సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి పేర్కొన్నారు. గురువారం తైవాన్‌లో జరిగిన తైవాన్–ఇండియా ఎక్సే్ఛంజ్– 2018 సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలకు అవకాశాలు కల్పిస్తోంది. తైవాన్ టెక్నాలజీ సంస్థలను మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నాం’అని అన్నారు. తెలంగాణలో ఇప్పటికే ప్రముఖ ఐటీ, లైఫ్ సైన్స్, ఏరో స్పేస్, మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల సాయం చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. మైక్రో ఇన్‌ఫో గ్లోబల్, స్కైరెక్ కంపెనీలు రిటైల్ వ్యాపార అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
మైక్రో ఇన్‌ఫో గ్లోబల్‌తో స్కైరెక్ ఒప్పందం
రిటైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్రానికి చెందిన మైక్రో ఇన్‌ఫో గ్లోబల్ సంస్థతో తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరెక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్.కె.జోషి సమక్షంలో మైక్రో ఇన్‌ఫో సంస్థ చైర్మన్ అప్పిరెడ్డి, స్కైరెక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాన్సన్ వూ సంతకాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment