పండగలా ‘హరితహారం’ | Festivals 'haritaharam' | Sakshi
Sakshi News home page

పండగలా ‘హరితహారం’

Published Sat, Jul 4 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

Festivals 'haritaharam'

{పతిఒక్కరూ స్వచ్ఛందంగాపాల్గొనాలి
అధికారికంగా హంటర్ రోడ్డులో..

 
హన్మకొండ అర్బన్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో   అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కలెక్టర్ కరుణ పిలుపునిచ్చారు. పండగ వాతావరణంలో ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిద శాఖల అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కరుణ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని శుక్రవారం హంటర్‌రోడ్డు నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదాలత్, హంటర్ రోడ్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మధ్యాహ్నం 3 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

అనంతరం అదాలత్ నుంచి తిమ్మాపూర్ క్రాస్‌రోడ్డు వరకు ఉన్న స్థలాన్ని బ్లాకులుగా విభజించి  మొక్కలు నాటుతారని, సంరక్షణ బాధ్యతలను వివిధ ప్రభుత్వ శాఖలకు అప్పగిస్తామన్నారు. ఈనెల పదో తేదీ వరకు వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. ఆగస్టు ,సెప్టెంబర్ ఆఖరు వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొసాగించాలని, మొత్తం 4కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అటవీ, విద్యాశాఖ, వ్యవసాయ, పశుసంవర్థక, వైద్య ఆరోగ్య, పీఆర్, డీఆర్‌డీఏ, డ్వామా అధికారులు పాల్గొన్నారు.
 
వీడియో కాన్ఫరెన్స్...
 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రా జీవ్‌శర్మ, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రేమండ్‌పీటర్ హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమానికి సంబంధించి గ్రామాల వారీ గా ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో ఉంచామని తెలిపారు. ప్ర తిగ్రామం, మండలానికి ప్రత్యేక అధికారులను నియమించామని, గ్రామస్థాయి నుంచి కార్యక్రమం విజయవంతం చేసేలా యంత్రాంగం అన్నీ సిద్ధం చేశామని చెప్పారు. ప్రజలను హరితహారంలో భాగస్వాములను చే సేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. వీడియో కాన్ఫర్సెలో వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబ ర్ కిషోర్ ఝా,  సీఎఫ్ రాజారావు, డ్వామా ఏపీడీ శ్రీనివాస్‌కుమార్, డీఎఫ్‌ఓ వెంకటేశ్వర్‌రావు, గంగారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

హంటర్‌రోడ్డులో కలెక్టర్ పరిశీలన
 హరితహారం కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం మొక్కలు నాటనున్న హంటర్‌రోడ్డు ప్రాంతాన్ని కలెక్టర్ వాకాటి కరుణ గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. వరంగల్ ఆర్డీఓ వెంకట మాధవరావు, హన్మకొండ, వరంగల్ తహసీల్దార్లు రాజ్‌కుమార్, రవీందర్  పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement