సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పటివరకు సాఫీగా సా గిన జీవనయానం ఇక ముందు అలాగే ఉండబోదు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు.. ఆ తరువాత రోజుల్లో ఎదురయ్యే సమస్యలకు ఎలాంటి పొంతన ఉండదు. అందరి జీవితాల్లో ఎంతోకొంత మేర మార్పులు సహజం’ అంటున్నారు మానసిక నిపుణులు. వివిధ వర్గాలు ముఖ్యంగా దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజల జీవితాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని, మనిషి ప్రవర్తన, సంబంధాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.
ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా 220 మందిని 21 అంశాలపై సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్, సోషియాలజీ ప్రొఫెసర్ రామయ్య వివిధ ప్రశ్నలను అడిగి సమాధానాలను రాబట్టారు. కరోనాతో ముడిపడిన వివిధ అంశాలు, అవి చూపే ప్రభావాలు, వివిధ వర్గాల ప్రజల ఆలోచన తీరు, ఏయే విషయాల్లో మార్పులొస్తాయనే దానిపై అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలను, దీనిపై తాము చేసిన విశ్లేషణలను వీరేందర్ ‘సాక్షి’కి తెలిపారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
బతకాలంటే సవాళ్లు ఎదుర్కోవాల్సిందే..
కరోనాతో వ్యక్తిగత జీవితంలో, మనుషుల వైఖరుల్లో మార్పులొస్తాయి. ఆలోచనలు, ప్ర వర్తన, జీవనశైలి, అటవాట్లు మారతాయి. కు టుంబం, వ్యక్తులు, డబ్బు.. వీటి ప్రాధాన్యత మారుతుంది. వ్యక్తుల మధ్య సామాజికంగా, వ్యక్తిగతంగా మార్పులు తప్పవు. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సందర్భంలో, తదనంతరం ఎదురయ్యే పరిణామాలను ఎవరికి వారు తమ పరిధుల్లో ఎదుర్కొనేందుకు తగిన పద్ధతులు, విధానాలను సిద్ధం చేసుకోవాలి.
కనువిప్పు కలిగించింది..
కరోనా ప్రభావంతో ఎదురయ్యే ఒత్తిళ్లతో వివి ధ అంశాల్లో అనిశ్చితి చోటుచేసుకుంటుంది. వైవాహిక సంబంధాలు, విడాకులు వంటి వా టిపైనా కరోనా ప్రభావం పడింది. విహారయాత్రలు, విదేశీ ప్రయాణాలు వంటివి చేపట్టకూడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ గడ్డు కాలంలోనూ మనుషుల్లో మానవత్వం వికసించింది. సమాజం చెడిపోయిందని నిరాశ, నిస్పృహలతో ఉన్న వారికి కరోనా సమయం కనువిప్పు కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment