
పంటలకు ప్రాణం.. మూసీ వరద
అర్వపల్లి(నల్లగొండ): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నల్లగొండ జిల్లా గుండా ప్రవహిస్తున్న మూసీ నది జలకళను సంతరించుకుంది. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వరద భారీగా మూసీ నదికి వస్తోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి మూసీ నదికి వరద మొదలైంది. వర్షాభావంతో బోర్లు వట్టిపోయి అల్లాడిపోతున్న మూసీ నది వెంట రైతులకు ఈ వరద ప్రాణం పోసినట్లయింది. బోర్లలో నీటి మట్టం పెరిగి, నీటి కష్టాలు తీరనున్నాయి.