Strange disease
-
కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఆపై
విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. వింత రోగంతో తొలుత కొడుకు, ఆ తర్వాత బిడ్డ ఇటీవల భార్య ఒక్కొక్కరుగా కన్నుమూశారు. వాంతులు, విరేచనాలతో తల్లిడిల్లి కానరాకుండా పోయారు. ఆ మరణాలకు కారణాలేమై ఉంటాయో ఇప్పటికీ తెలియకపోవడం మరో విషాదం. తాజాగా ఆ కుటుంబ యజమాని వేముల శ్రీకాంత్ తనవాళ్లలాగే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కరీంగనగర్ జిల్లా మండల కేంద్రమైన గంగాధరలో భయాందోళనలు రేపుతున్న ఘటన వివరాలిలా ఉన్నాయి... వేముల శ్రీకాంత్ కుటుంబం కొన్నేళ్ల నుంచి వాగు ఒడ్డున నివసిస్తోంది. ఆయనకు భార్య మమత, కూతురు అమూల్య (4), అద్వైత్ (2) ఉన్నారు. ఆయన స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబ ప్రయాణంలో తీరని విషాదం నవంబర్ 16న చోటుచేసుకుంది. శ్రీకాంత్ తనయుడు అద్వైత్ వాంతులు, విరేచనాలతో అవస్థ పడగా, ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడి మరణంతో ఆ తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. అయ్యో అమూల్య! తనయుడి మరణం నుంచి కోలుకోకుండానే శ్రీకాంత్ కూతురు అమూల్య కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డిసెంబర్ 4న కన్నుమూసింది. నెల వ్యవధిలోనే కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు, కూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. మరోవైపు తమ బిడ్డల్ని బలితీసుకున్న ఆ వింతరోగమేంటో తెలియని పరిస్థితి! బిడ్డల కర్మకాండలు పూర్తి చేసుకున్న శ్రీకాంత్, మమత దంపతులు ఇటీవల ధర్మపురిలో గంగ స్నానం ఆచరించి ఇంటికివెళ్లారు. అయితే, ఉన్నట్టుండి మమత అస్వస్థతకు గురైంది. చిన్నారుల ప్రాణాలు తీసిన వింతవ్యాధి ఆమెను కూడా ఉక్కిరిబిక్కిరిచేసింది. ప్రమాదాన్ని గ్రహించిన శ్రీకాంత్ క్షణం ఆలస్యం చేయకుండా భార్యను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మమత ఆదివారం తుదిశ్వాస విడిచింది. ఒక్కొక్కరుగా తనవారు దూరమవడంతో శ్రీకాంత్‌కు ఏడుపే మిగిలింది. అయితే, తమ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న ఆ వింతవ్యాధి ఏంటో తెలియడం లేదని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈక్రమంలోనే శ్రీకాంత్ కూడా అదే తరహాలో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అతని రక్త నమూనాలు, వారు వినియోగిస్తున్న నీటి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ముంబై పంపించామని వైద్య అధికారులు చెప్తున్నారు. అయితే, జిల్లా వైద్య అధికారులు ఆలస్యంగా స్పందించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
వింత వ్యాధి కలకలం?
సాలూరు: మన్యంలో వింత వ్యాధి మళ్లీ విజృంభిస్తోందని గిరిజనుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల 13న పాచిపెంట మండలంలోని కర్రివలస పంచాయతీ కంకణాపల్లి గ్రామంలో వింత వ్యాధితో మరణాలు సంభవించాయి. ఈ నెల రెండవ వారంలో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కాళ్లు, చేతులు, ముఖం పొంగి బాగా నీరసించిపోయారు. వెంటనే వారు పాచిపెంట పీహెచ్‌సీకి వెళ్లగా సాలూరు సీహెచ్‌సీకి రిఫర్ చేశారు. బాధితుల్లో గమ్మెల ప్రశాంత్ (21) పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ ప్రశాంత్ ఈనెల 13న మరణించాడు. సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కాగా సుమారు పదిమంది ఈ విధంగానే భాదపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తుల్లో భయాందోళన వింత వ్యాధితో సంభవిస్తున్న మరణాలపై గిరిజనుల్లో భయాందోళనలు అధికమవుతున్నాయి. ఈ విథమైన మరణాలపై గతేడాది జనవరి19వ తేదీన మన్యంలో మరణ మృదంగం శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఐటీడీఏ పీఒ కూర్మనాథ్ స్పందించి గ్రామంలో పర్యటించి వైద్యసేవలు ముమ్మరం చేశారు. కానరాని వింతవ్యాధి లక్షణాలు అయితే మళ్లీ ఈ నెలలో ఆ తరహా వ్యాధి ప్రబలడంతో పాచిపెంట పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పీవీ లక్ష్మిని వివరణ కోరగా, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, గ్రామంలో రెండు రోజులుగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ అనారోగ్య లక్షణాలు తప్ప వింత వ్యాధి లక్షణాలు ఎవరికి లేనట్లు గుర్తించామన్నారు.త్వరలో అందరికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. తాగునీరు సమస్య కారణం కావచ్చన్న అనుమానంతో తాగునీటి పరీక్షలు నిర్వహించగా ఎటువంటి సమస్య లేదని గుర్తించినట్లు ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకట చినఅప్పలనాయుడు తెలిపారు. దీనిపై ఐటీడీఏ పీఓ కూర్మనా«థ్ వివరణ కోరగా, గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశామన్నారు. గ్రామంలో వైద్యశిబిరాలు నిర్వహించినట్లు వైద్యాధికారులు చెప్పారని, ప్రజలెవరూ భయాందోళనలకు గురికావద్దని, తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా సమీప ఒడిశా నుంచి వస్తున్న సారా మన్యంలో ఏరులై పారుతున్న నేపథ్యంలో సారా తాగడం ఈ విధమైన వ్యాధులకు కారణం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో మెరుగైన వైద్యసేవలు అందించాలని, మన్యాల్లో సారా నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
పశ్చిమగోదావరి: మళ్లీ వింత వ్యాధి కలకలం..
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో మళ్లీ వింత వ్యాధి కలకలం రేపింది. అంతుచిక్కని వ్యాధి కొవ్వలి గ్రామానికీ విస్తరించింది. దీంతో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తమయ్యింది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్యచౌదరి గ్రామంలో మంగళవారం పర్యటించారు. ప్రజలెవరూ భయాందోళన చెందనవసరం లేదన్నారు. కాగా, జిల్లాలో అంతు చిక్కని వింత వ్యాధి పట్ల ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొన్ని రోజులుగా కొమరవోలు, పూళ్లలో విస్తరించిన అంతుచిక్కని వ్యాధిపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడంతో వ్యాధి ప్రభావం పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. చదవండి: నేనే శివుడిని.. నాకు ఏ టెస్టు వద్దు: పద్మజ వింత వ్యాధికి గురై డిశార్జ్ అయిన రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయం, వారు తీసుకుంటున్న ఆహార పానీయాలపై కూడా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇంటింటికి సర్వే కొనసాగుతుంది. ప్రజలు ఎవరు ఎక్కడా కూడా భయపడాల్సిన పరిస్థితి లేదని ఎక్కడైనా వింత వ్యాధి లక్షణాలు ఉంటే వారికి పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. చదవండి: ఉద్యోగాల పేరిట మోసం -
వారివి పసలేని విమర్శలు: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: అంతు చిక్కని వింత వ్యాధి పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు చేపట్టడంతో ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఈ వ్యాధి ప్రభావం పూర్తి స్థాయిలో అదుపులో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. శనివారం ఏలూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు కొట్టారు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసు బాబులతో వింత వ్యాధి నివారణపై అనుసరించవలసిన విధానం పై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వారం రోజులుగా భీమడోలు మండలం పూళ్ళ, దెందులూరు మండలం కోమిరేపల్లి గ్రామంలో వింత వ్యాధితో అనారోగ్యానికి గురైన ప్రజలకు అండగా నిలబడి పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు కల్పించి స్వయంగా ఆ గ్రామాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల పై ప్రత్యేకంగా వైద్య బృందాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. చదవండి: 8 గంటల్లో ఆరోగ్యశ్రీ కార్డు వింత వ్యాధికి గురై డిశార్జ్ అయిన రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయం, వారు తీసుకుంటున్న ఆహార పానీయాలపై కూడా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని ఇంటింటికి సర్వే కొనసాగుతుందని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని.. ప్రజలు ఎవరు ఎక్కడా కూడా భయపడాల్సిన పరిస్థితి లేదని ఎక్కడైనా వింత వ్యాధి లక్షణాలు ఉంటే వారికి పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సదుపాయం కల్పించడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకడానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించామని జాతీయ రహదారి వెంబడి హైవే పై ఉన్న గ్రామాలలో ఈ వింత వ్యాధి కనిపించడం పట్ల కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని, కెనాల్ ద్వారా నీటి సరఫరాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అని కూడా రూరల్ వాటర్ స్కీం అధికారులు పరిశీలిస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. చదవండి: ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ.. ప్రజలు వింత వ్యాధితో అనారోగ్యానికి గురై ఇబ్బందుల్లో ఉంటే కొంతమంది రాజకీయ స్వార్థంతో పసలేని విమర్శలు ప్రభుత్వంపై చేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో విమర్శలు కంటే రాజకీయ కోణం కంటే ప్రజల ఆరోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రజలకు అండగా ఉంటే బాగుంటుందని రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని అవగాహన లేని రాజకీయ ప్రకటనలు చేసే వారు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఆళ్ల నాని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసి వైద్య సదుపాయం కల్పించాలని అనారోగ్య బారిన పడిన ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైపే మొగ్గు చూపుతున్నారని దీన్నిబట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సదుపాయాలు ఎంత సక్రమంగా అందుతున్నాయో అర్థమవుతుందని ప్రతిదానిని రాజకీయ కోణంలో చూస్తూ విమర్శలు చేయడం రాజకీయ అజ్ఞానం అవుతుంది తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని అన్ని గ్రామ పంచాయతీలు ఏలూరు కార్పొరేషన్లో పారిశుధ్యం పై ఎప్పటికప్పుడు దృష్టిపెట్టి వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి మురుగు కాలువలలో ఉన్న పూడికను తొలగించడానికి అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. -
కొమిరేపల్లిలో వింతవ్యాధి
సాక్షి ప్రతినిధి ఏలూరు/దెందులూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో అంతుచిక్కని వ్యాధి దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామానికీ విస్తరించింది. గ్రామంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి 25 మంది ఫిట్స్‌తో పడిపోయారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గ్రామాన్ని సందర్శించి, గ్రామంలో ఇంటింటి సర్వే చేయించారు. బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్కడి పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. దీంతో ఆయన వెంటనే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్‌ను పంపించగా.. వారు బాధితులను కలిసి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి, బాధితులను వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందాలను పిలిపించారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సునంద, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ హెల్త్ డాక్టర్ గీతా ప్రసాదిని తదితరులు ఇక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించారు. ఇదిలావుండగా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ప్రభుత్వంపై ఆరోపణలు చేయగా, గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన ఘంటశాల వెంకటలక్ష్మి వైద్య శిబిరం వద్ద హడావిడి చేశారు. స్థానికులతో గొడవకు దిగిన జనసేన నేతలు ఒక దశలో జిల్లా ఎస్పీని సైతం తోసేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో వెంకటలక్ష్మి కింద పడిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులను తీసుకెళ్లే అంబులెన్స్‌కు అడ్డంగా కూర్చున్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : సీఎస్ ప్రజల ఆరోగ్యంపట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. కొమిరేపల్లిలో బాధితులు, వారి కుటుంబ సభ్యులను కలిసి ఏవిధంగా అనారోగ్యం పాలైందీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కుట్రే : ఆళ్ల నాని జిల్లాలో వరుస ఘటనల వెనుక ప్రజలు అనుకుంటున్నట్లుగానే తానూ రాజకీయ కుట్ర కోణం ఉన్నట్లు భావించాల్సి వస్తోందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. వ్యాధి నుంచి కోలుకున్న బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన ఆయన వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో వింత వ్యాధి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపామని, రిపోర్టులు వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, బాధితులను తరలిస్తుండగా జనసేన నేతలు అంబులెన్స్‌ను అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. ఇదంతా చూస్తుంటే జిల్లాలో ప్రజలకు ఏదో రాజకీయ కుట్ర జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయన్నారు. -
అంతుచిక్కని వ్యాధి: యంత్రాంగం అప్రమత్తం
సాక్షి, పశ్చిమగోదావరి: కొమరవోలు, పూళ్లలో కొందరు అస్వస్థతకు గురయ్యారని.. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైందని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు.అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. సీఎస్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ కమిషనర్లు ఏలూరు, పూళ్ల ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష) తాగునీరులో ఎలాంటి సమస్య లేదు: అనిల్‌కుమార్ పూళ్ల గ్రామంలోని తాగునీరులో ఎలాంటి సమస్య లేదని వైద్య, ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై విచారణ చేస్తున్నామని.. తాగునీరు, ఆహారం, కూరగాయల శాంపిల్స్ తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 22 మందిలో ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారని.. అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలిచ్చారని చెప్పారు. సీఎంకు సాయంత్రం నివేదిక ఇస్తామని అనిల్‌కుమార్ తెలిపారు. చదవండి: గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్ -
వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వెలుగుచూసిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలపై శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కె.భాస్కర్ హుటాహుటిన ఏలూరు బయలుదేరారు. పూళ్లలో నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.(చదవండి: పశ్చిమ గోదావరిలో వింతవ్యాధి కలకలం) అదుపులో పరిస్థితి: ఆళ్ల నాని పశ్చిమగోదావరి: కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటివరకు 22 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారని.. గ్రామంలో ‘108’ వాహనాలను ఏడు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. 25 మంది ఏఎన్‌మ్‌లు, ఆశావర్కర్లు ఇంటింటికి సర్వే చేస్తున్నారని, రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘మొన్నటి వరకు రాజకీయాల కోసం దేవుళ్లను లాగారు. జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వస్తున్నాయి. ఏదైనా కుట్ర జరిగి ఉండొచ్చని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తాం. ప్రజలెవరూ ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని’’ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.(చదవండి: పరుగులు పెడుతున్న పోలవరం పనులు) -
మన్యంలో మరణమృదంగం
సాక్షి, పాచిపెంట(శ్రీకాకుళం): మండలంలోని గిరిజన గ్రామాల్లో వింత వ్యాధులు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధి పేరు తెలియదు.. ఎందుకు వ్యాపిస్తుందో తెలియదు.. ఏం చికిత్స తీసుకోవాలో తెలియదు.. ఇంతలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మండలంలోని చిల్లమామిడి తరహాలోనే కర్రివలస పంచాయతీ కంకణాపల్లిలో కూడా వరుస మరణాలు నమోదవుతున్నాయి. కంకణాపల్లి 70 ఇళ్లలో సుమారు 300 మంది గిరిజనులున్నారు. ఏడాది కాలంలో కాళ్లు, చేతులు పొంగి 15 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గతంలో చిల్లమామిడిలో వింత వ్యాధితో పలువురు మృతి చెందడంతో అధికారులు స్పందించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. తమ గ్రామంలో కూడా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని కంకణాపల్లి వాసులు కోరుతున్నారు. చదవండి: కొండ దిగిన కోదండరాముడు ఏడుగురు.. రెండు నెలల వ్యవధిలో ఏడుగురు ఒకే రకమైనా వ్యాధి లక్షణాలతో మృతి చెందారు. కాళ్లు, చేతులు, ముఖం పొంగిపోవడంతో బాగా నీరసించిపోతున్నారు. కొద్దిరోజుల్లోనే మృత్యువాత పడుతున్నారు. గ్రామానికి చెందిన గెమ్మెల రామకృష్ణ (20) గెమ్మెల పాల్స్ (35), చోడిపల్లి నరసయ్య (60), గెమ్మెల కుమారి (35), కోనేటి ఆనిల్ (25), గెమ్మెల సుకరయ్య (55), గెమ్మెల మంగులమ్మ (45) రెండు నెలల వ్యవధిలోనే చనిపోయారు. చదవండి: పశ్చిమ గోదావరిలో వింతవ్యాధి కలకలం -
అరచేతుల్లో ప్రాణాలు.. ఆ ఊరికి ఏమైందో!
జయపురం: గోరుచుట్టుపై రోకటిపోటులా తయారైంది ఆ గ్రామస్తుల పరిస్థితి. ఒక పక్క కరోనా మహమ్మారి భయకంపితులను చేస్తుండగా మరో పక్క వింత వ్యాధితో ప్రతిరోజూ గ్రామస్తులు అకస్మాత్తుగా మరణిస్తున్నారు. ఈ పరిస్థితి నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితిలోని బొడొ అటిగాం గ్రామంలో దాపురించింది. గడిచిన మూడు, నాలుగు రోజుల్లో గ్రామంలోని 18 మంది వింత వ్యాధితో మృతి చెందారు. ఈ నేపథ్యంలో గ్రామప్రజలు భయంతో వణికిపోతున్నారు. (చదవండి: దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు!) వింత వ్యాధితో ఎప్పుడు ఎవరు మరణిస్తారో తెలియని స్థితిలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో దాదాపు 760 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇటీవల గ్రామంలో 18 మంది అకస్మాత్తుగా మరణించారని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. మరణించిన వారిలో ఒక ఏడాది లోపు వయసు వారు ముగ్గురు, 15 ఏళ్ల వయసు గల ఇద్దరు యువతులు, 25 నుంచి 35 ఏళ్ల వయసు వారు ఏడుగురు, 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వారు ఆరుగురు మరణించారని గ్రామప్రజలు వెల్లడించారు. వారంతా మొదట జ్వరం వచ్చి తరువాత వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురై మరణించారని చెబుతున్నారు. వింతవ్యాధితో గ్రామస్తులు మరణించడం భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రాని వైద్యబృందం అయితే గ్రామంలో వింత వ్యాధితో 18 మంది మరణించిన సమాచారం అధికారుల వద్ద లేనట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఆ గ్రామానికి వైద్యబృందం రాక పోవడమే దీనికి తార్కాణంగా నిలుస్తోంది. గ్రామంలో మినీ హెల్త్ కేంద్రం మాత్రం ఉందని హెల్త్ వర్కర్లు ఎవరూ లేరని అదుచేత ఎటువంటి అనారోగ్యం వచ్చినా తమకు వైద్య సేవలు అందడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై జిల్లా ప్రధాన వైద్యాధికారి (సీడీఎంఓ) శోభారాణి దృష్టికి తీసుకువెళ్లగా ఆ విషయం తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. వెంటనే ఒక వైద్య బృందాన్ని బొడొఅటిగాం గ్రామానికి పంపి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటామని చెప్పారు. అయితే ఒక గ్రామంలో 18 మంది మరణించినా అధికారులకు తెలియలేదంటే జిల్లాలో వైద్య విభాగం పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని పరిశీలకులు విస్తుపోతున్నారు. -
వింత వ్యాధితో ఐదుగురు గిరిజనుల మృతి
అనంతగిరి (అరకులోయ): విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ కరకవలస, చినరాబ గ్రామాల్లో మూడు వారాలు వ్యవధిలోని వింత వ్యాధితో ఐదుగురు గిరిజనులు మృత్యువాతపడ్డారు. దీనిపై అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ స్పందించి అధికారులతో మాట్లాడారు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు బుధవారం ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్ గ్రామాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించి, వింత వ్యాధి (కాళ్లు, చేతుల వాపులు)కి గల కారణాలపై ఆరా తీశారు. గురువారం ఉదయం వైద్య సిబ్బంది గ్రామాలకు చేరుకుని మూడు అంబులెన్స్‌లో కరకవలస, సొట్టడివలస, చినరాభ గ్రామాలకు చెందిన 18 మంది గిరిజనులను గజపతినగరం తరలించారు. వీరందరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ముందుస్తు చర్యల్లో భాగంగా వీరందరని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నిల్వ పశు మాంసమే కారణమా? నిల్వ పశు మాంసం తీసుకోవడంతో కరకవలస వాసులు అనారోగ్యం పాలవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఏ కారణంతో మరణాలు సంభవిస్తున్నాయి? కాళ్లు, చేతుల వాపులు ఎందుకు వస్తున్నాయనే దానిపై పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తే కాని చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. -
వింత వ్యాధి: నిద్ర లేకుండా 24ఏళ్లుగా..!
సాక్షి, గజ్వేల్: అసలే పేదరికం... ఆపై విధి వెక్కిరింతతో గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో ఓ యువకుని జీవనం నరకప్రాయంగా మారింది. పుట్టుకతోనే మతిస్థిమితం వైకల్యానికితోడూ నిద్రలేమి వ్యాధి సంక్రమించడంతో అతనికి 24ఏళ్లుగా కంటికి కునుకు కరువైంది. స్థోమత లేనికారణంగా ఖరీదైన వైద్యం చేయించుకోలేక, వ్యాధి తగ్గే మార్గం కరువై బాధిత యువకునితో గురువారం తల్లి భాగ్యమ్మ మర్కూక్ మండలం ఎర్రవల్లి సంద ర్శనకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిలను ఆశ్రయించింది. దీంతో వారు స్పందించి ప్రభుత్వం నుంచి రూ. 2.5లక్షల ఆర్థికసాయం అప్పటికప్పుడు అందజేశారు. కాపు కాయాల్సిందే.. అక్కారం గ్రామానికి చెందిన మాదరబోయిన భాగ్యమ్మ–రాజయ్య దంపతులకు కొడుకు సాయికుమార్‌తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరి సంతానంలో సాయికుమార్ రెండోవాడు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని ఈ కుటుంబానికి రెక్కల కష్టమే జీవనాధారం. చిన్నపాటి రేకుల ఇంటిలో ఈ కుటుంబం పూట గుడుపుకుంటుంది. కూతుర్లలో ఇద్దరి పెళ్లిళ్లు అతికష్టం మీద చేసి అత్తారింటికి పంపారు. మరో కూతురికి పెళ్లి చేయాల్సి ఉంది. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం రాజయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో వింత వ్యాధితో బాధపడుతున్న సాయికుమార్, మరో కూతురు పోషణ భారం భాగ్యమ్మపై పడింది. ప్రస్తుతం భాగ్యమ్మకు వస్తున్న వితంతు పింఛన్, సాయికుమార్‌కు వస్తున్న వికలాంగుల పింఛన్‌తో పాటు కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. చిన్నతనం నుంచి సాయికుమార్‌కు మతిస్థిమితంతో పాటు నిద్రలేమి వ్యాధి సంక్రమించడంతో తల్లి నానా ఇబ్బందులు పడుతోంది. రాత్రయిందంటే చాలు ఆమె గుండెల్లో గుబులు పుడుతుంది. రాత్రి సమయంలో కంటికి కునుకు రాని తన కొడుకు ఎక్కడికి వెళ్లిపోతాడోనని తల్లడిల్లుతోంది. గతంలో ఇలా ఎన్నోసార్లు జరిగింది కూడా. ఎక్కడైనా తప్పిపోతే అతను చెప్పే వచ్చిరానీ మాటలతో ఎవరైనా సమాచారం అందిస్తే తిరిగి ఇంటి వద్దకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కూడా అదే గుబులు తల్లిని వెంటాడుతోంది. సాయికుమార్ కోసం తల్లి కూడా నిద్రపోకుండా చాలాసేపు కాపు కాస్తుంది. పక్కింటివాళ్ల సాయంతో కొన్ని సందర్భాల్లో బయటకు రాకుండా గదిలో ఉంచడంతో అటో.. ఇటో కాలం గడుపుతోంది. యువకుని జీవితానికి నరకప్రాయంగా మారిన ఈ వ్యాధి నయమైతే తమ కుటుంబంలో వెలుగు వస్తుందని ఆరాటపడుతు న్నా... వైద్యం చేయించుకోవడానికి స్థోమత లేక ఆందోళన చెందుతోంది. ఇదే క్రమంలో గురువా రం మర్కూక్ మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లికి మాజీ మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డిలు వస్తున్నారన్న స మాచారం తెలుసుకున్న భాగ్యమ్మ తన కొడుకును వెంట తీసుకొని వారిని కలిసింది. తన కుమారుని పరిస్థితిని వివరించగా... చలించిన హరీశ్‌రావు, కలెక్టర్‌అప్పటికప్పుడే రూ. 2.5లక్షల ఆర్థికసా యం చెక్కును అందజేశారు. యువకుడి పరిస్థితి నయమయేంత వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పరిణామంతో బాధిత కుటుంబానికి ఊరట లభించినట్లయ్యింది. -
వింతవ్యాధితో విద్యార్థి మృతి
చీపురుపల్లి : ఇంతవరకు డెంగీ మహమ్మారి ప్రజలను బలిగొంటుంటే... తాజాగా స్క్రబ్ అనే మరో వింత వ్యాధి దానికి తోడయ్యింది. ఈ రెండు వ్యాధులతో పట్టణంలోని ఆంజనేయపురానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి ఎస్.సాయినివాస్(14) గురువారం మృతి చెందాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన కొడుకు కళ్లముందే అకస్మాత్తుగా మృతి చెందడాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అన్నపూర్ణ కాలనీలో నివాసం ఉంటున్న ఎస్.లక్ష్మాజీ కుమారుడు సాయి నివాస్ గరివిడిలో గల ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలునికి ఈ నెల 14న జ్వరం రాగా స్థానికంగా చికిత్స అందించిన అనంతరం విజయనగరంలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా డెంగీగా నిర్థారించారు. అంతేకాకుండా క్లినికల్ పాతాలజీలో స్క్రబ్ అనే వైరస్ కూడా పాజిటివ్ వచ్చినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. వెంటనే అక్కడి నుంచి విశాఖపట్నంలోని మైక్యూర్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా డెంగీ వీక్ పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్థారించారు. ఇదంతా జరుగుతుండగానే గురువారం తెల్లవారు ఝామున సాయి నివాస్ ప్రాణాలు పోయాయి. దీంతో స్వగ్రామమైన చీపురుపల్లికి సాయి నివాస్ మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేపట్టారు. -
అంపశయ్యపై ఆదివాసీ బిడ్డ
ఒరిస్సా : ఈ దీనురాలి ఆవేదన ఏ దూర తీరాలకు చేరగలదు. ఏ భగవంతునికి ఈ దీనురాలు తన మొరను నివేదించుకోగలదు. ఈ దీనురాలి కష్టం ఏ అధికారి హృదయాన్ని కదిలించగలదు. వింతరోగంతో బాధ పడుతున్న ఈ దీనురాలిని చూస్తున్న పలువురి హృదయాలు ద్రవిస్తున్నాయి తప్ప ఆమెకు న్యాయం జరిగే మార్గం కానరావడం లేదు.నిరుపేద కుటుంబంలో జన్మించడమే పాపమైతే, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి తోబుట్టువు సాయంతో జీవనం సాగిస్తున్న ఆదివాసీ బాలికకు తెలియని వింతరోగం సోకింది. దీంతో చేతులు చచ్చుబడిపోయి పొంగిపోయి ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉంది. తన అక్క గ్రామంలోని ఇళ్లలో పాచిపనిచేస్తూ జీవనం సాగిస్తుండగా పరిస్థితి విషమించడంతో పలుమార్లు జిల్లా అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాథుడు కరువయ్యారని వాపోయారు. రాయగడ జిల్లా పద్మపూర్ సమితి పేరుపంగ గ్రామానికి చెందిన మీతశొబొరొ అనే బాలిక జన్మించిన తర్వాత తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆమె అక్క పాచిపని చేస్తూ సోదరిని పోషించుకుంటూ వస్తోంది. అయితే ఇటీవల విధి వక్రించి మీతశొబొరొకు చేతికి సంబంధించిన ప్రమాదకరమైన జబ్బు సోకింది. దీనికి కటక్ పెద్దాస్పత్రిలో ఆపరేషన్ చేయిస్తే నయం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో పలువురు రాజకీయ నాయకులు, జిల్లా అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. కలెక్టర్ దయదలిచి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బాలికకు కావలసిన ఆర్థిక సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
విధి వంచితుడు
సాఫీగా సాగిపోతున్న కార్పెంటర్‌ను విధి చిన్నచూపు చూసింది. వింతవ్యాధి అతడిని వికలాంగుడిని చేసింది. కుటుంబ పోషణ భారమైన అతడికి వికలత్వ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించింది. పిల్లల చదువు, కుటుంబ పోషణ భారమై ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. మడకశిర: మడకశిర పట్టణంలోని పాత ఎస్సీ కాలనీకి చెందిన మచ్చయ్య కుటుంబం దీన స్థితిలో కొట్టిమిట్టాడుతోంది. ఇతను ఒకప్పుడు మంచి కార్పెంటర్. ఎంతో గౌరవంగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాన్ని వింతవ్యాధి కష్టాల్లోకి నెట్టింది. మచ్చయ్యకు భార్య సుమంగళి, కుమారుడు సూర్యప్రకాశ్, కుమార్తె అనుశ్రీ ఉన్నారు. ఈ పిల్లలిద్దరూప్రభుత్వ పాఠశాలలో 6, 4వ తరగతి చదువుకుంటున్నారు. మచ్చయ్యకు తల్లి నారాయణమ్మ కూడా ఉంది. తండ్రి జూలప్ప కొన్నేళ్ళ క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వింతవ్యాధితో కాలు తొలగింపు.. కుటుంబ పెద్ద అయిన మచ్చయ్యకు ఏడాది క్రితం వింత వ్యాధి సోకింది. ఎడమ కాలు స్పర్శ కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులు డాక్టర్లను సంప్రదించారు. గత ఏడాది మే నెలలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇతని ఎడమ కాలు తొలగించారు. కుడి కాలు కూడా క్రమేణా స్పర్శ కోల్పోతోంది. ఈ కాలును కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇదే సందర్భం లో మచ్చయ్య తల్లి నారాయణమ్మ కడుపులో కణితి ఏర్పడి అనారోగ్యానికి గురైంది. 11.50 కిలోల కణితిని హిందూపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తొలగించా రు. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో వైద్యానికి రూ.60 వేలు వెచ్చించాల్సి వచ్చింది. కుటుంబ పోషణంతా భార్యపైనే.. ప్రస్తుతం మచ్చయ్య కుటుంబ పోషణంతా భార్య సుమంగళిపై పడింది. ఈమె పరిగిలోని ఓ గార్మెంట్ పరిశ్రమకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. నెలకు వచ్చే రూ.6 వేలతో కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ కుటుంబానికి వ్యవసాయ భూమి కూడా లేదు. వైఎస్ఆర్ హయాంలో ఇల్లు మంజూరైంది. తమ పరిస్థితిని అర్థం చేసుకుని మచ్చయ్యకు వికలత్వ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని భార్య సుమంగళి, తల్లి నారాయణమ్మ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 90శాతం వికలాంగత్వం..అయినా అందని పింఛన్ మచ్చయ్యకు 90శాతం వికలత్వం ఉంది. డాక్టర్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా ప్రభుత్వం ఇంత వరకు పింఛన్ మంజూరు చేయలేదు. పింఛన్ కోసం పలుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితమూ లేదు. అదిగో ఇదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
చేయూతనివ్వండి
నల్లకుంట: అందరు పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన ఆ చిన్నారిని పుట్టుకతోనే వింత జబ్బు వెంటాడుతోంది. అయినా తల్లి దండ్రులు ఎంతో కష్టపడి, శక్తి మించినా దాతల సహాయంతో ఆ చిన్నారికి వైద్యం చేయిస్తున్నారు. కాళ్లు కొద్దిగా నయమైనప్పటికీ, చచ్చుబడిపోయిన చేతులకు ఆపరేషన్ చేయిస్తే కాని కదలేని పరిస్థితి. ప్రస్తుతం ఆ బాలిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న పాఠశాల యాజమాన్యం ఆమె తరగతి గదిని ఏటా గ్రౌండ్ ఫ్లోరోలోనే నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... నల్లకుంటకు చెందిన విజయ్ శేఖర్ కుమార్తె పూజ(15) పుట్టుకతోనే ఆమ్యో ప్లాసియోవ్యాధిలో బాధపడుతోంది. దాతల సాయంతో ఐదేళ్ల క్రితం రూ.10 లక్షలు ఖర్చు చేసి ఆ చిన్నారి కాళ్లకు బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించడంతో ఆమె నడవగలుగుతోంది. అయితే ఐదేళ్ల తర్వాత ఆమె చేతులకు కూడా సర్జరీ చేయించాలని వైద్యులు సూచించారు. అందుకు తగిన స్తోమత లేకపోవడంతో ఆర్థిక సాయం చేసే దాతలకోసం ఆమె తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆస్తినంతా అమ్మగా వచ్చిన సొమ్ము, దాతలు ఇచ్చిన విరాళాలతో కాళ్లకు శస్త్ర చికిత్స చేయించ గలిగామని, ప్రస్తుతం ఫిజియో థెరపీ చేయించేందుకు నెలకు రూ.10 వేలు ఖర్చవుతుందని వారు వాపోయారు. చేతుల ఆపరేషన్ చేయించేందుకు మరో రూ.10 లక్షలు ఖర్చవుతుందని, చేయూతనందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. దాతలు పీవీ. పూజ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ 013210100013223 నంబర్‌కు విరాళాలు పంపించి ఆదుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సెల్ నంబర్ 97056 47223. -
తలరాత మార్చుదాం...
బాధ్యతలు పెరిగితే భారం పెరిగినట్టుగా అనిపిస్తుంది. బాధ్యతల్ని ప్రేమిస్తే అసలు భారమే అనిపించదు. ఇంకొకరి భారం దించడంలో గొప్ప ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమ ఉన్న బాధ్యత మన మీద ఉంది. సహన అంటే సహనశక్తి ఉన్న మనిషి. పదేళ్ల నుంచి ఓ జబ్బు వల్ల సహన పెద్ద భారం మోస్తోంది. రండి... ఆ భారం దించుదాం. ఈ తలరాతను మార్చుదాం. అరుదైన ఓ వింత వ్యాధి ఈ నిరుపేద చిన్నారిని నరకయాతన పెడుతోంది. రోజురోజుకు పెరుగుతోన్న తల పరిమాణం ఆమెను అనుక్షణం అచేతనం చేస్తోంది. యాభై లక్షల మందిలో ఒకరికి పుట్టుకతో వచ్చే ‘అక్విడక్టల్ హైడ్రో సెఫలస్’అనే జబ్బు రోజుకు కొంత చొప్పున తలను పెంచుతూ మిగిలిన శరీర అవయవాలను కదలలేని స్థితికి తీసుకువెళుతోంది. పేదరికం, బిడ్డ ఆరోగ్యం బాగయ్యే పరిస్థితి లేకపోవటంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. బిడ్డల మంచిచెడూ పట్టించుకోలేని స్థితిలో తండ్రి ఉన్నాడు. దీంతో ఈ చిన్నారి, ఆమె ముగ్గురు అక్కా చెల్లెళ్ల బాధ్యతలను తాత, నానమ్మ తీసుకున్నారు. నలుగురినీ కంటికి రెప్పల్లా చేసుకుంటున్నారు. ఈ చిన్నారినైతే మరీనూ. కంటికి రెప్పే వేయకుండా కాపాడుకుంటున్నారు. అత్యాధునిక వైద్యంతో శస్త్ర చికిత్స చేస్తే తప్ప పెరుగుతున్న తల పరిణామం తగ్గదని వైద్యులు తేల్చేయటంతో పూట గడవటమే గగనమైన ఈ నిరుపేదలు.. ఆదుకునే వారి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎవరో ఒకరు తమ కష్టాన్ని తీర్చేందుకు వస్తారన్న నమ్మకంతో కాలం గడుపుతున్నారు. కష్టాల కడలి సికింద్రాబాద్ మాణికేశ్వర్‌నగర్ వడ్డెరబస్తీకి చెందిన సైదులు, సుజాతలకు నలుగురు ఆడపిల్లలు. వారిలో మూడవ కూతురు సహన. ముద్దుపేరు సాధన. పదేళ్ల వయసున్న సహన పుట్టుకతోనే అక్విడక్టల్ హైడ్రో సెఫలస్కి గురైంది. గాంధీ, నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు సహనకు ఐదేళ్ల వయసులో వైద్యపరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స చేసినా ఫలితం ఏ మాత్రం ఉంటుందో చెప్పలేమన్నారు. చేతిలో చిల్విగవ్వ లేక, చిన్నారి ఆరోగ్యం బాగుపడుతుందన్న భరోసానిచ్చేవారు కనిపించకపోవటంతో సహనను ఇంటికి తీసుకువచ్చారు. తండ్రి సైదులు భవన నిర్మాణ పనికి కూలీగా వెళ్లి గాయపడ్డాడు. అప్పట్నుంచీ ఏ పనీ చేయలేని స్థితిలో ఇంటిపట్టునే ఉంటున్నాడు. దీంతో పరిస్థితి మరింత దుర్భరమైపోయింది. బిడ్డ అనారోగ్యం, భర్త పని చేయలేకపోవడం, ఇంట్లో అందరికి కడుపులు నింపలేని దుస్థితిలో సహన త ల్లి సుజాత తట్టుకోలేకపోయింది. ఈ కష్టాలన్నింటికీ చావే పరిష్కారమనుకున్న సుజాత నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెక్కలు తెగిన పక్షులయ్యారు నలుగురు ఆడపిల్లలు. కన్నీరే సమాధానం ఇలా ఏ దిక్కు లేని ఈ పిల్లలకు తాత లింగయ్య, నానమ్మ లక్ష్మమ్మలే దిక్కయ్యారు. ఆ తర్వాత వృద్ధాప్యంతో లింగయ్య ఇంటికే పరిమితమయ్యాడు. నానమ్మ లక్ష్మమ్మ మాత్రం కుటుంబపోషణ కోసం నాలుగిళ్లలో పనిమనిషిగా చేరి, తన మనుమరాళ్లయిన స్వాతి, సంధ్య, మేఘనలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తోంది. తల భారంతో నడవటం కాదుకదా, కనీసం కూర్చోలేని సహనకు రోజంతా సపర్యలు చేస్తోంది. అన్ని విషయాలను చక్కగా గుర్తుపెట్టుకుని మాట్లాడుతుండే సహన నేల మీద నుండి కనీసం లేచే పరిస్థితి లేదు. భోజనం మొదలుకుని స్నానం వరకు నానమ్మ లక్ష్మమ్మ చేయించాల్సిందే. సహన భవిష్యత్తు విషయమై లక్షమ్మను కదలిస్తే కన్నీరే సమాధానమైంది. - ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ పెద్ద చదువులు చదువుతా స్కూల్కెళ్లి పెద్ద పెద్ద చదువులు చదవాలని ఉంది. యాక్టర్ మహేష్‌బాబును కలవాలని ఉంది. ఎప్పుడూ ఇంట్లోనే పడుకుని ఉండటం చాలా కష్టంగా ఉంది. అమ్మ కూడా లేదు. ఈ వయసులో నానమ్మను చాలా బాధ పెడుతున్నాను. - సహన చికిత్సకు మార్గముంది అక్విడక్టల్ హైడ్రోసెఫలస్ అనే జబ్బు మెదడుకు సంబంధించింది. శరీరంలో నీటి ప్రసరణ ఎలా ఉంటుందో మెదడులోనూ అలాగే ఉంటుంది. మెదడులో కొన్ని రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల ఇలా నీరు చేరి తల పెద్దదవుతూ ఉంటుంది. దీన్ని వెంట్రిక్యులొస్టొమీ చికిత్స ద్వారా నయం చేయచ్చు. 70 శాతం పైనే సక్సెస్ రేటు ఉంటుంది. దీనికి రెండులక్షల రూపాయలకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. శస్త్రచికిత్స అనంతరం కూడా మందులు వాడాలి. - డా. ప్రవీణ్ అంకతి సీనియర్ న్యూరోసర్జన్, గ్లోబల్ హాస్పిటల్ సహనను ఆదుకోవాలంటే.. నిరుపేద చిన్నారి సహనను బతికించేందుకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. సహన శస్త్ర చికిత్స లేదా ఆమె కుటుంబానికి అండగా ఉండాలనుకునే వారు 9505504787 లేదా 9010008796కు సంప్రదించవచ్చు. లేదా సహన, లింగయ్యల పేరున ఉన్న అకౌంట్ నెంబర్ 1102210026081 ‘దేనా బ్యాంక్, ఓయూ జామై ఉస్మానియా, సికింద్రాబాద్ (బ్యాంక్ కోడ్ 1106566322)కు జమ చేయొచ్చు. -
నాలుగేళ్లకే నరకయూతన!
- వింత వ్యాధితో బాలుడి అవస్థలు - వైద్యం కోసం రూ.6.50లక్షలకుపైగా ఖర్చు - ఆస్తులు అమ్మినా నయంకాని జబ్బు - ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు భేతాళపాడు(జూలూరుపాడు) : లేడిపిల్లలా గెంతాల్సిన పిల్లాడు నరకయూతన అనుభవిస్తున్నాడు.. వింత వ్యాధితో మంచానికే పరిమితమయ్యూడు.. కొడుకు ఆరోగ్యం బాగు చేరుుంచేందుకు ఆ తల్లిదండ్రులు ఉన్న ఆస్తిని అమ్మి వైద్యానికి ఖర్చు చేశారు.. కూలీ పనులకు వెళుతూ వచ్చిన డబ్బులతో మందులు తెస్తున్నారు.. దాతలు సాయం అందిస్తే కొడుకుకు పెద్దాస్పత్రిలో వైద్యం చేరుుస్తామని వేడుకుంటున్నారు. భేతాళపాడుకు చెందిన తూము నాగశంకర్, ఉపేంద్ర దంపతులకు ఇద్దరు సంతానం. రెండేళ్ల క్రితం పెద్ద కూతురుకు మూర్ఛ వ్యాధి రావడంతో ఆమె వైద్యానికి రూ.1.50లక్షలు ఖర్చు చేశారు. అదే సమయంలో రెండో సంతానమైన కొడుకు జస్వంత్‌కు 15 నెలల వయసులో ఫిట్స్ వ్యాధి వచ్చింది. దీంతో అనారోగ్యానికి గురయ్యూడు. నాటి నుంచి నేటి వరకు కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం కోసం సుమారు రూ.6.50లక్షలు ఖర్చు చేశారు. అరుునా జస్వంత్ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఏ వ్యాధి సోకిందనే విషయం కచ్చితంగా నిర్ధారణ కాకపోవడం తో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ రావడంతో అనారోగ్యానికి గురయ్యూడని వైద్యులు చెప్పినట్లు బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటివరకు 140 టెస్టులు చేసినా వ్యాధి నిర్ధారణ కాలేదంటున్నారు. జస్వంత్‌కు తరచూ జ్వరం, వణుకుడు రావడం, నాలుగేళ్ల వయసు వచ్చినా మాట్లాడలేకపోవడం, నిలబడలేక, శరీరం సహకరించకపోవడంతో మంచానికి పరిమితం కావాల్సి వస్తోంది. ప్రతి నెలా బాలుడికి రక్తం ఎక్కించడంతోపాటు వైద్యం కోసం సుమారు రూ.15వే నుంచి రూ.20 వేల ఖర్చు చేయాల్సి రావడంతో తల్లిదండ్రులకు భారంగా మారింది. జస్వంత్ వైద్యం కోసం ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిని, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు, జత దుక్కిటెద్దులు, ఎడ్ల బండితోపాటు విలువైన బంగారు నగలు సైతం అమ్మారు. కొడుకు ఆరోగ్యం కోసం 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసినా ఫలితం లేకపోవగా అప్పులు పాలైనట్లు బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం నాగశంకర్, ఉపేంద్ర దంపతులు ఓ రేకుల షెడ్లో తలదాచుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించగా.. తర్వాత వర్తించదని చెప్పడంతో లక్షలాది రూపాయలు ఆస్పత్రిలో చెల్లించాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆ దంపతులు కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల నుంచి జస్వంత్ వైద్యం కోసం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆ బాలుడి ఆరోగ్యం క్షీణిస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాతలు ముందుకొచ్చి తమ కొడుకును కాపాడాలని వేడుకుంటున్నారు. అలాగే సీఎం కేసీఆర్ స్పందించి తమ కొడుకును ఆదుకోవాలని బాలుడి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేయూల్సిన దాతలు 95501 92646 నంబర్లో సంప్రదించాలని, బ్యాంకు అకౌంట్ నం.62417429913 లో నగదు జమ చేయూలని వారు కోరారు.