గోతిలో పడుకుని అడ్డుకుంటున్న రైతు
నవాబుపేట (జడ్చర్ల): నా పట్టా పొలంలో ఎవరినీ పూడ్చిపెట్టవద్దని, ముందుగా తనను పూడ్చిపెట్టి అంత్యక్రియలు నిర్వహించుకోవాలని ఓ రైతు తేల్చిచెప్పాడు. దీంతో రెవెన్యూ అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సంఘటన మండలంలోని యన్మన్‌గండ్లలో గురువారం చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాల ఎల్లమ్మ బుధవారం రాత్రి మృతిచెందింది. ఆమె అంత్యక్రియలు గురువారం చేసేందుకు వెళ్తే అక్కడ భూమి తన పట్టాలో ఉందని, అంత్యక్రియలకు తీసిన గతిలో పడుకుని ఓ రైతు ఆందోళన చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
కాగా సర్వే నం.402 తన పట్టా అంటూ రైతు వాదిస్తుండగ గ్రామంలో మాలబావిగడ్డగా పిలిచే భూమిలో తమ వర్గంవారు చనిపోతే అంత్యక్రియలు చేసేందకు కేటాయించారని కొన్నేళ్లుగా.. ఇక్కడే నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెíప్పి అంత్యక్రియలు జరిగేలా చేశారు. కాగా భూమిని సర్వే చేసి అందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment