ఏ ఒక్కరు వేలు పెట్టినా సహించను.. | Former Deputy CM RAJAIAH | Sakshi
Sakshi News home page

ఏ ఒక్కరు వేలు పెట్టినా సహించను..

Published Sat, Feb 14 2015 12:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

ఏ ఒక్కరు వేలు పెట్టినా సహించను.. - Sakshi

ఏ ఒక్కరు వేలు పెట్టినా సహించను..

ఎమ్మార్పీఎస్‌పై టీడీపీ దాడి సరికాదు
మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య


 రఘునాథపల్లి : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం విషయంలో ఏ ఒక్కరూ వేలు పెట్టినా సహించబోనని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నా నాయకుడు కేసీఆర్.. నా నియోజకవర్గ ప్రజలే దేవుళ్లు. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో అధికార పార్టీని, ఎమ్మెల్యే పదవిని తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేశా. ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా ఓటమి వెనుక గెలుపుంటుదని కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ బానోతు శారద, టీఆర్‌ఎస్ మండల క న్వీనర్ గొరిగె రవి, అడ్‌హక్ కమిటీ సభ్యులు నామాల బుచ్చయ్య, మారుజోడు రాంబాబు, గోపాల్‌నాయక్, గాదె సుధాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కుమార్‌గౌడ్, ఎంపీటీసీలు గవ్వాని నాగేశ్వర్, దొనికల రమాదేవి, మాలోతు నర్సింహా, యమున, సర్పంచ్‌లు పెండ్లి మల్లారెడ్డి, గాదె అరుణ, అక్కనపల్లి సత్యనారాయణ, నాయకులు గూడ సునిత, బొల్లపల్లి మధుసూదన్, చెంచు రమేష్, కాసర్ల లక్ష్మయ్య పాల్గొన్నారు.
 
    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement