
సాక్షి, నల్గొండ: కబడ్డీ క్రీడాకారుడికి ఆర్థిక ఇబ్బందులు బంధనాలుగా మారిన తరుణంలో దాతలు ముందుకొచ్చి ఆదుకున్నారు. నల్గొండ జిల్లా నిడమనూర్ మండల కేంద్రంలో గోకికార్ సురేష్ అనే కబడ్డీ క్రీడాకారుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన మన్నెం రంజిత్ యాదవ్ తన వంతు సాయంగా రూ.10,000 అందించి ఉదారతను చాటుకున్నారు. స్థానిక ఎంపీపీ బొల్లం జయమ్మ, పీఏసీఎస్ జిల్లా డైరెక్టర్ విరిగినేని అంజయ్య చేతుల మీదుగా బాధితుడికి ఈ మొత్తాన్ని అందించారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి మాజీ ఎంపీటీసి మన్నెం వెంకన్న యాదవ్, టీఆర్ఎస్ మాజీ యూత్ అధ్యక్షులు ఉన్నం ఈశ్వర్ ప్రసాద్, టీఆర్ఎస్వీ నాగార్జునసాగర్ నియోజకవర్గ కార్యదర్శి కుంటిగొర్ల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment