ప్రాజెక్టులు ఎవరి పరిధో తేల్చేద్దాం! | Framework notification issued in Godavari Board | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు ఎవరి పరిధో తేల్చేద్దాం!

Published Fri, Dec 9 2016 2:46 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

ప్రాజెక్టులు ఎవరి పరిధో తేల్చేద్దాం!

ప్రాజెక్టులు ఎవరి పరిధో తేల్చేద్దాం!

22న గోదావరి బోర్డు భేటీ
  తెలంగాణ, ఏపీలకు నోటీసులు
  వర్కింగ్ మాన్యువల్‌పై చర్చిద్దామని వెల్లడి
  6 రాష్ట్ర ప్రాజెక్టులను తన పరిధిలోకి తీసుకెళ్త్తామన్న బోర్డు
   వ్యతిరేకిస్తున్న తెలంగాణ  

 
 సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని తేల్చి, తుది నోటిఫికేషన్ జారీ చేసేందుకు గోదావరి బోర్డు సమాయత్తమవుతోంది. ఇప్పటికే ప్రాజెక్టుల నియంత్రణపై ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన బోర్డు.. తెలంగాణలోని ఆరు ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంటా మని పేర్కొంది. దీనిపై చర్చించేందుకు ఈ నెల 22న ప్రత్యేకంగా సమావేశం నిర్వ హించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సమా వేశ తేదీలపై స్పష్టతనిస్తూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ గురువారం నోటీసులు ఇచ్చా రు. ముసాయిదా నోటిఫికేషన్‌పై అభ్యంతరా లుంటే ఈ భేటీలో చర్చిద్దామని సూచించారు. బోర్డు తయారు చేసిన వర్కింగ్ మాన్యువల్‌ను సైతం నోటీసుకు జత చేసి పంపారు.
 
 ఏ ప్రాజెక్టు ఎవరి పరిధిలోకి..

 తెలంగాణ సాగు, తాగు అవసరాలను తీరు స్తున్న శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టు లను తన పరిధిలోకి తెచ్చుకుంటామంటూ బోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొం ది. ఆయా ప్రాజెక్టుల బ్యారేజీ హెడ్‌వర్క్స్, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, రెగ్యు లేటర్లతో పాటు విద్యుత్ పాంట్ల హెడ్‌వర్క్ లు, రిజర్వాయర్ల పరిధిలోని ఎత్తిపోతల పథ కాలు, నీటి విడుదల చేసే ఇతర నిర్మాణాలన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయని తెలిపింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో రాష్ట్ర విభజన సమ యానికి ఉన్న నీటి కేటారుుంపులనే విని యోగించుకోవాలంది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. గోదావరిలో   1,480 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా.. 880 టీఎం సీలకు మించి వాడటం లేదని... మొత్తంగా తెలంగాణకు 954.23 టీఎంసీల వాటా ఉంటే 450 టీఎంసీలే వినియోగమవుతున్నాయని, ఏపీకి ఉన్న 530 టీఎంసీల వాటాలో 450 టీఎంసీలే వినియోగిస్తోందని వివరించింది. ఈ వినియోగాలు ఏ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దెబ్బతీయడం లేదని స్పష్టం చేసింది. అసలు గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టులేవీ లేనందున వాటిని బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని వివరించింది.
 
 ఏపీ అడ్డగోలు వాదనలు
 ఏపీ మాత్రం బోర్డు ఎదుట అడ్డగోలు వాదనలు చేస్తోంది. ముసాయిదాలో బోర్డు పేర్కొన్న ఆరు ప్రాజెక్టులతోపాటు తెలంగాణ చేపడుతున్న కాళేశ్వరం, తమ్మిడిహట్టి, రాజాపేట, ఛనాఖా-కొరట, పింపార్డ్, తుపాకులగూడెం, సీతారామ, సదర్‌మఠ్ ప్రాజెక్టులను సైతం బోర్డు పరిధిలోకి తేవాలంటూ ఒత్తిడి తెస్తోంది. బోర్డు కూడా ఆ ఆరు ప్రాజెక్టులతో పాటు గోదావరి నీటిని వినియోగించుకుంటూ చేపట్టే ప్రాజెక్టు లన్నింటిపైనా తమ పర్యవేక్షణ ఉంటుందని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ అంశాలు రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించింది.
 
 పరిష్కారం దొరక్కుంటే అపెక్స్‌కు వెళ్లొచ్చు
 బోర్డు గురువారం విడుదల చేసిన వర్కింగ్ మాన్యువల్‌లో అపెక్స్ కౌన్సిల్ అంశంపై స్పష్టతనిచ్చింది. ఏదైనా అంశంపై బోర్డు సమావేశంలో స్పష్టత రాని పక్షంలో, లేదా బోర్డులో తమకు పరిష్కారం దొరకదని భావించిన పక్షంలో రాష్ట్రాలు కానీ, బోర్డు కానీ నేరుగా అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లవచ్చని పేర్కొంది. ఇక పునర్విభన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న మేరకు కేంద్రం గుర్తించి గెజిట్‌లో పేర్కొన్న ప్రాజెక్టులపై తమ నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement