భద్రాచలం : గోదారమ్మ శాంతించింది. భద్రాచలం వద్ద దీని నీటి మట్టం బుధవారం 40 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమా ద హెచ్చరికను ఉపసంహరించారు. గురువారం నాటికి ఇది మరింత తగ్గే అవకాశముందని భద్రాచలం ఆర్డీఓ ఆర్.అంజయ్య తెలిపారు. రెండు రోజుల వ్యవధిలోనే ఉగ్రరూపం దాల్చిన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది.
దీంతో పరీవాహక ప్రాంత ప్రజానీకంతో పాటు, జిల్లా యంత్రాంగం కూడా ఊపిరిపీల్చుకుంది. వరద తగ్గుము ఖం పట్టడటంతో నష్టం అంచనాలపై యుద్ధప్రాతిపదికన సర్వే చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 14మండలాలపై వరద ప్రభా వం చూపింది. వరద తగ్గుముఖం పట్టడం లో భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు.
అయితే.. భద్రాచలం పట్టణంలోని అశోకనగర్ కొత్తకాలనీని ఇంకా వరద నీరు వీడలేదు. దీంతో ఇక్కడ బుధవారం కూడా పునరావాస శిబిరం కొనసాగింది. వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం గో దావరి రేవులోని స్నానఘట్టాల బయటపడ్డాయి. అదే విధం గా అక్కడ ఉన్న ఆలయాల నుంచి కూడా వరద నీరు వైదొలిగింది. దీంతో ఇక్కడ చేరిన ఒండ్రుమట్టిని తొలగిస్తున్నారు.
అపార నష్టం
గోదావరి వరదలతో పరీవాహక ప్రాంత రైతులకు అపార నష్టం వాటిల్లింది. ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైన ఏజెన్సీ రైతాంగానికి గోదావరి వరదలు మరోసారి కుంగదీశాయి. జిల్లాలోని పరీవాహక ప్రాంతంలో సుమారుగా 25 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. గోదావరి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పంటలకు ఏ మేరకు నష్టం జరిగిందనే విషయంపై వ్యవసాయశాఖాధికారులు అంచనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చేలల్లో పట్టిన వరద నీరు పూర్తిగా తగ్గితే పూర్తి స్థాయిలో నష్టంపై అంచనా వేయగలమని వ్యవసాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. అదే విధంగా పలు చోట్ల రహదారుల పైకి వరద నీరు రావడంతో రోడ్లు దెబ్బతిన్నాయి.
కోతకు గురైన రోడ్లకు మరమ్మతులు చేయించడం, పంట నష్టంపై తగిన అంచనాలు వేయడం లాంటి చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ ఇలంబరితి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో నష్ట పరిహారం అందజేసేందుకు అన్ని శాఖల అధికారులు నివేదికల తయారీలో తలమునకలయ్యారు.
అంధకారంలోనే గిరిజన గ్రామాలు
వరద తగ్గుముఖం పట్టినప్పటకీ ఇంకా అనేక గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరద్ధరించలేదు. దీంతో అవి ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. కూనవరం మండలంలో 48 గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయగా, బుధవారం 33 గ్రామాలకు పునరుద్ధరించారు. అదే విధంగా వీఆర్‌పురంలో ఇంకా 33 గ్రామాలకు, చింతూరులో 7 గ్రామాలకు విద్యుత్ సరఫరా లేదు.
దీంతో ఆయా గ్రామాల ప్రజలు రెండు రోజులుగా చీకట్లోనే గడుపుతున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహించడంతో విద్యుత్ స్తంభాలతో పాటు పలు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు నీటమునగటంతో ఎలాంటి ప్రమాదం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ట్రాన్స్ కో అధికారులు సరఫరాను నిలిపివేశారు. వరద తగ్గుముఖం పట్టడంతో లైన్లకు మరమ్మతులు చేసి యుద్ధప్రాతిపదికన సరఫరాను ఇచ్చేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు ట్రాన్స్‌కో డీఈ ప్రతాపరెడ్డి తెలిపారు.
వ్యాధులతో తస్మాత్ జాగ్రత్త
భారీ వర్షాలు, గోదావరి వరదలతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. దీంతో అంటువ్యాధులు విజృంభించే ప్రమా దం ఉందని ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చకుంటే పరిస్థితి చేయిదాటి పో యే ప్రమాదముందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు అంటున్నా రు.కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఈ విషయంలో యంత్రాంగాన్ని అ ప్రమత్తం చేయాలని పరీవాహక ప్రాంతప్రజలు కోరుతున్నారు.
శాంతించిన గోదారమ్మ
Published Thu, Sep 11 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement
Advertisement