జడ్చర్ల: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రా్రష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వల్లూరులో జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమానికి మంత్రితో పాటు జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలను సాకారం చేసేందుకు గ్రామాల అభివృద్ధికి తెలంగాణ బాపూజీ కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెంది తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పార్టీలకతీతంగా గ్రామస్తులంతా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ఐకమత్యంతో కమిటీలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు.
హజీపల్లి, కిషన్‌నగర్, గంగదేవునిపల్లిలను ఆదర్శంగా తీసుకుని త మ గ్రామాలను కూడా అభివృద్ధిలోకి తేవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 10 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వపరంగా 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచిత ఆంగ్ల విద్యను అందించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.700 కోట్లతో నాణ్యమైన సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం అందజేస్తున్నామని, వాటర్‌గ్రిడ్‌తో ఇంటింటికి తాగునీరు అందిస్తామని చెప్పారు. వచ్చే మార్చి నుంచి రైతులకు పగటి పూట 9 గంటలు, గ్రామాలకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. కల్యాణలక్ష్మితో ఎస్సీ, ఎస్టీల ఆడపిల్లల పెళ్లిళ్లకు సహాయం అందిస్తున్నామని తెలిపారు.
పాలమూరు ఎత్తిపోతలతో జడ్చర్ల నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ ఇంటింటికి మరుగు దొడ్డి నిర్మించుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అధికారులు తెలంగాణ ప్రజలు, ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆంధ్రా వారికి తొత్తులుగా వ్యవ హరిస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీ లక్ష్మిశంకర్‌నాయక్, తహశీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ మున్నీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులడు శివకుమార్, సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ రవినాయక్, సింగిల్‌విండో చెర్మైన్ బాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ధ్యేయం
Published Sat, Aug 22 2015 12:32 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement