మాదన్నపేట్ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం
చంచల్‌గూడ: కుర్మగూడ డివిజన్ మాదన్నపేట్ కూరగాయల మార్కెట్‌లో శనివారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ భారీ షెడ్డు, అందులో నిల్వ ఉంచిన కూరగాయలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్యూ్కట్ కాణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ఇన్స్‌పెక్టర్ రాజు తెలిపారు. కరెంటు స్తంభానికి ఉన్న సర్వీస్ వైర్లు కాలుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని పోలీసులు తెలిపారు.
మార్కెట్ కమిటీ సెక్రటరీ మాధురి సంఘటన స్థలాన్ని పరిశీలించి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో మాట్లాడారు. ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. అగ్నికి ఆహుతైన షెడ్డు విలువ రూ. 40 లక్షలు ఉంటుందని మార్కెట్ యాజమాన్యం పేర్కొంటోంది. షెడ్డులోని 50 మోండాల్లోని కూరగాయలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్లు పూర్తిగా కాలిపోవడంతో మరో రూ.30 లక్షలు నష్టం వాటిల్లిందని వ్యాపారులు తెలిపారు.
ప్రమాదంపై అనుమానాలు
ప్రమాదంపై కమీషన్ ఏజెంట్ల సంఘం అనుమానాలు వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి కట్కిరెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ షాక్ సరŠూక్యట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరగడం నమ్మశక్యంగా లేదని, 10 నిమిషాల్లో షెడ్డు మొత్తం కాలిపోవడం, పచ్చి కూరగాయలు బుడిద కావడం విడ్డూరంగా ఉందన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో విద్యుత్ స్తంభం నుంచి నిప్పురవ్వలు రోడ్డుపై పడిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని, మంటలంటుకున్నట్లు ఎక్కడా లేదన్నారు. మండీలో వివాదాలు ఉన్నందున ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.