రంగారెడ్డి జిల్లా: బుధవారం మధ్యాహ్నం ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. బంట్వారం మండలం సల్‌బత్తాపూర్ గ్రామంలో అనూష(12) అనే బాలిక అనుమానస్పదంగా మరణించింది.
రుద్రారం గ్రామానికి చెందిన వెంకటప్ప, నర్సమ్మ దంపతుల కుమార్తె అనూష అమ్మమ్మ ఊరైన సల్‌బత్తాపూర్‌కు వచ్చింది. ఆమె అమ్మమ్మ, తాతయ్యలు బుధవారం పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో అనూష ఒక్కటే ఉంది. మధ్యాహ్నం పొలం నుంచి ఇంటికొచ్చే సరికి అనూష అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బాలుకను ఎవరో హతమార్చి ఉంటారని వారు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలిక అనుమానాస్పద మృతి
Published Wed, Nov 4 2015 4:40 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement