Hunter Road
-
వరంగల్: వరద ప్రవాహంతో జలదిగ్భందంలో హంటర్ రోడ్డు
-
తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి
సాక్షి, వరంగల్: తెలుగు రాష్ట్రల్లో వేరు వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 9 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్ జిల్లా తాడిపత్రిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురుకికి గాయాలవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అదే విధంగా అన్నమయ్య జిల్లా సందేపల్లి మండలంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇక వరంగల్ జిల్లాలో రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున బొల్లికుంట వద్ద ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని వర్ధన్నపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా గుర్తించారు. ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురులో ఒకరు అల్లిపురానికి చెందిన ఆటో డ్రైవర్ సింగారపు బబ్లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రమాదంలో.. హంటర్ రోడ్‌లోని ఫ్లైఓవర్‌పై ఖమ్మం నుంచి వరంగల్ వస్తున్న కారు, వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న మరో కారు ఢీ కొన్నాయి. ఇందులో ఖమ్మం నుంచి వస్తున కారు ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరో కారులో నలుగురు ఉండగా వారికి ఎలాంటి గాయాలవ్వలేదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడు గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. -
ప్రేమ.. అత్యాచారం.. హత్య
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో సంచలనం రేపిన గాదం మానస(19)పై అత్యాచారం, హత్య కేసు మిస్టరీ వీడింది. పుట్టిన రోజు సందర్భంగా బుధవారం గుడికి వెళ్లొస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లి హన్మకొండ హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో విగత జీవిగా పడి ఉంది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలికొండ ప్రాంతానికి చెందిన పులి సాయిగౌడ్ అలియాస్ సాయికుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. 6 నెలల పరిచయంలోనే ప్రేమ పేరిట సెల్‌ఫోన్ సంభాషణ కొనసాగించిన సాయికుమార్.. పథకం ప్రకారం నమ్మించి బయటకు రప్పించి మానసపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు తేలింది. కేసులో సాయికుమార్‌ను అరెస్టు చేసినట్లు గురువారం వెల్లడించిన వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రేమ పేరిట గాలం జనగామ జిల్లా నమిలికొండకు చెందిన పులి సాయిగౌడ్ హన్మకొండ హంటర్‌రోడ్డులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. హన్మకొండలోని దీన్‌దయాళ్ కాలనీకి చెందిన గాదం మానస హంటర్‌రోడ్డులోని నీలిమ జంక్షన్ వద్ద తండ్రితో కలసి కూరగాయల వ్యాపారం నడుపుకొంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నిందితుడు కాలేజీకి వెళ్లే క్రమంలో 6 నెలల కింద మానసతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులుగా ఇద్దరూ సెల్ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. బుధవారం మానస పుట్టిన రోజు కావడంతో తనను కలిసేందుకు రావాలని సాయి కోరాడు. దీంతో భద్రకాళి గుడికి వెళ్లొస్తానని తల్లికి చెప్పి మధ్యాహ్నం ఇంటి నుంచి మానస వెళ్లింది. ముందుగా అదాలత్ జంక్షన్ వరకు రావాలని చెప్పిన సాయి.. ఆ తర్వాత కాజీపేట వైపు రావాల్సిందిగా ఫోన్లో సూచించాడు. కాజీపేట వెళ్లి ఎదురు చూస్తుండగా.. మానసను కారులో తీసుకెళ్లిన సాయి.. చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కారును నిలిపి మానసను అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు సీపీ తెలిపారు. కొత్త బట్టలు తొడిగి.. మానసది సహజ మరణంగా చిత్రీకరించేందుకు నిందితుడు సాయి ప్రయత్నించాడు. ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని తరలించేందుకు సాయం కోసం తన మిత్రులు మాచర్ల శ్రీకాంత్, నీలి శ్రీకాంత్‌లను తప్పుడు సమాచారంతో అక్కడికి రప్పించాడు. అయితే ఇద్దరూ ఘటనాస్థలానికి చేరుకుని మానస మృతదేహాన్ని చూసి షాక్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక నిందితుడు ఒక్కడే మానస మృతదేహాన్ని కారులో ఎక్కించి చీకటి పడే వరకు చిన్న పెండ్యాల, హుస్నాబాద్, ఎల్కతుర్తి, కేయూసీ సెంటర్ మీదుగా తిరుగుతూ హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాడు. మానస హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు కాలేజీ సమీపంలోని బట్టల షాపులో డ్రెస్ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి కారులో బయల్దేరి హంటర్ రోడ్డులోని న్యూ శాయంపేట వద్ద రైల్వేట్రాక్ వద్దకు చేరుకుని మానస ఒంటిపై రక్తసిక్తమైన దుస్తులను తీసి కొత్త డ్రెస్ వేశాడు. అక్కడి నుంచి విష్ణుప్రియ గార్డెన్స్ పరిసర ప్రాంతానికి చేరుకుని ఎవరికీ కనిపించకుండా నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని వేసి తన స్వగ్రామమైన నమిలికొండకు వెళ్లిపోయాడు. సోదరుడి ఫిర్యాదుతో.. చీకటి పడినా మానస తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె అన్నయ్య శ్రీనివాస్ బుధవారం రాత్రి హన్మకొండలోని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. సాయికుమారే మానసను హత్య చేసినట్లుగా ప్రాథమికంగా సాక్ష్యాధారాలను సేకరించి గురువారం మధ్యాహ్నం నమిలిగొండలో అరెస్టు చేశారు. నిందితుడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని సీపీ తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే నిందితుడు సాయికుమార్‌ను అరెస్టు చేసేందుకు కృషి చేసిన పోలీసులను సీపీ అభినందించారు. ఎప్పుడేం జరిగింది.. బుధవారం ► మధ్యాహ్నం ఒంటి గంట: ఇంటి నుంచి బయటికి వెళ్లిన మానస ► 1.30 గం.కు: అదాలత్ జంక్షన్ నుంచి కాజీపేట బయల్దేరిన బాధితురాలు ► 2.00 గం.కు: కాజీపేట జంక్షన్ చేరుకుని నిందితుడి కారు ఎక్కిన మానస ► 2.30 గం.కు: అత్యాచారం.. హత్యకు గురైంది. ► మధ్యాహ్నాం 3.00 గంటల నుంచి నిందితుడు మానస మృతదేహంతో చిన్నపెండ్యాల, హుస్నాబాద్, ఎల్కతుర్తి, కేయూసీ జంక్షన్, అశోకా జంక్షన్ వరకు కారులో ప్రయాణం ► రాత్రి 8.30 గం.కు: మృతురాలి బట్టలు మార్చాడు. ► 9.00 గం.కు: మృతదేహాన్ని విష్ణుప్రియ గార్డెన్స్ వద్ద పడేసి పరారైన నిందితుడు. ► 9.43 గం.కు: డయల్ 100కి సమాచారం ఇచ్చిన స్థానికులు. ► 9.50 గం.కు: సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ► 10.00 గం.కు: సంఘటన స్థలంకు చేరుకున్న డాగ్ స్క్వాడ్, క్లూసీ బృందాలు ► 12.00 గం.కు: మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు గురువారం ► ఉదయం 10.30 గం.కు: మృతదేహానికి పోస్టుమార్టం ► మధ్యాహ్నం ఒంటి గంటకు: నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు -
వరంగల్ హత్య కేసును చేధించిన పోలీసులు
సాక్షి, వరంగల్ : జిల్లాలో కలకలం రేపిన యువతి హత్యకేసును గంటల వ్యవధిలో పోలీసులు చేధించారు. వరంగల్‌లోని దీన్ దయాల్ నగర్‌కు చెందిన యువతి మానస బుధవారం భద్రకాళి ఆలయానికి వెళ్లి హంటర్ రోడ్డులో అనుమానాస్పదంగా మృతి చెందిన విషమం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కేసులో నిందితుడిని సుబేదారి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఒక కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వరంగల్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. పోలీస్ కమిషనర్ వి. రవీందర్ మాట్లాడుతూ.. కేసులో అరెస్టు చేసిన నిందితుడు జనగాం జిల్లా ఘన్పూర్ మండలం నెమలిగొండ్ల గ్రామానికి చెందిన పులి సాయిగౌడ్‌గా తెలిపారు. ‘నిందితుడు హంటర్‌రోడ్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. హత్యకు గురైన మానస హంటర్‌రోడ్డులోని నీలమ్ జంక్షన్ వద్ద తండ్రితో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తూనే.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వచ్చిపోయే క్రమంలో ఆరు నెలల క్రితం ఇరువురి మధ్య పరిచయం ఏర్పడిందని, కొన్ని రోజుల నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు’ సీపీ పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం మానస పుట్టిన రోజు కావడంతో సాయిగౌడ్ తనను కలిసేందుకు రమ్మని చెప్పాడు. మానస భద్రకాళి గుడికి వెళ్ళి వస్తానని తన తల్లికి చెప్పి బయటకు వచ్చింది. సాయి సూచన మేరకు మానస కాజీపేట చేరుకోగా.. కారులో వచ్చిన సాయి తనను తీసుకొని వెళ్లి చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారులోనే మానసపై హత్యాచారం చేసాడు. ఈ క్రమంలో మానస అక్కడికక్కడే మరణించడంతో ఆ హత్యా నేరం తనపై రాకుండా ఉండేందుకు తన మిత్రుల సహాయం కోరాడు. అనంతరం అక్కడికి చేరుకున్న నిందితుని మిత్రులు శవంగా పడి ఉన్న మానసను చూసి సాయికి సహయం చేసేందుకు అంగీకరించగపోగా, అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. దీంతో కంగారు పడ్డ సాయి ఒంటరిగానే మానస మృతిదేహాన్ని కారులో వేసుకోని చీకటి అయ్యే వరకు శివారు ప్రాంతంలో తిరిగాడు. అనంతరం మానస హత్యను సహజంగా చిత్రికరించేందుకు ఓ కాలేజీ సమీపంలోని బట్టల షాపులో డ్రెస్ కోనుగోలు చేసి, తిరిగి కారులో హంటర్ రోడ్‌లోని న్యూశాయంపేట రైల్వేట్రాక్ వద్ద రక్త సిక్తమైన మృతురాలి బట్టలను తొలగించి కొత్త బట్టలను మృతదేహానికి వేశాడు. అక్కడి నుంచి మానసను ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో పడేసి అనంతరం నిందితుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. కూతురు తిరిగి ఇంటికి రాలేదని కంగారు పడ్డ మానస తల్లిదడ్రులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మానస తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు దర్యాప్తు నిర్వహించి నిందితుడు సాయిగౌడ్‌ను గురువారం మద్యాహ్నం తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక నిందితుడి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకోని కోర్టులో హాజరు పరుచనున్నట్లు సీపీ తెలిపారు. -
అదుపుతప్పి లారీ బోల్తా
న్యూశాయంపేట : హంటర్‌రోడ్డులోని ప్రకృతి చికిత్సాలయం మూలమలుపు వద్ద మంగళవారం ఉదయం కట్టెల లోడ్‌తో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ మూలమలుపు వద్ద సరైన సూచికలు లేకపోవడంతో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి. సూచికలు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు. -
పండగలా ‘హరితహారం’
{పతిఒక్కరూ స్వచ్ఛందంగాపాల్గొనాలి అధికారికంగా హంటర్ రోడ్డులో.. హన్మకొండ అర్బన్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కలెక్టర్ కరుణ పిలుపునిచ్చారు. పండగ వాతావరణంలో ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిద శాఖల అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కరుణ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని శుక్రవారం హంటర్‌రోడ్డు నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదాలత్, హంటర్ రోడ్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మధ్యాహ్నం 3 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అనంతరం అదాలత్ నుంచి తిమ్మాపూర్ క్రాస్‌రోడ్డు వరకు ఉన్న స్థలాన్ని బ్లాకులుగా విభజించి మొక్కలు నాటుతారని, సంరక్షణ బాధ్యతలను వివిధ ప్రభుత్వ శాఖలకు అప్పగిస్తామన్నారు. ఈనెల పదో తేదీ వరకు వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. ఆగస్టు ,సెప్టెంబర్ ఆఖరు వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొసాగించాలని, మొత్తం 4కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అటవీ, విద్యాశాఖ, వ్యవసాయ, పశుసంవర్థక, వైద్య ఆరోగ్య, పీఆర్, డీఆర్డీఏ, డ్వామా అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రా జీవ్శర్మ, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రేమండ్‌పీటర్ హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమానికి సంబంధించి గ్రామాల వారీ గా ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసి ఆన్లైన్లో ఉంచామని తెలిపారు. ప్ర తిగ్రామం, మండలానికి ప్రత్యేక అధికారులను నియమించామని, గ్రామస్థాయి నుంచి కార్యక్రమం విజయవంతం చేసేలా యంత్రాంగం అన్నీ సిద్ధం చేశామని చెప్పారు. ప్రజలను హరితహారంలో భాగస్వాములను చే సేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. వీడియో కాన్ఫర్సెలో వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబ ర్ కిషోర్ ఝా, సీఎఫ్ రాజారావు, డ్వామా ఏపీడీ శ్రీనివాస్‌కుమార్, డీఎఫ్ఓ వెంకటేశ్వర్రావు, గంగారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. హంటర్‌రోడ్డులో కలెక్టర్ పరిశీలన హరితహారం కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం మొక్కలు నాటనున్న హంటర్‌రోడ్డు ప్రాంతాన్ని కలెక్టర్ వాకాటి కరుణ గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. వరంగల్ ఆర్డీఓ వెంకట మాధవరావు, హన్మకొండ, వరంగల్ తహసీల్దార్లు రాజ్‌కుమార్, రవీందర్ పాల్గొన్నారు. -
కునుకు తీస్తున్న ‘కుడా’
సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరాన్ని అభివద్ధి పట్టాలపై పరుగులు పెట్టించేందుకు నెలకొల్పిన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కునుకు తీస్తోంది. కుడా ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ పథకాలు ఆరంభశూరత్వంగా మారుతున్నాయి. ఆర్భాటాలకు పోయి కొత్త పథకాలు ప్రకటించడమే తప్ప... కార్యాచరణలో వాటిని పూర్తి చేయడం లేదు. పలువురు అధికారుల చేతివాటంతో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. నగరంలో లెక్కకు మిక్కిలిగా రోజుకో అక్రమ లే అవుట్లు వెలుస్తున్నా ‘కుడా’ అధికారులు పట్టించుకోవడం లేదు. మంగళవారం ‘కుడా’ కార్యాలయంలో వరంగల్ మునిసిపల్ కా ర్పొరేషన్, కుడా అధికారులతో వివిధ అభివద్ధి పనుల పురోగతి, కొత్త ప్రణాళికపై సమీక్ష సమావేశం నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం... రోప్‌వేలో నిర్లక్ష్యం భద్రకాళి-పద్మాక్షి-రీజనల్ సైన్స్ సెంటర్ల మధ్య రోప్‌వే నిర్మాణానికి గతంలో ప్రణాళిక రూపొం దించారు. పీపీపీ పద్ధతిలో దీన్ని నిర్మించేందుకు 2007లో ప్రణాళిక సిద్ధమైంది. నగరానికి మణిహారంలా నిలిచే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జిల్లాలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుం ది. భక్తులు, పర్యాటకులు భద్రకాళి చెరువు మీదుగా పద్మాక్షి గుట్టకు చేరుకుని, అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత హంటర్‌రోడ్డులో గుట్టపై నిర్మించిన రీజనల్ సైన్స్ సెంటర్ వరకు రోప్‌వే ద్వారా చేరుకుంటారు. రీజనల్ సైన్స్ సెంటర్‌ను సందర్శించిన తర్వాత దానికి ఎదురుగా ఉన్న జూపార్కుకు పర్యాటకులు వెళ్లేలా ఓ చక్కని టూరిజం సర్క్యుట్లా దీన్ని రూపొందించారు. రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2007లో టెండర్లకు ఆహ్వానించగా... వైజాగ్ రోప్‌వే ప్రాజెక్టు చేసిన కోల్‌కతాకు చెందిన ఓ ప్రవేటు సంస్థ ముందుకొచ్చింది. ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. భద్రకాళి చెరువు సమీపంలోనే మ్యూజికల్ గార్డెన్, ప్లానిటోరియం సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా ‘కుడా’ యంత్రాంగం నడుం బిగించాల్సిన అవసరం ఉంది. హెల్త్ స్పా ఎక్కడ?... హంటర్ రోడ్డులో ఆర్టీసీ టైర్ కంపెనీ పక్కన ఉన్న నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ‘కుడా’కు అప్పగించారు. ఈ స్థలంలో హెల్త్ స్పాను నిర్మించాలని ప్రతిపాదించారు. పీపీపీ పద్ధతిలో ఈప్రొక్యూర్మెంటు విధానంలో టెండర్లు నిర్వహించి, వదిలేశారు. ఈ క్రమంలో ఈ స్థలం కబ్జాకోరల్లో చిక్కుకుంటోంది. ఆహ్లాదం, ఆధ్యాత్మికం రెండింటిని కలుపుతూ భద్రకాళి చెరువు మధ్యలో రూ. 45 కోట్లలో పిరమిడ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు 2007లో ‘కుడా’ ప్రణాళిక రూపొందించింది. బోట్ల ద్వారా ధ్యాన కేంద్రానికి వెళ్లివచ్చేలా పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా ఈ డిజైన్ రూపొందించింది. దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువును రూ 4.5 కోట్లతో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ‘కుడా’ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ సిద్ధం చేసింది. ఆ తర్వాతా వీటి ఊసు పట్టించుకునే వారే కరువయ్యారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అజంజాహి మిల్లు భూముల అమ్మకం ‘కుడా’ ఓ సిటీ వెంచర్ ప్రారంభించింది. దాదాపుగా 60 శాతం స్థలాలు విక్రరుుంచారు. మధ్య తరగతి వర్గాల కోసం హసన్‌పర్తి మండలం మునిపల్లిలో టౌన్ షిప్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించారు. సూమారు 45 ఎకరాల భూమి ఉంది. నాలుగున్నర ఏళ్లు దాటినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. హయగ్రీవాచారి మైదానంలో రూ.103 కోట్లతో షాపింగ్ కాంప్లెక్సు నిర్మించేందుకు ప్రతిపాదించారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేత శిలాఫలకం వేయించారు. తొమ్మిదేళ్లవుతున్న ఇంత వరకు షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి కాలేదు. ఆరోపణల వెల్లువ లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం అమల్లో ‘కుడా’ ఖజానాకు భారీగా గండిపడిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ద్వారా భూములపై యజమానులకు హక్కు కల్పించే సమయంలో పాత యాజమాన్య పత్రాలు, మార్కెట్ విలువను తక్కువగా చూపారనే విమర్శలు ఉన్నాయి. వీటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘కుడా’ పరిధిలో అనుమతులు లేకుండా 60కి పైగా లే అవు ట్లు ఉన్నట్లు అంచనా. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.