గ్యాంగ్‌రే ప్ కేసును నేరుగా విచారిస్తా
జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్
బాధితురాలితో మాట్లాడిన ఎస్పీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వీణవంక మండలం చల్లూరుకు చెందిన యువతి(20)పై మానవ మృగాల సామూహిక అత్యాచారం సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచ లనం సృష్టించడంతో జిల్లా ఎస్పీ జోయల్‌డేవిస్ నేరుగా రంగంలోకి దిగారు. లోతైన విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు సోమ వారం బాధితురాలిని, ఆమె కుటుంబసభ్యులను స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ద్వారా తన కార్యాలయానికి పిలిపించుకుని సుమారు రెండున్నర గంటలపాటు విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుకు ఇకపై తానే విచారిస్తానని ప్రకటించారు. నిందితులపై నిర్భయతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఐటీ యూక్ట్‌లో కేసులు నమోదు చేశామన్నారు. విచారణకు స్పెషల్ టీం ఏర్పాటు చేశామన్నారు. మొదటి ఏ1ను అరెస్టు చేసి రిమాండ్ చేయడంతో పాటు మరో ఇద్దరు మైనర్లు కావడంతో వారిని కూడా జువైనల్‌కు తరలించామని తెలిపారు. నిందితులు అంజి, రాకేశ్‌లు మైనర్లనే విషయంపై వైద్య పరీక్షల ద్వారా నిందితుల వయస్సు నిర్ధారించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ మేరకు మెడికల్ బోర్డుకు లేఖ రాశామన్నారు. బాధితురాలితోపాటు ఆమె స్నేహితురాలిని కూడా తానే విచారిస్తానన్నారు. సాధ్యమైనంత త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేయడంతోపాటు 2, 3 నెలల్లోనే నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యముంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాధితురాలికి కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు వెద్య సాయం అందిస్తామన్నారు. బాధితురాలిపై జరిగిన అత్యాచార వీడియో సర్క్యులేట్ కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు