5 రోజులు.. 6వేల క్యూసెక్కులు | five days | Sakshi
Sakshi News home page

5 రోజులు.. 6వేల క్యూసెక్కులు

Published Thu, Jul 30 2015 1:22 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

five days

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వరుణుడు కరుణ చూపుతాడన్న భరోసాతో ఇప్పటికే పంటలు సాగుచేస్తున్న రైతాం గాన్ని ఆదుకునేందుకు జూరాల ప్రాజెక్టు కింద రోజుకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని జిల్లా సాగునీటి సల హాబోర్డు(ఐఏబీ) సమావేశం నిర్ణయిం చింది. ఈ నీటిని ఆగస్టు 4వ తేదీ నుంచి ఐదురోజుల పాటు 6వేల క్కూసెక్కుల నీటిని విడుదల చేయాలని తీర్మానిం చింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూప ల్లి కృష్ణారావు అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఈ మేరకునిర్ణయించారు. ప్రియదర్శిని జూరా ల ప్రాజె క్టు, ఆర్డీఎస్‌తో పాటు జిల్లాలో ఉన్న పలు ఎత్తిపోతల పథకాలు, పనుల పురోగతిని చర్చించారు.
 
  రైతాంగాన్ని ఆదుకునేందుకు సూచనలు, సలహాలు ఇచ్చా రు. నీటిపారుదల శాఖ సీఈ ఖగేందర్ మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టులో ఆశించినస్థాయి కన్నా తక్కువ నీటిమట్టం ఉందని, ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి నీరందించే పరిస్థితి లేదన్నారు. 0.3 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వఉందని, ఇన్‌ఫ్లో కూడా 800 క్యూసెక్కులు మాత్రమే ఉందని వివరించారు. దీంతో ప్రస్తుతం ఉన్న నీటిని చివరి ఆయకట్టు వరకు పరిస్థితి లేదని అయితే రోజుకు 1200 క్యూసెక్కుల చొప్పున ఐదురోజుల పాటు నీరందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
 రైతాంగాన్ని ఆదుకుందాం: ఎమ్మెల్యేలు
 జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనవడంతో రైతులు అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని ర్యాలంపాడు రిజర్వాయర్ నీటిని విడుదల చేసి పత్తి రైతులను ఆదుకోవాలని కోరారు. చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వలేకపోయినా జూరాలలో ఉన్న నీటిని ఎన్ని ఎకరాలకు ఇవ్వగలిగితే అంతవరకు పైర్లు ఎండిపోకుండా తక్షణమే అందజేయాలని ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
 
 అనంతరం ఆర్డీఎస్‌పై ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వాటి పురోగతికి చెందిన పలు అంశాలను సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీఎస్ పనులు 85 శాతం పూర్తయినట్లు చెప్పడం సబబుకాదని, ఇది పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకుని కట్టించాల్సిందేనని అన్నారు. గతంలో కన్నా ఆర్డీఎస్‌పై ప్రస్తుతం 8 టీఎంసీల నీరు ప్రవహించడం కొంత పురోగతిని సూచిస్తుందన్నారు.
 
 జూరాల ప్రాజెక్టు నుంచి భీమా ప్రాజెక్టు నీటిని విడుదల చేయడం ద్వారా రైతాంగానికి అలాగే కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో పూర్తిస్థాయిలో సాగునీరందించాలంటే ఆల్మట్టి డ్యాం ఇంకా 60 టీఎంసీలు సామర్థ్యంతో మాత్రమే ఉందని 130 టీఎంసీల నీరు డ్యాంలోకి చేరితే తప్ప జూరాలకు నీరు వచ్చే అవకాశం లేదని సీఈ వెల్లడించారు. ఇప్పటివరకు పంటలు వేయని రైతాంగం ఆరుతడి పంటలను వేసుకోవడం మంచిందని జేడీఏ డెరైక్టర్ ఉష వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి, జిల్లా పరిషత్ ఛైర్మన్ భాస్కర్, జాయింట్ కలెక్టర్ రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement