మృతుల్లో ఇద్దరు హైదరాబాద్‌వాసులు
కొత్తకోట/భూత్పూర్: మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కొత్తకోటకు చెందిన స్నేహితులు జి.నగేష్ (17), హరీశ్ (21), శశాంక్‌రెడ్డి (21) గురువారం అర్ధరాత్రి సెకండ్ షో సినిమా చూసి భోజనం చేసేందుకు పెబ్బేరు వైపు బైక్‌పై బయలుదేరారు. నాటెల్లి సమీపంలోకి చేరుకోగానే బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెం దారు. మరో ఘటనలో హైదరాబాద్ మూసాపేటలోని భవానీనగర్‌కు చెందిన పల్లె విజయ్‌చక్రవర్తి (32), మహిళ మృతి చెందారు. అతడు డీబోల్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ ఆలయా న్ని దర్శించుకునేందుకు శుక్రవారం ఉదయం కారులో తన భార్య ఐశ్వర్య, కుమారుడు ఆదిక్, పనిమనిషి మల్లమ్మ (36), ఆమె కుమారుడు సంతోష్‌తో కలసి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారిపై భూత్పూర్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో విజయ్‌చక్రవర్తి, మల్లమ్మ అక్కడికక్కడే చనిపోయారు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
Published Sat, Mar 26 2016 4:14 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM
Advertisement
Advertisement