నాలుగేళ్లకే నరకయూతన!
- వింత వ్యాధితో బాలుడి అవస్థలు
- వైద్యం కోసం రూ.6.50లక్షలకుపైగా ఖర్చు
- ఆస్తులు అమ్మినా నయంకాని జబ్బు
- ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
భేతాళపాడు(జూలూరుపాడు) : లేడిపిల్లలా గెంతాల్సిన పిల్లాడు నరకయూతన అనుభవిస్తున్నాడు.. వింత వ్యాధితో మంచానికే పరిమితమయ్యూడు.. కొడుకు ఆరోగ్యం బాగు చేరుుంచేందుకు ఆ తల్లిదండ్రులు ఉన్న ఆస్తిని అమ్మి వైద్యానికి ఖర్చు చేశారు.. కూలీ పనులకు వెళుతూ వచ్చిన డబ్బులతో మందులు తెస్తున్నారు.. దాతలు సాయం అందిస్తే కొడుకుకు పెద్దాస్పత్రిలో వైద్యం చేరుుస్తామని వేడుకుంటున్నారు. భేతాళపాడుకు చెందిన తూము నాగశంకర్, ఉపేంద్ర దంపతులకు ఇద్దరు సంతానం. రెండేళ్ల క్రితం పెద్ద కూతురుకు మూర్ఛ వ్యాధి రావడంతో ఆమె వైద్యానికి రూ.1.50లక్షలు ఖర్చు చేశారు. అదే సమయంలో రెండో సంతానమైన కొడుకు జస్వంత్‌కు 15 నెలల వయసులో ఫిట్స్ వ్యాధి వచ్చింది. దీంతో అనారోగ్యానికి గురయ్యూడు.
నాటి నుంచి నేటి వరకు కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం కోసం సుమారు రూ.6.50లక్షలు ఖర్చు చేశారు. అరుునా జస్వంత్ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఏ వ్యాధి సోకిందనే విషయం కచ్చితంగా నిర్ధారణ కాకపోవడం తో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బ్లడ్‌లో ఇన్‌ఫెక్షన్ రావడంతో అనారోగ్యానికి గురయ్యూడని వైద్యులు చెప్పినట్లు బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటివరకు 140 టెస్టులు చేసినా వ్యాధి నిర్ధారణ కాలేదంటున్నారు. జస్వంత్‌కు తరచూ జ్వరం, వణుకుడు రావడం, నాలుగేళ్ల వయసు వచ్చినా మాట్లాడలేకపోవడం, నిలబడలేక, శరీరం సహకరించకపోవడంతో మంచానికి పరిమితం కావాల్సి వస్తోంది. ప్రతి నెలా బాలుడికి రక్తం ఎక్కించడంతోపాటు వైద్యం కోసం సుమారు రూ.15వే నుంచి రూ.20 వేల ఖర్చు చేయాల్సి రావడంతో తల్లిదండ్రులకు భారంగా మారింది.
జస్వంత్ వైద్యం కోసం ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిని, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు, జత దుక్కిటెద్దులు, ఎడ్ల బండితోపాటు విలువైన బంగారు నగలు సైతం అమ్మారు. కొడుకు ఆరోగ్యం కోసం 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసినా ఫలితం లేకపోవగా అప్పులు పాలైనట్లు బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం నాగశంకర్, ఉపేంద్ర దంపతులు ఓ రేకుల షెడ్‌లో తలదాచుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించగా.. తర్వాత వర్తించదని చెప్పడంతో లక్షలాది రూపాయలు ఆస్పత్రిలో చెల్లించాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రస్తుతం ఆ దంపతులు కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల నుంచి జస్వంత్ వైద్యం కోసం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆ బాలుడి ఆరోగ్యం క్షీణిస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాతలు ముందుకొచ్చి తమ కొడుకును కాపాడాలని వేడుకుంటున్నారు. అలాగే సీఎం కేసీఆర్ స్పందించి తమ కొడుకును ఆదుకోవాలని బాలుడి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేయూల్సిన దాతలు 95501 92646 నంబర్‌లో సంప్రదించాలని, బ్యాంకు అకౌంట్ నం.62417429913 లో నగదు జమ చేయూలని వారు కోరారు.