‘గోదావరి’తో గొంతు తడుపుతాం | godavari water definitely comes ,says harish rao | Sakshi
Sakshi News home page

‘గోదావరి’తో గొంతు తడుపుతాం

Published Sun, Nov 16 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

‘గోదావరి’తో గొంతు తడుపుతాం

‘గోదావరి’తో గొంతు తడుపుతాం

కొండపాక: గోదావరి జలాలను త్వరలోనే జిల్లాకు సరఫరా చేసి మెతుకుసీమ వాసులు దశాబ్దాల కల నెరవేరుస్తామని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా మెదక్ జిల్లాలోని చెరువులకు నీరందించనున్నట్లు ఆయన వెల్లడించారు. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో తపాసుపల్లి రిజర్వాయర్ నుండి నీరు వచ్చే ప్రతిపాదిత కాల్వ స్థలాన్ని  ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, సమైక్య పాలకుల కుట్రలతో ఇన్నాళ్లు ఈ ప్రాంతానికి గోదారి నీళ్లు దక్కలేదన్నారు.

స్వరాష్ట్రంలో మన నీళ్లు మనకు దక్కనున్నాయన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నుండి కొండపాక మండలంలోని 11 గ్రామాల పరిధిలోని 16 చెరువులకు నీరందించడానికి పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని గ్రామాలకు సుజలస్రవంతి పథకం ద్వారా గోదావరి జలాలు అందించడానికి ప్రతిపాదించామని తెలిపారు. గజ్వేల్‌కు తాగునీటి కోసం సీఎం కేసీఆర్ రూ. 30 కోట్లు మంజూరు చేశారనీ, అయితే  స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు ఈ పథకాన్ని కొండపాక వరకూ విస్తరించడానికి ఇంజనీరింగ్ అధికారులతో సర్వే పనులు జరిపిస్తున్నట్టు తెలిపారు.

కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు, డీసీసీబీ వైస్‌చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ భూంరెడ్డి, ఎంపీపీ అనంతుల పద్మ, జెడ్పీటీసీ సభ్యురాలు చిట్టి మాధురి, సర్పంచ్ పసుల సరిత, నేతలు సాయిబాబా, నరేందర్, పోల్కంపల్లి యాదగిరి పాల్గొన్నారు.

రిజర్వాయర్‌ను సందర్శించిన మంత్రులు
వెలికట్ట గ్రామ శివారులో రాజీవ్హ్రదారి పక్కన నిర్మించిన సుజలస్రవంతి పథకం క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లు ప్రారంభించారు. సుజల స్రవంతి గోదావరి నీటి రిజర్వాయర్, పంపుహౌస్‌లను వారు మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌లతో కలిసి సందర్శించారు.

 ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, డాక్టర్ మౌలానా అబుల్‌కలాం ఆజాద్ సుజల స్రవంతి పథకం ద్వారా హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపు 2015 జూన్ మాసంలో ప్రారంభమవుతుందన్నారు.  కార్యక్రమంలో ఐజీ అనురాగ్‌శర్మ, జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement