Virender
-
జీవితం తీరూతెన్నూ మార్చిన కరోనా
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పటివరకు సాఫీగా సా గిన జీవనయానం ఇక ముందు అలాగే ఉండబోదు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు.. ఆ తరువాత రోజుల్లో ఎదురయ్యే సమస్యలకు ఎలాంటి పొంతన ఉండదు. అందరి జీవితాల్లో ఎంతోకొంత మేర మార్పులు సహజం’ అంటున్నారు మానసిక నిపుణులు. వివిధ వర్గాలు ముఖ్యంగా దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజల జీవితాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని, మనిషి ప్రవర్తన, సంబంధాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా 220 మందిని 21 అంశాలపై సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్, సోషియాలజీ ప్రొఫెసర్ రామయ్య వివిధ ప్రశ్నలను అడిగి సమాధానాలను రాబట్టారు. కరోనాతో ముడిపడిన వివిధ అంశాలు, అవి చూపే ప్రభావాలు, వివిధ వర్గాల ప్రజల ఆలోచన తీరు, ఏయే విషయాల్లో మార్పులొస్తాయనే దానిపై అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలను, దీనిపై తాము చేసిన విశ్లేషణలను వీరేందర్ ‘సాక్షి’కి తెలిపారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. బతకాలంటే సవాళ్లు ఎదుర్కోవాల్సిందే.. కరోనాతో వ్యక్తిగత జీవితంలో, మనుషుల వైఖరుల్లో మార్పులొస్తాయి. ఆలోచనలు, ప్ర వర్తన, జీవనశైలి, అటవాట్లు మారతాయి. కు టుంబం, వ్యక్తులు, డబ్బు.. వీటి ప్రాధాన్యత మారుతుంది. వ్యక్తుల మధ్య సామాజికంగా, వ్యక్తిగతంగా మార్పులు తప్పవు. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సందర్భంలో, తదనంతరం ఎదురయ్యే పరిణామాలను ఎవరికి వారు తమ పరిధుల్లో ఎదుర్కొనేందుకు తగిన పద్ధతులు, విధానాలను సిద్ధం చేసుకోవాలి. కనువిప్పు కలిగించింది.. కరోనా ప్రభావంతో ఎదురయ్యే ఒత్తిళ్లతో వివి ధ అంశాల్లో అనిశ్చితి చోటుచేసుకుంటుంది. వైవాహిక సంబంధాలు, విడాకులు వంటి వా టిపైనా కరోనా ప్రభావం పడింది. విహారయాత్రలు, విదేశీ ప్రయాణాలు వంటివి చేపట్టకూడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ గడ్డు కాలంలోనూ మనుషుల్లో మానవత్వం వికసించింది. సమాజం చెడిపోయిందని నిరాశ, నిస్పృహలతో ఉన్న వారికి కరోనా సమయం కనువిప్పు కలిగించింది. -
నేనే చంపాను.. కాదు నేనే చంపాను!
న్యూఢిల్లీ: దేశరాజధానిలో మద్యం తాగి భార్యను రోజూ వేధిస్తున్న వీరేందర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గురువారం కూడా మద్యం తాగి వచ్చి గొడవచేయటంతో భార్య మిథిలేశ్, ముగ్గురు పిల్లలు కత్తితో తండ్రిపై దాడిచేశారు. దీంతో వీరేందర్ అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులకు వింత పరిస్థితి ఎదురైంది. వీరేందర్‌ను హత్యచేసింది నేనంటే నేనేనంటూ ముగ్గురు పిల్లలు, భార్య పోలీసుల ముందుకు వచ్చారు. అయితే.. స్థానికుల సమాచారం, బంధువుల విచారణ ఆధారంగా.. పెద్ద కుమారుడిని అరెస్టు చేశారు. -
వైద్యం వికటించి బాలిక మృతి
వైద్యం వికటించి బాలిక మృతి చెందిందని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో శనివారం చోటుచేసుకుంది. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రసికంటి శైని(8) అనే బాలిక గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె తల్లి దండ్రులు చికిత్స నిమిత్త సిరిసిల్లలోని ప్రైవేట్ వైద్యుడు వీరేందర్ ఆర్.ఎమ్.పీ. వద్దకు తీసుకొచ్చారు. అతను పాపను పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ చేసిన కొద్ది సేపటికే బాలిక మృతిచెందడంతో.. బాలిక తల్లిదండ్రులు బంధువులు వైద్యం వికటించడం వల్లే బాలిక మృతిచెందిందని.. ఆందోళనకు దిగారు. -
పత్రాల లీక్ కేసులో ‘రక్షణ’ కార్మికుడు అరెస్ట్
న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారంలో అరెస్టయినవారి సంఖ్య 13కు చేరిం ది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ కార్మికుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. చమురు శాఖలో పత్రాల లీక్‌లో కీలక నిందితుడికి అతను నకిలీ ఐడీ కార్డును అందించి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బొగ్గు, విద్యుత్ మంత్రి త్వ శాఖల్లోనూ పత్రాల లీక్ వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. పత్రాల లీకేజీలో రక్షణ శాఖలో క్యాజువల్ వర్కర్‌గా పనిచేస్తున్న వీరేందర్‌కుమార్ నిందితులకు సహకరించి నట్లు పోలీసులు గుర్తించారు. ఇండియన్ డిఫె న్స్ అకౌంట్స్‌సర్వీస్ అధికారి ఐడీ కార్డును వీరేందర్ దొంగిలించి నకిలీ కార్డును తయారుచేసి నిందితులు లల్తా ప్రసాద్, రామ్‌కుమార్ కు ఇచ్చాడని, దాంతోపాటు రక్షణ శాఖ లెటర్‌హెడ్‌ను వాడుకుని వాళ్లు వివిధ శాఖల్లోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు చెప్పారు. కాగా కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలని కాంగ్రెస్ లోక్‌సభలో డిమాండ్ చేసింది. -
ప్రేమికుల రోజు నిషేధానికి సహకరించండి
కలెక్టరేట్: ప్రేమికుల రోజును నిషేధించడంలో తమ కార్యకర్తలకు ప్రభుత్వం సహకరించాలని, దీనివల్ల భారతదేశ సంస్కృతిని కాపాడినట్లవుతుందని బజరంగ్దళ్ హిందీనగర్ జిల్లా ప్రముఖ్ వీరేందర్ కోరారు. గురువారం నాంపల్లిలోని కాశీ విశ్వనాథ దేవాలయంలోబజరంగ్దళ్, వీహెచ్‌పీ నాయకులు సంయుక్తంగా ‘బ్యాన్ వాలెంటైన్స్‌డే-సేవ్ భారత్’ పేరుతో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రేమకు ప్రతి రూపమైన భారతదేశ సంస్కృతిని ఇటువంటి కార్యక్రమాలతో విదేశీ శక్తులు కలుషితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సహ కార్యదర్శి గిరిధర్, కిరణ్, రాకేష్, లక్ష్మణ్, సాయి, శంకర్ పాల్గొన్నారు. వీహెచ్‌పీని అడ్డుకోవాలని సీపీఐ వినతి హిమాయత్‌నగర్: ప్రేమికుల దినోత్సవం రోజున ‘జంటలు బహిరంగంగా కనిపిస్తే పెళ్లి చేస్తామ’ంటూ హెచ్చరిస్తున్న విశ్వహిందూ పరిషత్, శివసేనల ఆగడాలను అడ్డుకోవాలని సీపీఐ నార్త్ జోన్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్, తదితరులు గురువారం అదనపు సీపీ అంజనీ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అసాంఘిక కార్యకలాపాల పేరుతో ఆ సంస్థలు ఈనెల 14న యువతీ యువకులపై తమ ప్రతాపం చూపుతామంటూ కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో ప్రచారం చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి వారి నుంచి కాపాడాలని ఏసీపీని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వేణు, యువజన నాయకురాలు ఉషారాణి, సీపీఐ నాయకులు రాకేష్‌సింగ్, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. నీతి బాహ్య చర్యకు అడ్డుకట్ట వేయండి సిటీబ్యూరో: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి నీతి బాహ్యమైన చర్యలు జరుగకుండా కట్టడి చేయాలని మెరాజ్ ఖాన్ ఉమెన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మెరాజ్ ఖాన్ రాష్ర్ట గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రేమికుల దినోత్సవం పేరుతో జరిగే చర్యలతో శాంతికి భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గవర్నర్ స్పందిస్తూ దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చార ని తెలిపారు. -
తెలంగాణ మంత్రులతో భేటీ
వినతిపత్రం సమర్పించిన ముంబై తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ముంబై నుంచి తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. బృందంలోనినాయకులు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పూలబొకే అందజేసి ముంబైలో ఉంటున్న తెలంగాణ ప్రజల తరపున అభినందనలు తెలియజేశారు. సోమవారం పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. ముంబైలోని వలస ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర ఇబ్బందులు, పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రులకు అందజేశారు. ఈ బృందం ఈ నెల ఏడున ముంబై నుంచి బయలుదేరింది. కేసీఆర్, మంత్రులతో భేటీ అయిన వారిలో వేదిక నాయకులు బత్తుల లింగం, ఎడ్ల సత్తయ్య, స్వామి, వీరేందర్, అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ జేఏసీ కార్యదర్శి నల్లా రాధాకృష్ణ, సత్తిరెడ్డితోపాటు వీళ్లంతా సచివాలయం డి-బ్లాక్‌లోని మంత్రుల కార్యాలయలకు వె ళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీఓ అధ్యక్షుడు, కార్యదర్శి దేవి ప్రసాద్, కారం రవీందర్‌రెడ్డితోనూ భేటీ అయ్యారు.