కరుణించని ‘నైరుతి’
వర్షాకాలం ఆరంభమైనా నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. మేఘం వర్షించనంటోంది. తొలకరి జాడలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. కోటి ఆశలతో ఖరీఫ్‌లో పంటల సాగు కు సమాయత్తమైన కర్షకులు.. వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. ప్రస్తుతం జలాశయాలు కళ తప్పడంతో నారు మడికీ నీరు లభించని పరిస్థితులున్నాయి. దీంతో వరుణుడి కరుణపైనే జిల్లాలో రైతులు ఆశలు పెట్టుకున్నారు.
కామారెడ్డి/నిజాంసాగర్ : మృగశిర కార్తె ప్రవేశంతోపాటే వర్షాకలం ప్రా రంభమైంది. అయినా ఎండలు మండుతూనే ఉన్నా యి. వర్షాల జాడ కనిపించడం లేదు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తొలకరి జల్లు లు పలకరించి వెళ్లి నా మళ్లీ చినుకులు కురియలేదు. గతేడా ది నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో ఖరీఫ్ పంటల సాగు సులువైంది. ఈసారి మాత్రం వాటి రాక ఆలస్యం అవుతుండడంతో రైతుల్లో ఆం దోళన వ్యక్తమవుతోంది. దీంతో ఖరీఫ్ సాగు విషయంలో రైతుల్లో అయోమయం నెలకొంది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ప్రధాన జలాశయాలతోపాటు జిల్లాలోని 560 చెరువులు, కుంటలు, బోరు బావుల కింద పంటల సాగు కోసం రైతన్నలు సమాయత్తమమయ్యారు. చాలా మంది రైతులు ముందుగానే వర్షాలు కురుస్తాయన్న ఆశతో విత్తనాలు, ఎరువులు సైతం కొనుగోలు చేశారు. దుక్కులు దున్నిన రైతులు వర్షాలు కురిస్తే విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొందరు రైతులు విత్తనాల వేటలో ఉన్నారు. ఇం కొందరు దుక్కులు దున్నుతున్నారు.
జిల్లాలో ఈసారి ఖ రీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 3.98 లక్షల హెక్టార్ల లో సాగవుతాయని అంచనా వేశారు. ఇందులో 1.50 లక్ష ల హెక్టార్లలో వరి పంట, 1.50 లక్షల హెక్టార్లలో సో యా, 45 వేల హెక్టార్లలో మొక్కజొన్న, మరో 50 వేలకుపైగా హెక్టార్లలో ఇతర పంటలు సాగవుతాయని వ్యవసా య శాఖ అంచనా వేసింది. కానీ వర్షాల జాడ లేకపోవడంతో విత్తేందుకు జంకుతున్నారు. బావులు, బోర్ల దగ్గర వరి నారుమడులు పోయాలనుకుంటున్నా ఎండలను చూసి రైతులు హడలిపోతున్నారు.
దీనికి తోడు ఖరీఫ్ రబీ సీజన్లలో లక్షల ఎకరాలకు సాగు నీరందించిన జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు పోచారం, కౌలాస్‌నాలా, కళ్యాణి, సింగితం రిజర్వాయర్‌లు ప్రస్తుతం బోసిపోతుండడంతో ఈ ప్రాజెక్టులపై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు నిరాశ చెందుతున్నారు. పంటల సాగుకు అవసరం ఉన్న ఎరువులు, విత్తనాలను రైతులు నిల్వలు చేసుకున్నామని రైతులు పేర్కొంటున్నారు. అయితే వర్షాలు కురవకపోవడంతో ఆరుతడి పంటల సాగు సమయం దాటుతుందని ఆందోళన చెందుతున్నారు.
రోజూ సాయంత్రం, ఉదయం పూటల్లో వాతావరణంలో మార్పులు వచ్చి ఆకాశంలో మేఘాలు కమ్ముకొస్తుండడంతో వర్షాలు కురుస్తాయని రైతులు ఆశగా ఎదిరిచూస్తున్నారు. అయితే కమ్ముకొచ్చిన మబ్బులు తేలిపోతుండడంతో నిరాశకు గురవుతున్నారు. వర్షాల కోసం ఆకాశానికేసి చూస్తున్న రైతులు ఈ రోజు కూడా ఇంతే అంటూ నిట్టూరుస్తున్నారు. మరో వారం పాటు పరిస్థితి ఇలాగే ఉంటే పంటల సాగుకు కష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.