హైదరాబాద్: స్వైన్‌ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైన నేపథ్యంలో వైద్య ఆరోగ్య మంత్రి లకా్ష్మరెడ్డి గురువారం వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
గతేడాది వ్యాధి నిర్ధారణ కిట్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్వైన్‌ఫ్లూ బాధితుల కోసం ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు ఉండేలా చూడాలన్నారు. వ్యాధి నియంత్రణకు అవసరమైన మందులు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిల్వ ఉంచాలని ఆదేశించారు.
స్వైన్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండండి: లక్ష్మారెడ్డి
Published Fri, Sep 4 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM
Advertisement