వైద్యం వికటించి బాలిక మృతి చెందిందని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో శనివారం చోటుచేసుకుంది. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రసికంటి శైని(8) అనే బాలిక గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది.
ఈ క్రమంలో ఆమె తల్లి దండ్రులు చికిత్స నిమిత్త సిరిసిల్లలోని ప్రైవేట్ వైద్యుడు వీరేందర్ ఆర్.ఎమ్.పీ. వద్దకు తీసుకొచ్చారు. అతను పాపను పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ చేసిన కొద్ది సేపటికే బాలిక మృతిచెందడంతో.. బాలిక తల్లిదండ్రులు బంధువులు వైద్యం వికటించడం వల్లే బాలిక మృతిచెందిందని.. ఆందోళనకు దిగారు.