
సాక్షి, హైదరాబాద్: బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 11లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సంతోష్ దాబాలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ఆ ఫ్లోర్‌లోని ఫర్నిచర్ తగలబడుతుంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. సంతోష్ దాబాలో ఒక్కసారిగా మంటలు చెలరేగంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హోటల్‌కు వచ్చిన కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగనట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment