హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల ఫలాలు రైతులందరికీ అందాలని, అందుకు సమర్థ నీటి యాజమాన్యం అవసరమని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఓపెన్ కాల్వలకు బదులు పైపుల ద్వారా నీటి పంపిణీ వ్యవస్థ అత్యుత్తమమైనదని వివరించారు. రాష్ట్రంలో భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌ల రీ ఇంజనీరింగ్ అంశంపై శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం పరి శోధకులు, అధ్యాపకులతో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెంగాణ నీటిపారుదల రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల ప్రాజెక్ట్‌ల రీఇంజనీరింగ్ చేపట్టారని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సమర్థ నీటి యాజమాన్య పద్ధతులు గురించి రైతాంగంలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో ఎక్కడ ఏ సమావేశానికి వెళ్లినా మన సీఎం కేసీఆర్, ఆయన నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్ట్‌లు, రైతుబంధు తదితర వాటి గురించే మాట్లాడుతున్నారని వర్సిటీ వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర జలసంఘం చైర్మన్ రాజేంద్రసింగ్, రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్, డాక్టర్ జగదీశ్వర్, డి.వసంత్‌కుమార్, శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.
రైతులందరికీ ప్రాజెక్టుల ఫలాలు
Published Sat, Feb 9 2019 12:49 AM | Last Updated on Sat, Feb 9 2019 12:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment