన్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందన్న విషయం తెలియడంతో రోడ్డు వెంట ఉన్న దుకాణాలను కోనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు రెండేళ్లుగా పంట దిగుబడి ఆశాజజనకంగా లేకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
‘హాలియా’కు హైవే టెన్షన్
Published Thu, Nov 27 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement