కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలంలోని ఊడూరు శివారులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
కమలాపూర్: కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలంలోని ఊడూరు శివారులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 600 తాటి చెట్లు దగ్ధమయ్యాయి. స్థానికులు సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పుతున్నారు.
అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం మొదలుపెట్టేలోపే చాలా చెట్లు కాలిపోయాయి. అయితే ఈ ఘటన ఎవరైనా కావాలని చేసిందా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. తాటి చెట్ల నుంచి వచ్చే కల్లు అమ్ముకుని జీవనోపాధి కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం ఎలాగైనా తమను ఆదుకోవాలని గీతకార్మికులు కోరారు. ప్రమాద స్థలాన్ని స్థానిక తహశీల్దార్ రవీందర్, ఎక్సైజ్ ఎస్‌ఐ రాబర్ట్‌లు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.