అదిలాబాద్: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పంట భీమా పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.
జిల్లాలోని జైనత్, బేలా, తలమడుగు, అదిలాబాద్ మండలాలకు చెందిన దాదాపు 200 వందల మంది రైతులు సోమవారం అదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు.