కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌కు పత్తి రైతులు బుధవారం తాళాలు వేశారు. పత్తి ధర క్రితం రోజు కంటే బుధవారం రూ.100 మేర తగ్గించి క్వింటాల్‌కు రూ.4500కే కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అలాగే, తరుగు పేరుతో 50 కిలోలకు కోత పెడుతున్నారని మండిపడ్డారు. రెండు గంటల పాటు మార్కెట్ యార్డ్‌కు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారితో చర్చలు జరిపారు.