నేనే చంపాను.. కాదు నేనే చంపాను!
న్యూఢిల్లీ: దేశరాజధానిలో మద్యం తాగి భార్యను రోజూ వేధిస్తున్న వీరేందర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గురువారం కూడా మద్యం తాగి వచ్చి గొడవచేయటంతో భార్య మిథిలేశ్, ముగ్గురు పిల్లలు కత్తితో తండ్రిపై దాడిచేశారు. దీంతో వీరేందర్ అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులకు వింత పరిస్థితి ఎదురైంది.
వీరేందర్‌ను హత్యచేసింది నేనంటే నేనేనంటూ ముగ్గురు పిల్లలు, భార్య పోలీసుల ముందుకు వచ్చారు. అయితే.. స్థానికుల సమాచారం, బంధువుల విచారణ ఆధారంగా.. పెద్ద కుమారుడిని అరెస్టు చేశారు.