Laksmareddy
-
ఎంసెట్ లీకేజీపై కాంగ్రెస్ ఆందోళన
ఎంసెట్-2 లీకేజీలకు బాధ్యత వహిస్తూ మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని బస్టాండ్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రీయ రహదారిపై గంటపాటు ఆందోళన చేపట్టారు. దీంతో పట్టణంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నేతలు రమేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
టీ.టీడీపీ నేతలు తెలంగాణ ద్రోహులు
► ఆంధ్రా నేతలకు వత్తాసు పలుకుతారా ► తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు ► టీటీడీపీ నేతలపై మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి ఫైర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : టీడీపీ నేతలకు తెలంగాణ టీడీపీ నేతలు వత్తాసు పలకడం ద్వారా తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డారని, వారు ప్రజలను ఏ విధం గా మభ్యపెట్టినా నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారె డ్డి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఆం ధ్రా టీడీపీ నేతలకు తెలంగాణ టీడీపీ నేత లు వత్తాసు పలకడం ద్వారా తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డారని అన్నారు. సోమవారం స్థానిక జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి, జెడ్పీచైర్మన్ భాస్కర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల పక్షాన నిలబడలేక పోలీసు రక్షణతో తిరిగిన నేతలు నేడు రైతుల కోసం ఉద్యమాలంటూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో రెండేళ్లలో తెలంగాణలో అనూహ్య రీతిలో అభివృద్ధి జరిగిందని అన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు వంటి పథకా లు తెలంగాణ పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయని ఈ పథకాలను బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు ప్రశంసిస్తుంటే ఇక్కడి టీడీపీ నేతలు విమర్శిస్తూ తమ స్థాయిని తగ్గించుకుంటున్నారని అన్నారు. ఆర్డీఎస్ గురించి ఉద్యమాలు చేస్తామన్న నాయకులు తెలంగాణ ఉద్య మ సమయంలో పోలీసు రక్షణతో తిరిగారని, ప్రస్తుతం ప్రాజెక్టుల పనులు వేగవంతం అవుతున్న సమయంలో రాజకీయ లబ్ధి కోసం ఉద్యమాలంటున్నారని ఆయ న విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ సంబరా లు అంబరాన్నంటేలా చేస్తామని, అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఓర్వలేకనే పరువు తీస్తున్నారు మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు సన్యాసులు రాష్ట్రం పరువు తీసేలా అవాకులు చవాకులు పేలుతున్నారని వారిని ప్రజలు క్షమించరన్నారు. జిల్లా వెనుకబాటుతనానికి కాంగ్రెస్, టీడీపీ పాలకులు అనుసరించిన విధానాలే కారణమని జిల్లాకు ఒక్క మంచి పని చేయలేని నేతలు నీతులు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ను ప్రజలు ప్రతి ఎన్నికలో తిరస్కరిస్తున్నా ఇంకా రాజకీయ ఉనికి కోసం పాకులాడుతూ అధికార పార్టీకి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, నాయకులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కొల్లాపూర్ జెడ్పీటీసీ హన్మంతునాయక్, సురేందర్‌రెడ్డి, కిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య పరికరాల కొనుగోలుకు రూ. 16 కోట్లు
ప్రభుత్వ ఆస్పత్రిలో అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ. 16 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిని సందర్శించిన ఆయన ఐసీయూలో నూతనంగా ఏర్పాటు చేసిన డయగ్నస్టిక్ ల్యాబరేటరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రులలో అధునాతన పరికరాలు కొనుగోలు చేస్తామని అందుకోసం తక్షణం రూ. 16 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. -
స్వైన్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండండి: లక్ష్మారెడ్డి
హైదరాబాద్: స్వైన్‌ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైన నేపథ్యంలో వైద్య ఆరోగ్య మంత్రి లకా్ష్మరెడ్డి గురువారం వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. గతేడాది వ్యాధి నిర్ధారణ కిట్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్వైన్‌ఫ్లూ బాధితుల కోసం ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు ఉండేలా చూడాలన్నారు. వ్యాధి నియంత్రణకు అవసరమైన మందులు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిల్వ ఉంచాలని ఆదేశించారు. -
గ్రామాల అభివృద్ధే ధ్యేయం
జడ్చర్ల: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రా్రష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వల్లూరులో జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమానికి మంత్రితో పాటు జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలను సాకారం చేసేందుకు గ్రామాల అభివృద్ధికి తెలంగాణ బాపూజీ కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెంది తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పార్టీలకతీతంగా గ్రామస్తులంతా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ఐకమత్యంతో కమిటీలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు. హజీపల్లి, కిషన్‌నగర్, గంగదేవునిపల్లిలను ఆదర్శంగా తీసుకుని త మ గ్రామాలను కూడా అభివృద్ధిలోకి తేవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 10 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వపరంగా 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచిత ఆంగ్ల విద్యను అందించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.700 కోట్లతో నాణ్యమైన సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం అందజేస్తున్నామని, వాటర్‌గ్రిడ్‌తో ఇంటింటికి తాగునీరు అందిస్తామని చెప్పారు. వచ్చే మార్చి నుంచి రైతులకు పగటి పూట 9 గంటలు, గ్రామాలకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. కల్యాణలక్ష్మితో ఎస్సీ, ఎస్టీల ఆడపిల్లల పెళ్లిళ్లకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతలతో జడ్చర్ల నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ ఇంటింటికి మరుగు దొడ్డి నిర్మించుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అధికారులు తెలంగాణ ప్రజలు, ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆంధ్రా వారికి తొత్తులుగా వ్యవ హరిస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీ లక్ష్మిశంకర్నాయక్, తహశీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ మున్నీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులడు శివకుమార్, సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ రవినాయక్, సింగిల్‌విండో చెర్మైన్ బాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వైద్య, ఆరోగ్యశాఖ ప్రక్షాళన: లక్ష్మారెడ్డి