నేలకొండపల్లి : చెరకు మద్దతు ధర పెంచాలని కోరుతూ మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. క్రషింగ్‌ను శుక్రవారం చేపట్టాలని యాజమాన్యం నిర్ణయించగా దానిని అడ్డుకోవాలని రైతులు యత్నిస్తున్నారు. రెండురోజులుగా కొనసాగుతున్న ఈ నిరసనలో భాగంగా ఫ్యాక్టరీ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. క్రషింగ్ కోసం చెరకు లోడ్‌తో శంకరగిరితండా నుంచి వస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. టన్ను చెరకుకు రూ.3 వేలు చెల్లించాలని రైతులు నినాదాలు చేశారు.
కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి అక్కడికి చేరుకుని రైతు సంఘాల నాయకులతో చర్చించారు. రోడ్డుపై వచ్చిన తర్వాత ట్రాక్టర్‌ను ఆపడం సరికాదని ఆయన అన్నారు. వాదోపవాదాల తర్వాత రైతులు ట్రాక్టర్‌ను ఫ్యాక్టరీ లోపలికి పంపారు. అనంతరం సమావేశం నిర్వహించారు. క్రషింగ్‌ను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా శుక్రవారం చేపట్టే క్రషింగ్‌ను పోలీసు పహారా నడుమనైనా నిర్వహించాలని మధుకాన్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలిసింది.
‘మధుకాన్’ వద్ద రైతుల ధర్నా
Published Fri, Nov 28 2014 4:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement