సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని చేప విత్తన చెరువులను ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. మొత్తం 28 చేప విత్తన చెరువుల్లో నాలుగైదు మాత్రమే ఉనికిలో ఉన్నాయని... మిగిలినవి పడావుపడి పోయినందున వాటిలో 20 చెరువులను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఆ చెరువులను ఐదేళ్లకు లీజుకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. త్వరలో వీటికి టెండర్లు ఖరారు చేయనున్నారు. అయితే వీటిని రెండు విధాలుగా పీపీపీ పద్ధతిలో లీజుకిచ్చే అవకాశాలున్నాయి. ఒకటి పూర్తిగా లీజుకు ఇవ్వడం... రెండోది లీజుతోపాటు కొంత విత్తనాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా మరో పద్ధతి ద్వారా టెండర్ ఖరారు చేయడం. ఏది అనుకూలమో దానికి అనుగుణంగా లీజుకు ఇవ్వనున్నారు.
20 సర్కారు చేప విత్తన చెరువులు ప్రైవేటుకు...
Published Tue, Jan 24 2017 2:56 AM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
Advertisement
Advertisement