Grain bill
-
ఆ ధాన్యం సంగతేంటి!
విజయనగరం గంటస్తంభం: ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరగాలి... ప్రతి గింజకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే, మిల్లర్లు, అధికారుల వైఫల్యం వల్ల రబీ ధాన్యం బిల్లులు సకాలంలో అందక రైతులు ఆందో ళన చెందుతున్నారు. దీనిపై మంత్రి స్వయంగా జోక్యం చేసుకుని బిల్లులు చెల్లింపునకు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. మిల్లుల్లో ధాన్యం ఉన్నా... రబీలో కొనుగోలు చేసినట్లు అధికారులు చూపుతు న్న ధాన్యం, సీఎంఆర్ విషయం పక్కన పెడితే మిల్లుల్లో ఉన్న రైతుల ధాన్యంపై సమస్య తలెత్తింది. జిల్లాలో అనేక మంది రైతులకు చెందిన 5,400 మెట్రిక్ టన్నులు ధాన్యం మిల్లుల్లో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వీటిని నమోదు చేసి మిల్లులకు పంపించారు. మిల్లర్లు మాత్రం వాటిని తీసుకున్నట్లు చూపడం లేదు. దీంతో ఆయా రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.8.81 కోట్లు బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం అక్కడ సిబ్బంది నమోదు చేసి మిల్లుల కు పంపించాలి. మిల్లర్లు వాటిని తీసుకున్నట్టు ఆన్లైన్లో ఓకే చేస్తే రైతులకు బిల్లులు రెండు రోజుల్లో పడిపోతాయి. 25 మిల్లుల్లో సమస్య రబీలో కొనుగోలు చేసిన ధాన్యం జిల్లాలోని 77 మిల్లులకు తరలించారు. ఇందులో 52 మిల్లులకు తరలించిన ధాన్యం మిల్లర్లు తీసుకున్నట్టు చూపడంతో బిల్లులు కూడా రైతుల ఖాతాల్లో పడిపోయాయి. కానీ 25 మిల్లులకు తరలించిన 5,400 మెట్రిక్ టన్నుల ధాన్యం పెండింగ్‌లోనే ఉన్నాయి. మిల్లర్లు వాటిని తీసుకున్న చూపడంలేదు. ఆ మిల్లర్లు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ మేరకు ఇప్పటికే వారికి ధాన్యం ఇచ్చారు. వాటిని మరపట్టి ఇస్తే మిగతా ధాన్యం తీసుకునే పరిస్థితి ఉంది. అయితే, ఇప్పటికే ఆయా మిల్లర్లు 5వేల మెట్రిక్ టన్నులు ధాన్యానికి సంబంధించి బియ్యం ఇవ్వాల్సి ఉంది. కొత్తగా ఈధాన్యం తీసుకోలేని పరిస్థితి. అయితే, అదనంగా బ్యాంకు గ్యారంటీ ఇస్తే ఆమేరకు 1:4 నిష్పత్తిలో ధాన్యం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఆపని కూడా మిల్లర్లు చేయడం లేదు. దీంతో ఆ మిల్లులకు చేరినా మిల్లర్లు ఓకే చేయకపోవడంతో బిల్లుల చెల్లింపు జరగని పరిస్థితి తలెత్తింది. మంత్రి దృష్టికి సమస్య ధాన్యం బిల్లుల చెల్లింపు విషయంలో అధికారులు వైఫల్యం కూడా ఉంది. బ్యాంకు గ్యారంటీ పరిశీలించకుండా మిల్లులకు అంతకుమించి ధాన్యం పంపించారు. వాస్తవానికి కొనుగోలు పక్రియ లోటుపాట్లపై జాగ్రత్త వహించాల్సిన అధికారులు.. రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై భారం పడేసి చోద్యం చూశారు. దీంతో మిల్లులకు ధాన్యం చేరి అక్కడ మూడు నాలుగు నెలలుగా మూలుగుతున్నా రైతులకు మాత్రం బిల్లులు అందలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయం చివరకు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన అధికారులను పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంపై జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు సూచించినట్లు సమాచారం. దీంతో ఇటీవల విజెలెన్స్ ఎస్పీ జిల్లాకు వచ్చి మిల్లర్లు, అధికారులతో సమావేశం పెట్టి వెళ్లారు. మిల్లుల్లో ఉన్న 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి బిల్లులు చెల్లించాలంటే వాటిని స్వీకరించాలని, ఇందుకు గతంలో ఇచ్చిన ధాన్యానికి పెండింగ్‌లో సీఎంఆర్ ఇవ్వాలని, లేకుంటే అదనపు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు స్పందించిన మిల్లర్లు పెండింగ్ సీఎంఆర్ వెంటనే ఇచ్చి మిల్లుల్లో ఉన్న ధాన్యం ఆన్లైన్లో ఓకే చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లయింది. సమస్య పరిష్కరిస్తాం.. మిల్లర్లు వద్ద ఇంకా 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నాయి. బ్యాంకు గ్యారంటీ లేక వారు ఓకే చేయలే దు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు సమన్వయ సమావేశం ఇటీవల జరిగింది. పాత కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వేగంగా ఇచ్చి ఈ ధాన్యం తీసుకుంటామని మిల్లర్లు హామీ ఇచ్చారు. సమస్య తొందరలోనే పరిష్కారమవుతుంది. రైతుల కు ఇబ్బందులు లేకుండా చేస్తాం. – వరకుమార్, జిల్లా మేనేజరు, పౌరసరఫరాల సంస్థ -
రైతుల ఖాతాల్లోకి ధాన్యం బిల్లులు
సాక్షి, అమరావతి: పెండింగ్‌లో ఉన్న ధాన్యం బిల్లులను రైతులకు వెంటనే చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు శుక్రవారం నుంచి వారి ఖాతాల్లో ఆ మొత్తాలను జమచేసేందుకు వీలుగా సర్కారు రూ.2వేల కోట్లు విడుదల చేసింది. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 1,700 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ధాన్యాన్ని సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకు రూ.8,227 కోట్ల విలువ చేసే 45.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇలా విక్రయించిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం రూ.6,319 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. మిగిలిన రూ.1,908 కోట్లను చెల్లించేందుకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నిజానికి.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థకు చెందిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది. దీంతో రైతులకు ఇవ్వాల్సిన రూ.960 కోట్ల బకాయిలను చెల్లించలేదు. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ బకాయిలను కూడా చెల్లించి రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. జిల్లాల వారీగా చెల్లించాల్సిన మొత్తం.. చిత్తూరు జిల్లాలో రూ.4.64 కోట్లు.. వైఎస్సార్ కడపలో రూ.10 లక్షలు..తూర్పు గోదావరిలో రూ.491.32 కోట్లు.. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 101.54 కోట్లు.. గుంటూరులో రూ.96.66 కోట్లు.. కృష్ణాలో రూ.258.73 కోట్లు.. ప్రకాశంలో రూ.23.87 కోట్లు.. నెల్లూరులో రూ.39.06 కోట్లు.. శ్రీకాకుళంలో రూ.520.09 కోట్లు.. విశాఖపట్నంలో రూ.11.75 కోట్లు.. విజయనగరంలో రూ.360.84 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇక బిల్లుల చెల్లింపులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో మున్ముందు కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆందోళన వద్దు.. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దు. పెండింగ్ బకాయిలను శుక్రవారం నుండి వారి ఖాతాల్లో జమచేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుండి రెండు, మూడవ త్రైమాసికాలకు సంబంధించిన ధాన్యం నిధులు విడుదల కాకపోవడంవల్ల చెల్లింపుల్లో కొంత ఆలస్యమైంది. ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్తే మద్దతు ధర లభిస్తుంది. – కోన శశిధర్, పౌర సరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి -
రోడ్డెక్కిన అన్నదాత
- బ్యాంకు ఖాతాల్లో జమ అయిన ధాన్యం బిల్లులు - పక్షం రోజులుగా తిరుగుతున్నా నో క్యాష్ బోర్డు దర్శనం - ఆగ్రహించిన రైతులు.. నిరసన మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో సోమవారం రైతులు ధాన్యం బిల్లుల కోసం రాస్తారోకో నిర్వహించారు. మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో 9 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించారు. ఆయా కేంద్రాల్లో ఇప్పటి వరకు 1,927 మంది రైతులు ధాన్యం విక్రయించారు. 976 మంది రైతులకు సంబంధించి రూ. 9.36 కోట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. వీరిలో 791 మంది రైతులకు రూ.7.18 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. మోత్కూరు రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొనుగోలు కేంద్రంలో సుమారు 498 రైతు లకు సంబంధించి రూ.1.60 కోట్లు ఆన్లైన్ లో నమోదు చేశారు. వారి డబ్బులను మోత్కూరులోని స్టేట్ బ్యాంక్‌లో జమ చేశారు. డబ్బులు డ్రా చేసుకోవడానికి రైతులు పక్షం రోజులుగా బ్యాంక్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా నో క్యాష్ బోర్డు దర్శ నమిస్తోంది. సోమవారం ఉదయాన్నే సుమారు 100 మం ది రైతులు బ్యాంకుకు వచ్చి బారులుదీరా రు. తీరా బ్యాంకు తెరిచాక నో క్యాష్ బోర్డు పెట్టడంతో ఆగ్రహించి రోడెక్కారు. అష్టక ష్టాలుపడి మార్కెట్లో ధాన్యాన్ని అమ్ముకు న్నామని, ఖాతాలో జమైన డబ్బులు, డ్రా చేసుకోవడానికి రెండు వారాలుగా తిరుగు తున్నా నో క్యాష్‌బోర్డు పెడుతున్నారని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు రాగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తానని మేనేజర్ రాజు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.