ముంచెత్తుతున్న వానలు | Fifth day also Heavy rains in the state | Sakshi
Sakshi News home page

ముంచెత్తుతున్న వానలు

Published Sun, Sep 25 2016 2:10 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

ముంచెత్తుతున్న వానలు - Sakshi

ముంచెత్తుతున్న వానలు

ఐదోరోజూ రాష్ట్రంలో భారీ వర్షాలు
- పొంగుతున్న వాగులు వంకలు
- తెరుచుకుంటున్న ప్రాజెక్టుల గేట్లు
- వేలాది ఎకరాల్లో పంట నష్టం
- వివిధ ఘటనల్లో 8 మంది మృతి.. పలువురు గల్లంతు
 
 సాక్షి నెట్‌వర్క్:  అవే వానలు.. వరుసగా ఐదోరోజూ దంచికొట్టాయి.. శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి! నిజామాబాద్ జిల్లాలో కుండపోత కురిసింది. మెదక్‌ను వానలు ముంచెత్తాయి. ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్‌లోనూ భారీ వర్షాలు పడ్డాయి. నల్లగొండలో కాస్త తెరపినిచ్చింది. పాలమూరులో ముసురుపట్టింది. ఇక వర్షాలు, వరదలతో వివిధ ఘటనల్లో ఎనిమిది మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. వేలాది ఎకరాలు నీటమునిగాయి. ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది.

 మెదక్.. జలదిగ్బంధం
 మెదక్ జిల్లా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తుతుండటంతో వాగులు, నదులు  పొంగి ప్రవహిస్తున్నారుు. వరద తాకిడికి ప్రాణనష్టం జరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. శనివారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చనిపోగా, ముగ్గురు గల్లంతయ్యారు. 30 చోట్ల వంతెనలు దెబ్బతిన్నారుు.  మంజీర ఉరకలెత్తుతోంది. సింగూరు ప్రాజెక్టు నుంచి 9 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. 4 వేల చెరువులు అలుగుపోస్తున్నారుు. 64 చెరువులకు గండి పడింది. 306 ఇళ్లు కూలిపోయారుు. 18 లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 4 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.

కంగ్టి మండలం నాగూర్(బి)లో పుండ్లిక్‌రావు(65) అనే వృద్ధుడు గోడ కూలి చనిపోయాడు. సిద్దిపేట పట్టణంలో పెంకుటిల్లు కూలి ప్రదీప్(28), కొండపాక మండల కేంద్రానికి చెందిన ఆరోగ్యశ్రీ కార్యకర్త బొద్దుల భాస్కర్(28) దైరుున్ చెరు వాగులో పడి దుర్మరణం పాలయ్యారు. ఖేడ్ మండలం అంత్వార్‌కు చెందిన పుప్పాళ్ల శ్రీనివాస్ (25) వాగులో గల్లంతయ్యాడు. సదాశివపేట మండలం ఆరూర్ గ్రామంలో ప్రశాంత్ (14) అనే బాలుడు సాకిరేవు వాగులో గల్లంతయ్యాడు. జహీరాబాద్ మండలం హోతి(బి) సమీపంలో శేరి వాగును దాటే ప్రయత్నంలో ఎడ్ల బండి బోల్తా పడి గుడ్డు(12) అనే బాలుడు గల్లంతయ్యాడు. మంజీర నది మధ్యలో 23 మంది కూలీలు చిక్కుకుపోయారు. మంజీర 2 పాయల మధ్య ఉన్న బొడ్డెలో బ్రిడ్జి నిర్మాణం సాగుతోంది. అక్కడ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని పనులు చేస్తున్న ఈ కూలీలు వరదలో చిక్కుకుపోయారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది.

 ఆదిలాబాద్.. జనజీవనం అతలాకుతలం
 ఆదిలాబాద్ జిల్లాలో జన జీవనం అతలాకుతలమైంది. గోదావరి, పెన్‌గంగా, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బాసర స్నానఘట్టాల వద్ద 54 మెట్లలో 42 మెట్లు మునిగిపోయాయి. బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని డ్రైనేజీలో శ్యామన్న (47) అనే రైల్వే కార్మికుడు కొట్టుకు పోయాడు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నీట మునిగి భైంసాకు చెందిన సయ్యద్ సల్మాన్ (22) మరణించాడు. భైంసా నియోజకవర్గంలో 15 గృహాలు నేలకూలాయి. ఆదిలాబాద్ మండలం బంగారుగూడ వాగు లో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. కోటపలి పెద్ద చెరువుకు గండి పడింది. నిర్మల్‌లో 20 సెం.మీ. వర్షం కురిసింది. ఎల్లంపల్లి, కడెం, కొమురం భీం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టు, మత్తడివాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు.

 కరీంనగర్.. జలాశయాలు కళకళ
 కరీంనగర్  జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు నిండాయి. ఎగువ మానేరు నర్మాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు దూకుతుండడంతో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ మానేరు నుంచి మిడ్ మానేరు స్పిల్‌వే మీదుగా 30 వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. లోయర్ మానేరు డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద రావడంతో గేట్లు ఎత్తారు. జిల్లాలో 5,598 చెరువులుండగా.. 1,133 చెరువులు పూర్తిగా నిండారుు. ఇందులో 821 చెరువులు అలుగు పారుతున్నాయి. కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌లో నర్సవ్వ (65) డ్రైనేజీలో కొట్టుకుపోయి మృతి చెందిం ది. హుస్నాబాద్ మండలం గౌరవెల్లి ప్రాజెక్టు రేగొండ వద్ద నిర్మిస్తున్న పంపు హౌజ్‌లోకి వరద నీరు చేరింది.

 రంగారెడ్డి.. అతలాకుతలం
 నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలు రంగారెడ్డి జిల్లాను అతలాకుతలం చేస్తున్నారుు. శనివారం మరోసారి భారీ వర్షం కురిసింది. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పరిగి, తాండూరు, వికారాబాద్ పరిధిలో జనజీవనం స్తంభించింది. చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లారుు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయారుు.  ఇళ్లు కూలారుు. మూసీ, ఈసీ వాగులు పరవళ్లు తొక్కుతున్నారుు. హైదరాబాద్‌కు తాగునీరు అందించే జంట జలాశయాలు జలకళను సంతరించుకున్నారుు. శంకర్‌పల్లి పరిధిలోని పత్తేపూర్ వద్ద మూసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కాగ్నా నది పరవళ్లు తొక్కుతోంది. కోట్‌పల్లి, లక్నాపూర్ ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి.

 వరంగల్.. మునిగిన పంటలు
 వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నారుు. భూపాలపల్లి నియోజకవర్గంలోని మోరంచవాగు ఉధృతంగా ప్రవహించడంతో 15  గ్రామాలకు రాకపోకలు స్తంభించారుు. చిట్యాల మండలంలోని చలివాగు, మానేరు ఉప్పొంగుతున్నారుు. 13 వేల హెక్టార్లలతో పంటనష్టం జరిగిందని అంచనా వేశారు. ములుగు మండలంలోని కాశిందేవిపేట-రామయ్యపల్లి సమీపంలోని కెనాల్ కాలువ తెగింది. దీంతో దిగువన ఉన్న పంట పొలాలు మునిగాయి. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు 34 అడుగులకు చేరి అలుగు పోస్తోంది. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు పూర్తి స్థారుు (30.03 అడుగులు)లో నిండింది. భూపాలపల్లి ఏరియాలోని గనులు బురదమయంగా మారారుు. బొగ్గు లారీల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 66 చెరువులకు బుంగలు పడ్డారుు. హన్మకొండ మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన వేముల యోగేశ్వర్(9) దేవాదుల కాలువలో పడి మృతి చెందాడు.

 నిజామాబాద్.. రికార్డు వర్షపాతం
 జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. శనివారం జిల్లాలో 13 సెం.మీ. వర్షపాతం నమోదుకాగా.. ఆర్మూర్‌లో రికార్డు స్థాయిలో 39 సెం.మీ. వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. వర్షాలకు తాడ్వాయి మండలం క్రిష్ణాజీవాడికి చెందిన ఆక్కి నర్సవ్వ (70) అనే వృద్ధురాలు మృతి చెందింది. శుక్రవారం వేల్పూరు మండలం పడగల్ వాగులో గల్లంతైన అంబేకర్ ప్రియాంక(25), ఆమె కొడుకు హర్షిత్(2) ఆచూకీ లభ్యం కాలేదు.  ప్రభుత్వం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపింది. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కువ నష్టం జరిగింది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తుతోంది. సంగారెడ్డి, నాందేడ్- జహీరాబాద్, బీదర్, మహారాష్ట్ర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. కామారెడ్డి-సిరిసిల్ల మార్గంలో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. అందులో 30 మంది ప్రయాణికులను అధికారులు కాపాడారు.

 నల్లగొండ.. శాంతించిన వరుణుడు
 గత నాలుగురోజులుగా నల్లగొండ జిల్లాను అతలాకుతలం చేసిన వర్షాలు శనివారం కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. జిల్లాలోని శాలిగౌరారం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఈ ప్రాజెక్టు వద్దకు విహారానికి వెళ్లిన అమరగాని పవన్‌కుమార్ (36) అనే వ్యక్తి కాలుజారి పడి కొట్టుకుపోయాడు. అతని ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం నాంపల్లి మండలంలోని శేషిలేటి వాగులో కొట్టుకుపోయిన సాయి మృతదేహం శనివారం లభ్యమైంది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వేలాది ఎకరాల వరి చేలు నీళ్లలోనే ఉండిపోయాయి. పోచంపల్లి-భువనగిరి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పులిచింతల, కేతేపల్లి మూసీ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. వర్షాలతో జిల్లాలో రూ.200 కోట్లకుపైగా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. 15 వేలకు పైగా హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది.

 పాలమూరు.. ముసురు
 మహబూబ్‌నగర్ జిల్లాలో ముసురు పడుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వ రకు ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల శివారులోని కాగ్నావాగు, పెద్ద చెరువు నిండి అలుగుపారుతున్నాయి. జూరాల క్రస్ట్ గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేయడంతో కృష్ణా నది నిండుగా పారుతోంది.
 
 అంగుళంలో తప్పిపోయింది!
 మెదక్ జిల్లా రారుుకోడ్ మండలం సిరూర్ శివారులో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం తప్పిం ది. రాజస్తాన్‌కు చెందిన లారీ ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి బొప్పారుు లోడుతో వెళ్తుం డగా ముందు టైర్ పంక్చర్ అయింది. దీంతో బ్రిడ్జి రక్షణ గోడలపైకి లారీ దూసుకెళ్లింది. ఇంకో అంగుళం దూసుకెళ్లి ఉంటే నదిలో పడిపోయేది. ముందు టైర్లు గాల్లో వేలాడాయి. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అధికారులు లోడును ఖాళీ చేసి లారీని క్రేన్  సహాయంతో రోడ్డుపైకి లాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement