రోడ్డెక్కిన అన్నదాత
- బ్యాంకు ఖాతాల్లో జమ అయిన ధాన్యం బిల్లులు
- పక్షం రోజులుగా తిరుగుతున్నా నో క్యాష్ బోర్డు దర్శనం
- ఆగ్రహించిన రైతులు.. నిరసన
మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో సోమవారం రైతులు ధాన్యం బిల్లుల కోసం రాస్తారోకో నిర్వహించారు. మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో 9 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించారు. ఆయా కేంద్రాల్లో ఇప్పటి వరకు 1,927 మంది రైతులు ధాన్యం విక్రయించారు. 976 మంది రైతులకు సంబంధించి రూ. 9.36 కోట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీరిలో 791 మంది రైతులకు రూ.7.18 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. మోత్కూరు రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొనుగోలు కేంద్రంలో సుమారు 498 రైతు లకు సంబంధించి రూ.1.60 కోట్లు ఆన్‌లైన్ లో నమోదు చేశారు.
వారి డబ్బులను మోత్కూరులోని స్టేట్ బ్యాంక్‌లో జమ చేశారు. డబ్బులు డ్రా చేసుకోవడానికి రైతులు పక్షం రోజులుగా బ్యాంక్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా నో క్యాష్ బోర్డు దర్శ నమిస్తోంది. సోమవారం ఉదయాన్నే సుమారు 100 మం ది రైతులు బ్యాంకుకు వచ్చి బారులుదీరా రు. తీరా బ్యాంకు తెరిచాక నో క్యాష్ బోర్డు పెట్టడంతో ఆగ్రహించి రోడెక్కారు. అష్టక ష్టాలుపడి మార్కెట్‌లో ధాన్యాన్ని అమ్ముకు న్నామని, ఖాతాలో జమైన డబ్బులు, డ్రా చేసుకోవడానికి రెండు వారాలుగా తిరుగు తున్నా నో క్యాష్‌బోర్డు పెడుతున్నారని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు రాగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తానని మేనేజర్ రాజు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.