కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి అటవీ రేంజ్ పరిధిలో అటవీ శాఖ సిబ్బందిపై ఇద్దరు ప్రజా ప్రతినిధుల భర్తలు దాడి చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... టాటా ఏస్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కలపను గేట్‌కారేపల్లి వద్ద శనివారం అర్ధరాత్రి ఫారెస్ట్ రేంజ్ అధికారులు పట్టుకున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న కారేపల్లి ఎంపీపీ పద్మావతి భర్త రాందాస్, గ్రామ సర్పంచ్ ఈరి భర్త చిన్నా కలప అక్రమ రవాణాదారులకు మద్దతుగా దారి కాచి పాపకొల్లు సెక్షన్ అధికారి శ్రీనుపై దాడి చేసి గాయపరిచారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రాందాస్, చిన్నాలపై కేసు నమోదు చేశారు.
అటవీ అధికారిపై దాడి
Published Sun, Feb 21 2016 11:56 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement