భద్రాచలం నుంచి సాక్షి బృందం : లక్షల సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో జిల్లా పుష్కరజాతరగా మారింది. వచ్చిపోయే వాహనాలు.. భక్తుల రద్దీతో అన్ని దారుల్లోనూ..భక్తులు, వాహనాలే కనిపిస్తున్నారుు. 8వ రోజు మంగళవారం ఎనిమిది ఘాట్లలో 4.62 లక్షల మంది భక్తులు స్నానమాచరించారు. భద్రాచలంలో భక్తుల రద్దీ నేపథ్యంలో పర్ణశాల, మోతె ఘాట్లకు అధిక సంఖ్యలో జనం తరలడం విశేషం. పర్ణశాల, మోతె ఘాట్లలో రెండు లక్షలకు పైగా భక్తులు వెళ్లి పుష్కర స్నానం చేశారు. భద్రాచలం రామాలయంలో రద్దీ నెలకొంది. క్యూలైన్‌లలో భక్తులు గంటల తరబడి స్వామి వారి దర్శనానికి వేచి ఉండటంతో ఆర్జీత సేవలన్నీ నిలిపివేశారు.
ఒకే క్యూలైన్‌లో భక్తులందరినీ ఆలయానికి పంపించారు. అయినా స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరడంతో మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో జిల్లాలోని దారులలో వాహనాల రద్దీ నెలకొంది. భద్రాచలంలో బ్రిడ్జి సెంటర్ నుంచి కూనవరం రోడ్డు వరకు వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. పోలీస్ అధికారులు ఎక్కువ సేపు వాహనాలు రోడ్డుపై నిలిపి ఉంచకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
యాగశాలకు వచ్చిన నాగసాధువులు..
సారపాక వద్ద ఏర్పాటు చేసిన విశ్వశాంతి మహాయజ్ఞం యాగశాలకు 10 మంది నాగసాధువులు, 30 మంది వైష్ణవ సాధువులు తరలివచ్చారు. యజ్ఞ నిర్వహ ణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఉదయం యాగశాలకు చేరుకున్న సాధువులు సాయంత్రం వరకు యాగం నిర్వహించారు. భక్తులు సాధువుల ఆశీస్సులు తీసుకునేందుకు యాగశాలకు తరలివెళ్లారు. సారపాక వద్ద ఏర్పాటు చేసిన మోతె ఘాట్‌కు వీఐపీల తాకిడి పెరిగింది. అధికారులు, వీఐపీలు మోతె ఘాట్‌లోనే స్నానం చేశారు. భద్రాచలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది భక్తులు పర్ణశాలకు తరలివెళ్లారు.
మంత్రి తుమ్మల పర్యవేక్షణ
భద్రాచలంలోని కరకట్టపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలియతిరిగారు. భక్తులతో మాట్లాడుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏదైనా అసౌకర్యం కలిగిందా..? ఏర్పాట్లు బాగున్నాయా..? అంటూ వారిని పలుకరించారు. ఘాట్ల వద్ద స్వచ్ఛంద సేవలందిస్తున్న వలంటీర్లను అభినందించారు. తుమ్మల వెంట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఉన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు భద్రాచలం, చినరావిగూడెం ఘాట్లను పరిశీలించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, ఇంటిలిజెన్స్ ఐజీ శశిధర్‌రెడ్డి, ఐజీ నవీన్‌చంద్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ షానవాజ్‌ఖాసీం రామాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు.
మున్సిపల్ కార్మికులకు అండగా కాంగ్రె స్ సీఎల్‌పీ నేత జానారెడ్డి
ఖమ్మం/ఖమ్మం సిటీ : మున్సిపల్ కార్మికులకు పనికి తగ్గవేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల కోరిక న్యాయమైందని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీఎల్‌పీ నేత జానారెడ్డి అన్నారు. ఖమ్మం ము న్సిపాలిటీ కార్యాలయంవద్ద ధర్నా చేస్తున్న ము న్సిపల్ కార్మికులకు మంగళవారం ఆయన సం ఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని, వారి వేతనాలను పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు.
సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్మికులకే వేతనాలు పెంచుతామని చెప్ప డం విడ్డూరమన్నారు. జానారెడ్డి వెంట పాలే రు, ఖమ్మం ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు కొత్త సీతారాములు, దీపక్‌చౌదరి, నున్నా మాధవరావు, విజయ్‌కుమార్, వడ్డెబోయిన నరసింహారావు, యర్రం బాలగంగాధర్‌తిలక్, భూక్యా బాషా, కుర్రా భాస్కర్ ఉన్నారు.
పోటెత్తిన ‘ఘాట్లు’
Published Wed, Jul 22 2015 4:07 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement