Irrigation Minister
-
ఈ సీజన్లో పోలవరం పనుల్లో పురోగతి: మంత్రి అంబటి
సాక్షి, తూర్పుగోదావరి: పోలవరం నిర్మాణంలో రాబోయే నాలుగు ఐదు నెలలు కీలకమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వేల ఏళ్లపాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రాజెక్టు అని, అందుకే కాస్త ఆలస్యమైనా నాణ్యత విషయంలో రాజీపడబోమని తెలిపారాయన. ఆదివారం పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన ఆయన.. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆపై మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సీజన్లో ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపిన మంత్రి అంబటి.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని మరోసారి పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో కష్టపడి రిపేర్ చేయాల్సి వస్తోందని చెప్పారాయన. పోలవరంపై తానేం రాజకీయ ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారాయన. ఇది తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవగాహనారాహిత్యం, ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలన్న తాపత్రయంతోనో కాపర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ వేయడం వల్ల ఇంత అనర్థం జరిగిందని స్పస్టం చేశారు. డయాఫ్రమ్‌వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికీ మానవతప్పిదమేనని, చర్యల సంగతి ప్రాజెక్టు పూర్తైన తర్వాతేనని చెప్పారాయన. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదని.. నిపుణులు చెప్తున్న మాట అని మంత్రి అంబటి తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేసి ముందుకు వెళ్లాలి. ఏ విధంగా రిపేర్ చేయాలో అధికారులు పరిశీలిస్తున్నారు. పనులు పూర్తి చేయడానికి రాబోయే నాలుగైదు నెలలు కీలకమని మరోసారి స్పష్టం చేశారాయన. ప్రాజెక్టు పనుల్లో ఈ సీజన్లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరదల వల్ల డయాఫ్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వ తొందరపాటుతోనే ప్రాజెక్టకు నష్టం జరిగింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు తప్పిదం తప్ప మరొకటి లేదు. గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేయాలి. దీని కోసం రూ.2 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తొందరపాటు, డెడ్లైన్లు ఎందుకు? వేళ ఏళ్ల పాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. అందుకే పనులు కాస్త ఆలస్యమైనా నాణ్యతగా ఉండాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారాయన. వైఎస్ఆర్ కలలు కన్న ప్రాజెక్టు ఇది. సీఎం జగన్ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి. ఇదీ చదవండి: ఏపీ ఓ బంగారు గని -
‘శ్రీశైలం’పై అనుమానాలొద్దు : మంత్రి
సాక్షి, అమరావతి : శ్రీశైలం ప్రాజెక్టుకు, డ్యాం భద్రతకు ఎలాంటి ముప్పులేదని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై గురువారం అధికారులతో మాట్లాడిన మంత్రి అనంతరం వారి నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ఈ సందర్భంగా డ్యాం భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని వివరించారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలు, అపోహలు కల్పించవద్దని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. -
రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: మంత్రి అనిల్
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో నిర్వహించిన రివర్స్ టెండర్ల వల్ల ఇప్పటివరకు రూ. 1500 కోట్లు ఆదా చేశామని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సోమవారం వెల్లడించారు. తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన తాము రివర్స్ టెండర్లు వేయకపోతే ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లేదని ప్రశ్నించారు. మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ..‘వెలిగొండలో రూ. 61 కోట్లు మిగిలాయి. రాబోయే రోజుల్లో మరో రూ. 500 కోట్లు మిగులుతాయని భావిస్తున్నాం. అన్ని శాఖల్లోనూ రివర్స్ టెండరింగ్ చేపడితే నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి. ఇలా ఆదా అయిన ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం. ప్రజాధనం ఆదా అవుతుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా? రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం మంచిదా? రేట్లు తగ్గించి ఆ డబ్బుతో పేదలను ఆదుకోవడం మంచిదా?’ అంటూ ప్రతిపక్షాన్ని నిలదీశారు. చంద్రబాబు తన హయాంలో ఇలా చేసుంటే అంత డబ్బు మిగిలేది కదా? అలా కాకుండా ఎక్సెస్ టెండర్లు నిర్వహించి, ఇష్టమొచ్చిన నిబంధనలు పెట్టి తనకు అనుకూలంగా ఉన్నవారికి దోచిపెట్టారు. ఇసుక సమస్యపై రాద్ధాంతం చేస్తున్నారు. దేవుడి దయ వల్ల సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో మంచి వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. అయితే కృష్ణా, గోదావరి నదులకు వరదలు రావడం వల్ల ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడిందని మంత్రి అనిల్ వివరించారు. మరోవైపు జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వెళ్తే తప్పులేదు కానీ, ముఖ్యమంత్రి వెళ్తే తప్పా? అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లే చంద్రబాబు మాకొద్దంటున్నారని స్పష్టం చేశారు. -
ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ సక్సెస్
-
పోలవరం పూర్తి చేస్తే.. మీ పార్టీని మూసేస్తారా?
సాక్షి, తాడేపల్లి: పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం పనుల రివర్స్ టెండరింగ్‌తో సుమారు రూ. 780 కోట్లు ఆదా చేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్ మానస పుత్రిక అయిన పోలవరాన్ని గడువులోగా పూర్తి చేస్తామన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరానికి సంబంధించి చంద్రబాబు హయాంలో ఇష్టారీతిన టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. అయితే, తమ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్తుంటే.. టీడీపీ నేతలు భయంతో వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. దోచుకున్నదంతా బయటపడుతుందనే భయంతో రకరకాలుగా మాట్లాడుతున్నారని అనిల్ కుమార్ విమర్శించారు. 12.6 శాతం తక్కువతో పనులు చేసేందుకు మేఘా సంస్థ ముందుకొస్తే.. దానిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మంత్రి ఏమన్నారంటే.. ‘చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా కమీషన్ల కోసం పని చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ అనేది ఒక గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు మెచ్చుకోవాల్సింది పోయి అర్థంపర్థం లేకుండా విమర్శలకు దిగుతున్నారు. పోలవరాన్ని తాము చెప్పిన సమయానికే పూర్తి చేస్తే టీడీపీని మూసేస్తారా? పోలవరమే కాదు వెలిగొండ వంటి ప్రాజెక్టులపై కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళతాం. రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు. విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. అధిక ధరలకు టెండరింగ్ వేస్తే కట్టబెట్టినట్లా.. లేక తక్కువ ధరలకు టెండరింగ్ వేసి డబ్బు ఆదా చేస్తే కట్టబెట్టినట్లా?’ ఇప్పటివరకు రివర్స్ టెండరింగ్ వల్ల రూ. 780 కోట్ల ఆదా అయింది. ఇంకా ఆదా అవుతుంది. మీరు బాగా పనిచేస్తుందని చెప్పే నవయుగ టెండర్లలలో ఎందుకు పాల్గొనలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయానికి మేము గర్వపడుతున్నాం’ అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. -
మేం ఎప్పుడూ ప్రజల పక్షమే
సాక్షి, సిద్దిపేట: నాడు తెలంగాణ ఉద్యమంలో.. తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో.. తాము ప్రజల మధ్యనే ఉన్నామని, ఇక ముందు కూడా ప్రజల పక్షానే ఉంటామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు సేవ చేసే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటేనని పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా సీఎం కేసీఆర్ పాలన సాగుతోంద న్నారు. రాష్ట్రం విద్యుత్ సమస్యను అధిగమించిందని, ఈ రంగంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చామని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సంపన్నంగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి, ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశామని తెలిపారు. దశాబ్ద కాలం నుండి రేషన్ డీలర్లు చాలీచాలని కమీషన్లతో ఇబ్బందులు పడుతుంటే సానుకూల దృష్టితో ఆలోచించి కమీషన్ పెంచామని వెల్లడించారు. ఇలా ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల అండదండలే టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు వచ్చినప్పుడే వారిపై మమకారం కలుగుతుందని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా కూడా చైతన్యవంతులయ్యారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర నేతలు పాల్గొన్నారు. కాళేశ్వరం మోటారు డ్రైరన్ విజయవంతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజీ–6 నంది మేడారం పంపుహౌజ్‌లో మోటారు డ్రైరన్‌ను ఇంజనీర్లు శుక్రవారం విజయవంతంగా పూర్తిచేశారు. 125 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న తొలి మోటారు డ్రైరన్‌ను అధికారులు తాజాగా చేపట్టారు. దేశంలోనే సాగునీటి రంగంలో ప్రథమ గ్యాస్ ఇన్సులేట్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) విధానంలో అండర్‌గ్రౌండ్‌లో సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజనీర్లను అభినందించారు. -
సాగునీటి రంగంలోనే అతిపెద్దది
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్టమొదటి పంప్ మోటర్‌ను ప్రాజెక్టు అధికారులు డ్రై రన్‌ను నిర్వహించారు. దీనిపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. 139 మెగావాట్ల సామర్థ్యంతో ఈ మోటారు ప్రపంచ సాగునీటి రంగంలోనే అతి పెద్దదని తెలిపారు. భూగర్భంలో 340x25x65.5 డైమన్షన్లతో ఈ మోటర్‌ను బిగించినట్లు మంత్రి తెలిపారు. మోటారు గరిష్టంగా 214 ఆర్.పీ.ఎం స్వీడ్‌తో నడుస్తుందని, ఇవాల్టీ డ్రై రన్లో మోటర్ పూర్తి సామర్థ్యంలో పనిచేసిందని వెల్లడించారు. సమావేశంలో హరిష్ రావు మాట్లాడుతూ.. ‘రేయింబవళ్లు పనిచేసి డ్రై రన్ విజయవంతం చేసిన ఇంజనీర్లకు, కార్మికులకు అభినందనలు. కాళేశ్వరం ప్రాజెక్టులో 19 పంపు హౌసుల్లో మొత్తం 86 మోటర్లు పెడుతున్నాం. వాటిలో మొదటి మోటార్ ఇవాళ సక్సెస్ అయ్యింది. ఎనిమిదో ప్యాకేజీ పంప్ హౌస్‌లో మొత్తం ఏడు మోటార్లుంటాయి. ఇవి రోజుకు రెండు టీఎంసీల నీటిని లిప్ట్ చేస్తాయి. లిప్ట్ కోసం అవసరమైన కరెంట్ కోరకు 18 సబ్ స్టేషన్ల్ నిర్మాణం జరుగుతోంది. లక్ష్మిపూర్‌లో 400 కె.వి సబ్ స్టేషన్ పూర్తి కావడంతో అదే కరెంట్‌తో ఇవాల్టి మోటార్ డ్రై రన్ చేశాం. ఎనిమిదో ప్యాకేజీలో మోటార్లన్నీ సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయి. మేడారం దగ్గర ఆరో ప్యాకేజీకి సంబంధించి గ్యాస్ బెస్ట్ 400 కె.వి పవర్ స్టేషన్ ఈ నెల 25లోగా పూర్తవుతాయి. ఇది ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ ఆధారిత సబ్ స్టేషన్. ఆరో ప్యాకేజీ సబ్ స్టేషన్ పూర్తయితే ఆగస్ట్ రెండో వారంలో ఇక్కడి మోటర్లు డ్రై రన్ కూడా చేస్తాం. 6,8 ప్యాకేజీల మధ్యన ఏడో ప్యాకేజీకి సంబంధించిన 50 కిలో ట్విన్ టన్నెల్ డ్రిల్లింగ్ పనుల్లో ఇప్పటికే 49.988 కి.మీ పూర్తయింది. కేవలం 12 మీటర్లు టన్నెల్ డ్రిల్లింగ్ మాత్రమే ఉన్నప్పటికి లూజ్ సాయిల్ వల్ల జాగ్రత్తగా పనులు చేయాల్సి వస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన టన్నెల్ ఇంజనీర్ నిపుణుడైన విక్రం సింగ్ చౌహన్ పర్యవేక్షణలో రేయింబవళ్లు పనులు జరుగుతున్నాయి. మరో 10 రోజుల్లో మిగిలిన 12 మీటర్ల టన్నెల్ డ్రిల్లింగ్ పూర్తి చేసి.. ఆ తరువాత లైనింగ్ పనులు చేపడుతాం. 6,7,8 ప్యాకేజీలు ఆక్టోబరు నాటికి అందుబాటులోకి వస్తే.. ఎల్లంపల్లి నీటిని మిడ్ మానేర్‌కు తరలిస్తాం’ అని వెల్లడించారు. -
'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'
మెదక్ : భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లన్నీ జలకళను సంతరించుకున్నాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శనివారం మెదక్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ... పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. సింగూరు ప్రాజెక్ట్‌లో ఇన్ఫో పెరగిందన్నారు. అందువల్లే నీటిని దిగువకు వదిలామని చెప్పారు. మిషన్ కాకతీయ వల్ల నీటి కొరత తీరందని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
అవినీతిని సహించేది లేదు: హరీష్‌రావు
-అక్రమాలకు పాల్పడే వారిని విడిచిపెట్టబోమని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో చేపడుతున్న ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి అత్యుత్తమ పథకాల్లో అవినీతిని సహించబోమని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు హెచ్చరించారు. అవకతవకలు, అక్రమాలకు పాల్పడే అధికారులు ఏ స్థాయిలో ఉన్నా విడిచిపెట్టమని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి, మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ జరిగిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి ప్రకటన విడుదల చేశారు. పాలమూరు ప్రాజెక్టు ఆయకట్టు సర్వే టెండర్ల ప్రక్రియలో అవకతవకలు పాల్పడిన ఇద్దరు ఎస్ఈలను పక్కనపెట్టామని, మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలకు బాధ్యులుగా గుర్తించి ఐదుగురిని సస్పెండ్ చేశామని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలన్నారు. నాసిరకంగా పనులు చేసినా, నిర్లక్ష్యం వహించడం, తక్కువ పనిని ఎక్కువగా రికార్డు చేయడం వంటి తప్పిదాలను సహించబోమని మంత్రి అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు రాకముందే వరంగల్ జిల్లా మిషన్ కాకతీయ పనుల్లో అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. -
'వారిని ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయి'
-
మంత్రి ఉమా వ్యాఖ్యలు హాస్యాస్పదం: బుగ్గన
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నానంటూ ఉమా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం చెరువుపల్లిలో తాను భూములు ఆక్రమిస్తున్నట్లు ఆరోపిస్తున్నారని, ఆ భూముల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరిస్తే భూములు ఇవ్వడానికి తాము సిద్ధమని చెప్పారు. మంత్రి దేవినేని ఉమా అవినీతి గురించి గంటల కొద్దీ మాట్లాడొచ్చని.. ఒకవైపు ఆయన ప్రజల భూములు ఆక్రమిస్తూ తనపై ఆరోపణలు చేస్తారా అని నిలదీశారు. -
'గోదావరిపై మరో మూడు బ్యారేజీలు నిర్మిస్తాం'
హైదరాబాద్: గోదావరి నదిపై మరో మూడు బ్యారేజీలు నిర్మిస్తామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో రెండవ దశ మిషన్ కాకతీయ పనులపై నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులకు రిటైర్డు నిపుణుల సలహాలను తీసుకుని మిషన్ కాకతీయను విజయవంతం చేస్తామని చెప్పారు. ఈ సమీక్షకు సాగునీటి నిపుణులు టి.హనుమంతురావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో మెదక్ జిల్లాకు గోదావరి నీరు
జిల్లాకు త్వరలో గోదావరి నుంచి సాగునీరు తెప్పించే ఏర్పాటు చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వ్యవసాయం పట్ల గత పాలకుల నిర్లక్ష్యమే రైతుల కష్టాలకు కారణమని ఆయన శనివారమిక్కడ అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉండగా.. ఎన్నడూ రైతుల గోడు పట్టించుకోని కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు రైతు ఓదార్పు యాత్రలు చేయడం సిగ్గుచేటని హరీశ్ విమర్శించారు. -
కోనసీమను తలపిస్తాం: హరీశ్
మెదక్ (నంగునూరు) : గోదావరి జలాలను తరలించి సిద్దిపేట ప్రాంతాన్ని కోనసీమను తలపించేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లాలోని నంగునూరు మండలంలో పర్యటించి పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నంగునూరు మండలం పాలమాకులలో భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా రాంపూర్, పాలమాకుల గ్రామాల లబ్ధిదారులకు పట్టా పాస్‌పుస్తకాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు దళితులకు రాళ్లు, రప్పలు, గుట్టలు, నీళ్లు పడని భూములను పంపిణీ చేశాయని, తమ ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూములను అందజేస్తోందని తెలిపారు. దళితులకు పంపిణీ చేస్తున్న భూమిలో సంవత్సరం వరకు పంటలు పండించుకునేలా విత్తనాలు, ఎరువులు అందజేయడంతోపాటు డ్రిప్ పరికరాలను ఉచితంగా అందజేస్తామన్నారు. తడ్కపల్లి వద్ద రూ. 6వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా సిద్దిపేటతో పాటు హుస్నాబాద్, కొహెడా మండలాల్లోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.30 కోట్లతో 695 ఎకరాల భూమిని పంపిణీ చేయగా నంగునూరు మండలంలోనే అత్యధికంగా లబ్ధిదారులున్నారని తెలిపారు. దేవాదుల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, ఎంత కష్టమైనా ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతన్నకు సాగు నీరందిస్తామని చెప్పారు. -
ప్రతిపక్షం లేకుండా ఏపీ అసెంబ్లీ: హరీష్ రావు
హైదరాబాద్: ప్రతిపక్షం లేకుండానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం అన్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ మధ్యాహ్నం 1:30 గంటలకు వాయిదా పడేదని, అయితే ప్రస్తుతం సభ ఎప్పుడు వాయిదా పడుతుందా అని విపక్ష సభ్యులే ఎదురుచూస్తున్నారని హరీష్ రావు తెలిపారు. -
ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ: హరీష్ రావు
హైదరాబాద్: ప్రతిపక్షం లేకుండానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం అన్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ మధ్యాహ్నం 1:30 గంటలకు వాయిదా పడేదని, అయితే ప్రస్తుతం సభ ఎప్పుడు వాయిదా పడుతుందా అని విపక్ష సభ్యులే ఎదురుచూస్తున్నారని హరీష్ రావు తెలిపారు. -
తూచ్...ఆ ఫైలు కాదు..!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పరిపాలనా అనుమతుల అంశం గందరగోళంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి సంతకం చేసిన ఫైలు నీటి పారుదల శాఖ సెక్షన్ అధికారుల తప్పిదంతో మళ్లీ మొదటికి వచ్చింది. అనేక అడ్డంకులు దాటుకొని ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఫైలు విషయంలో అధికారులు చేసిన పొరపాటు ప్రాజెక్టు అనుమతుల జాప్యానికి దారితీసింది. తేరుకొని వాస్తవ అంచనా రూ.15,850 కోట్లతో కొత్త ఫైలును రెడీ చేసి మళ్లీ ఆర్థికశాఖకు పంపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 10లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని సంకల్పించిన ప్రభుత్వం గత జూలైలో నివేదిక తయారీ బాధ్యతను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి అప్పగించింది. జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని తరలించేందుకు 5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 25 కి.మీ.మేర టన్నెల్‌ను నిర్మించాల్సి ఉంటుందని, ఇక్కడికి చేరే నీటిని 70 టీఎంసీల సామర్థ్యం ఉంటే మొదటి రిజర్వాయర్ కోయిలకొండలోకి 170 మీటర్ల ఎత్తునుంచి ఎత్తిపోయాల్సి ఉంటుందని తన నివేదికలో తెలిపింది. దీనికోసం 160మెగావాట్ల కెపాసిటీ కలిగిన 14 పంపులను సంబంధిత స్టేషన్ వద్ద ఏర్పాటుచేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ తొలిదశ నిర్మాణానికి సుమారు రూ.14,350కోట్లు అవసరమని అంచనా వేసింది. సంస్థ డీపీఆర్‌ను పరిశీలించిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) ప్రాజెక్టు రాక్స్ స్టేటస్(రాయి సామర్థ్యం)ను బట్టి అలుగు పునాది (ఫౌండేషన్ లెవల్)ని 405 మీటర్ల నుంచి మరింత 395 మీటర్ల కిందకు తీసుకెళ్లాలని సూచించింది. పునాది స్థాయిలో మరింత కిందకు వెళ్లిన పక్షంలో ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.15,850కోట్లకు పెరుగుతుందంటూ అదే నివేదికను ఆర్ధిక శాఖ పరిశీలనకు పంపారు. ఇక్కడ అన్ని అంశాలను పరిశీలించిన ఆర్థిక శాఖ ఇదే అంచనాకు ఆమోదం సైతం తెలిపింది. తప్పును గుర్తించిన మంత్రి హరీశ్ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన అంచనా వ్యయ ఫైలును సీఎం ఆమోదం కోసం పంపేటప్పుడు పొరపాటు జరిగింది. సవరించిన అంచనా వ్యయంతో సిద్ధం చేసిన ఫైలుకు బదులు, ప్రాథమిక అంచనాలున్న పాత ఫైలునే సీంఎంకు పంపినట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టుకు త్వరితగతిన శంకుస్థాపన చేయాలనే యోచనతో ఆయన ఆ ఫైలుపై వెంటనే సంతకం చేశారు. ఇలా రూ.14,350 కోట్ల పరిపాలనా అనుమతుల ఫైలుపై సీఎం సంతకం చేసినట్లు సీఎంవో తెలిపింది. అయితే తాము పంపిన అంచనాలు ఒకలా ఉండటం, సీఎం ఆమోదించిన ఫైలులో మరో అంచనా ఉండటంతో నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు కంగుతిన్నారు. అధికారుల తప్పిదంతోనే ఇదంతా జరిగిందని తెలుసుకొని వెంటనే కొత్త అంచనాల ఫైలును ఆర్థిక శాఖ ఆమోదానికి పంపి, మరోమారు సీఎంతో సంతకం పెట్టించేందుకు సిద్ధపడ్డారు. పరిపాలనా అనుమతులు పొందిన ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు పిలుస్తారని అంతా భావించినా అధికారిక ఉత్తర్వు (జీవో) రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జీవో రాలేదని అంతా భావించినా, అధికారుల తప్పిదం ఉందని ఆలస్యంగా వెలుగు చూసింది. -
'ప్రతిపక్షాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి'
హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలన్నీ ఆశ్చర్యపోతున్నాయని భారీ నీటి పారదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. అందుకే కేసీఆర్‌పై ప్రతిపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో అప్పనంగా ప్రజల ఆస్తులను దొంగలపాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వంలోని ముఖ్య శాఖలన్నీ ఒకే చోట చేర్చేందుకే కేసీఆర్ నూతన సెక్రటేరియట్‌ను నిర్మించాలని తలపెట్టారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. -
మంత్రి దేవినేని ఉమకు వైఎస్ జగన్ ఫోన్
-
మంత్రి దేవినేని ఉమకు వైఎస్ జగన్ ఫోన్
కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి గండికొట వరకు పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. గండికోట ముంపు ప్రాంతాల సమస్య తీర్చాలని, పులివెందుల బ్రాంచి కెనాల్‌కు తాగు, సాగు నీటిని వెంటనే విడుదల చేయాలన్నారు. -
రోడ్ల మరమ్మతులకు రూ.124 కోట్లు
టెలీమీట్‌లో మంత్రి హరీష్ వెల్లడి సిద్దిపేట జోన్: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో, అంతర్ జిల్లాలను కలుపుతూ రహదారుల మరమ్మతు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 124.25 కోట్లను మంజూరు చేసిందని నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. శనివారం రాత్రి ఆయన టెలీమీట్‌లో నిధులను వివరాలను స్థానిక విలేకరులకు వెల్లడించారు. జీఓ నం. 129, 130, 131 ప్రకారం మెదక్, కరీంనగర్, వరంగల్ రహదారులను కలుపుతూ, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రధాన రోడ్ల మరమ్మతుకు నిధులు విడుదలయ్యాయన్నారు. ప్రధానంగా డబుల్ రోడ్లు, నాలుగు లేన్ల రోడ్ల విస్తరణకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. సిద్దిపేట బైపాస్ గుండా నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం రూ. 50 కోట్లు, నంగునూరు నుంచి ఖాతా వరకు డబుల్ రోడ్ నిర్మాణం కోసం రూ. 8.5 కోట్లు, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు వరకు ప్రస్తుతం రూ. 10 కోట్లతో జరుగుతున్న డబుల్‌రోడ్ నిర్మాణాన్ని పొడిగించేందుకు 3 కిలో మీటర్ల రహదారి కోసం ప్రభుత్వం రూ. 3.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అదే విధంగా ఇబ్రహీంపూర్ నుంచి మాచాపూర్ వయా చింతమడక నుంచి దుబ్బాక వరకు రహదారి నిర్మాణం కోసం రూ. 12 కోట్లు, అదే విధంగా జక్కాపూర్ నుంచి గోపులాపూర్, మాటిండ్ల, నారాయణరావుపేట, లక్ష్మిదేవిపల్లి, చింతమడక మీదుగా మెదక్ రోడ్డు వరకు రహదారి నిర్మాణం కోసం రూ. 25 కోట్లు మంజూరయ్యాయన్నారు. పొన్నాల బైపాస్ నుంచి ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాల వయా తిమ్మారెడ్డిపల్లికి రూ. 25 కోట్లు మంజూరయ్యాయన్నారు. సిద్దిపేట నుంచి తొగుట రహదారి మార్గమధ్యలో ఎన్సాన్పల్లి, తడ్కపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ. 2 కోట్లను రహదారుల శాఖ ద్వారా నిధులు మంజూరయ్యాయన్నారు. -
‘గోదావరి’తో గొంతు తడుపుతాం
కొండపాక: గోదావరి జలాలను త్వరలోనే జిల్లాకు సరఫరా చేసి మెతుకుసీమ వాసులు దశాబ్దాల కల నెరవేరుస్తామని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా మెదక్ జిల్లాలోని చెరువులకు నీరందించనున్నట్లు ఆయన వెల్లడించారు. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో తపాసుపల్లి రిజర్వాయర్ నుండి నీరు వచ్చే ప్రతిపాదిత కాల్వ స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, సమైక్య పాలకుల కుట్రలతో ఇన్నాళ్లు ఈ ప్రాంతానికి గోదారి నీళ్లు దక్కలేదన్నారు. స్వరాష్ట్రంలో మన నీళ్లు మనకు దక్కనున్నాయన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నుండి కొండపాక మండలంలోని 11 గ్రామాల పరిధిలోని 16 చెరువులకు నీరందించడానికి పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని గ్రామాలకు సుజలస్రవంతి పథకం ద్వారా గోదావరి జలాలు అందించడానికి ప్రతిపాదించామని తెలిపారు. గజ్వేల్‌కు తాగునీటి కోసం సీఎం కేసీఆర్ రూ. 30 కోట్లు మంజూరు చేశారనీ, అయితే స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు ఈ పథకాన్ని కొండపాక వరకూ విస్తరించడానికి ఇంజనీరింగ్ అధికారులతో సర్వే పనులు జరిపిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు, డీసీసీబీ వైస్‌చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ భూంరెడ్డి, ఎంపీపీ అనంతుల పద్మ, జెడ్పీటీసీ సభ్యురాలు చిట్టి మాధురి, సర్పంచ్ పసుల సరిత, నేతలు సాయిబాబా, నరేందర్, పోల్కంపల్లి యాదగిరి పాల్గొన్నారు. రిజర్వాయర్‌ను సందర్శించిన మంత్రులు వెలికట్ట గ్రామ శివారులో రాజీవ్హ్రదారి పక్కన నిర్మించిన సుజలస్రవంతి పథకం క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లు ప్రారంభించారు. సుజల స్రవంతి గోదావరి నీటి రిజర్వాయర్, పంపుహౌస్‌లను వారు మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, డాక్టర్ మౌలానా అబుల్‌కలాం ఆజాద్ సుజల స్రవంతి పథకం ద్వారా హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపు 2015 జూన్ మాసంలో ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో ఐజీ అనురాగ్‌శర్మ, జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ అందాలి
సంగారెడ్డి అర్బన్: సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ నుంచి తహశీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాలకోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు అయోమయంలో ఉన్నారని, వారి అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. దరఖాస్తు పరిశీలనకు వెళ్లినప్పుడు అధికారులు ఓపికతో వ్యవహరించి ప్రజల సందేహాలను తీర్చాలన్నారు. అర్హులై ఉండి కూడా ఇప్పటికీ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోనట్లయితే వచ్చే నెలలో తిరిగి మంజూరు చేస్తామని ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ఎటువంటి నిబంధనలు విధించకుండా అర్హత గల ప్రతి ఒక్కరికీ నవంబర్ 8 నుంచి పెంచిన పింఛన్లు సర్కార్ మంజూరు చేస్తుందని, ఈ విషయాన్ని అధికారులే ప్రజలకు వివరించాలన్నారు. సంక్షేమ పథకాల మంజూరు నిరంతర ప్రక్రియ అని ప్రజలకు సవివరంగా తెలపాలని అధికారులను ఆదేశించారు. కుమారుడు ఉద్యోగి అయినప్పటికీ తల్లి వేరుగా ఉన్నట్లయితే పింఛన్ మంజూరు చేయాలన్నారు. నిరాదరణకు గురైన మహిళల కుటుంబాల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు. ఓటరు లిస్టులో, ఆధార్ కార్డుల్లో, వయస్సు తప్పుగా నమోదు అయి ఉంటే, నివేదికలో తగిన రిమార్కులు నమోదుచేసి మంజూరు చేసే అధికారం విచారణ అధికారులకు ఉందన్నారు. భార్య , భర్తలు చాలా కాలంగా వేరు గ్రామాల్లో జీవిస్తే అటువంటి దరఖాస్తులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పెద్ద కుటుంబాలు విడివిడిగా దరఖాస్తు చేసినట్లయితే ఆహారభద్రత కార్డులు మంజూరు చేయాల్సిందిగా సూచించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా త్వరలోనే సదరెం క్యాంపులు నిర్వహించి వికలాంగులందరికీ ధ్రువపత్రాలు జారీ చేసేందుకు జిల్లా యంత్రాంగం తగు చర్యలు చేపడుతోందని, ఈ విషయాన్ని అధికారులు గ్రామాల్లో వివరించాలన్నారు. న్యాల్కల్ , కల్హేర్ మండలాల్లో చాలా మంది అనర్హులకు బియ్యం, పింఛన్లు మంజూరు కాగా, అర్హులకు అన్యాయం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులు వాటిపై పరిశీలన జరిపి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, పాపన్నపేట మండలంలో గతంలో చాలామంది అర్హులకు ఆహార భధ్రత కార్డులు, పెన్షన్లు అందలేదని ఈ సారి ప్రతి ఒక్కరికి మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, ఆహార భద్రత కార్డులు, పింఛన్ దరఖాస్తుల స్వీకరణ పూర్తయిందన్నారు. శనివారం నుంచి విచారణ చేపట్టామని మంత్రికి వివరించారు. జిల్లాలో పెన్షన్ మంజూరుకు 3,96,400 దరఖాస్తులు అందాయన్నారు. వీటన్నింటినీ పరిశీలించి నవంబర్ 8వ తేదీ నుంచి మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి, శాసన మండలి సభ్యులు భూపాల్‌రెడ్డి, జేసీ శరత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాను ఆదర్శంగా నిలుపుదాం: మంత్రి
సంగారెడ్డి అర్బన్: పారిశుద్ధ్య వసతుల కల్పనలో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో యూనిసెఫ్, మెడ్వాన్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి నీరు, పారిశుద్ధ్య సమన్వయ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజధానికి దగ్గర్లో ఉన్న జిల్లాలో మురుగుదొడ్లు లేని నివాసాలు 60 శాతం ఉండటం బాధాకరమన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో పారిశుద్ధ్య వసతులైన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 90 శాతం పూర్తి చేశామని, అదే స్ఫూర్తితో జిల్లాలోని మిగతా అన్ని నియోజక వర్గాలలో కూడా వంద శాతం పారిశుద్ధ్య వసతులు కల్పించడానికి అందరు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరి సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణానికి కృషిచేయాలన్నారు. జిల్లాలో ఆరోగ్యం, విద్య, నీరు, పారిశుద్ధ్యం మీద సర్వే నివేదిక ఇవ్వాలని, దాని ఆధారంగా జిల్లాను ఈ విషయంలో మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. యూనిసెఫ్ చీఫ్ రుత్ లిమానో మాట్లాడుతూ, జిల్లాలో నీరు , పారిశుద్ధ్య వసతుల కల్పనకు ఎల్లవేళలా సహకరిస్తామన్నారు. అనంతరం మంత్రి యూనిసెఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫొటోగ్రఫీ వర్క్ షాప్‌లో పాల్గొన్న 11 మంది బాల రిపోర్టర్లకు డిజిటల్ కెమెరాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, మెడ్వాన్ ప్రెసిడెంట్ మనోహర్, యూనిసెఫ్ కన్సల్టెంట్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గూడ అంజయ్యకు హరీశ్ పరామర్శ
రూ.లక్ష ఆర్థిక సహాయం హైదరాబాద్: కొంతకాలంగా గుండె జబ్బు, పక్షవాతంతో బాధపడుతున్న పాటల రచయిత, గాయకుడు గూడ అంజయ్యను రాంనగర్‌లోని ఆయన నివాసంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలసి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరపున లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బీఫార్మసీ చదువుతున్న కూతురు మమతను ఉన్నత చదువులు చదివిస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని,ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. గూడ అంజన్న అంటే గుండె నిండా తెలంగాణను నింపుకున్న వ్యక్తి అని, ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని హరీశ్‌రావు మీడియా మాట్లాడుతూ కొనియాడారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: అంజయ్య తనను గుర్తు పెట్టుకొని పరామర్శించడానికి రావడమేకాకుండా, ఆర్థిక సహా యం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అంజయ్య పేర్కొన్నారు. ఒకానొక దశలో అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అంశం మీద ప్రస్తుతం పాటల రూపంలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని, ఇప్పుడు పాడుతాననే ధైర్యం వచ్చిందని చెప్పారు. -
హరీష్.. పెద్ద సవాల్!
- ప్రతిష్టాత్మకంగా ఆ రెండు పథకాలు.. - ‘గొలుసు కట్టు’తో దశమార్చేందుకు యత్నం - వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ కోసం ఎలా పోరాడారో.. వచ్చిన తెలంగాణను బంగారుమయం చేయడానికి నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు అంతే తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే.. గొలుసుకట్టు చెరువులు, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ సర్కారుకు ప్రతిష్టాత్మకమైన ఈ రెండు పథకాలను విజయవంతంచేయడానికి అహర్నిశలు పాటుపడుతున్నారు. అడ్డంకులు ఎదురవుతాయని తెలిసినా ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతున్నారు. పై పథకాల ఫలాల రుచిని మెతుకుసీమ ప్రజలకు చూపిస్తానని చెప్తున్నారు. ఈ మహా సంకల్ప యజ్ఞంలో ప్రజల సహకారం ఉంటే సాధించి తీరతానని హరీష్ అంటున్నారు. తెలంగాణ సంస్కృతిలో గొలుసుకట్టు చెరువులు ఓ భాగం. కానీ నిజాం రాజుతో పాటే ఈ గొలుసుకట్టు చెరువులు అంతర్థానమైపోయాయి. ఎన్నికల మేనిఫెస్టోలో గొలుసుకట్టు చెరువులు పునరుద్ధరిస్తామని గులాబీ దళపతి కేసీఆర్ హామీ ఇచ్చారు. 67 ఏళ్లుగా కబ్జాకు గురై అవశేషాలు కూడా కోల్పోయిన చెరువులను గుర్తించడం ఎలా? గుర్తించినా వాటిని స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా? చెరువు భూముల స్వాధీనం అంటే తేనె తుట్టెను కదిపినంతగా భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ సమస్య.. సవాల్‌గా మారింది. నీటిపారుదల శాఖమంత్రిగా హరీష్‌రావు సవాల్‌ను స్వీకరించారు. ఇందుకు నాందిగా మెతుకుసీమలోనే గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు తొలి అడుగుపడింది. చిన్న నీటిపారుదల శాఖ నివేదికల ప్రకారం జిల్లాలో 100 ఎకరాలకు పైగా సాగు నీరు అందించే చెరువులు 582 వరకు ఉన్నాయి. వీటి ద్వారా 1.28 లక్షల ఎకారలకు సాగు నీరు అందించవచ్చు. 100 ఎకరాలకులోపు సాగు నీరు అందించే చెరువులు 6,207 వరకు ఉన్నాయి. ఈ చెరువుల ద్వారా 1.16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. కానీ, వీటిలో దాదాపు 70 శాతం చెరువులు(ఎఫ్టీఎల్.. ఫుల్ ట్యాంక్ లెవల్) కబ్జాకు గురి అయ్యాయని, పట్టణ ప్రాంతాల్లో నేతలు, రియల్ వ్యాపారులు కబ్జాపెట్టి ప్లాట్లు చేసి అమ్ముకున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట పొలాలుగా మార్చుకున్నారని అధికారులు తేల్చారు. మరి కొన్ని చెరువుల అలుగులు, తూములు కబ్జాకు గురి అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యలను అధిగమించి గొలుసుకట్టు చెరువులు ఏర్పాటు చేయడం సలువుకాదని అధికారులు నిరాసక్తత వ్యక్తం చేశారు. ‘కలిసి ప్రయత్నం చేద్దాం.. ఫలితం ఎందుకు రాదో చూద్దాం... నీళ్లు చేరే పది చెరువులు చూడండి. ప్రయోగాత్మకంగా పనులు మొదలు పెడదాం. నేను మీకు అండగా నిలబడతా’ అని హరీష్ చెప్పడంతో జిల్లా యంత్రాంగం చెరువుల సర్వే పనుల్లో నిమగ్నమైంది. గొలుసుకట్టు చెరువుల స్వరూపాన్ని వెలికిపట్టుకునే పనిలో పడ్డారు. తేనె తుట్టెను పట్టేస్తారా..! మెతుకుసీమలో వక్ఫ్ బోర్డుకు 36 వేల ఎకరాల భూమి ఉండేది. ఇనాం భూముల ఆదాయంతో ఉర్సు, ఉత్సవాలతో దర్గాలు జోరుమీదుండేవి. ఇప్పుడా జోరు లేదు. దర్గా, మసీదుల ఆస్తులు కబ్జా కోరల్లో పడి కరిగిపోయాయి. రికార్డులు మాయమయ్యాయి. 66 ఏళ్లుగా వక్ఫ్ భూములపై అజమాయిషీ లేదు. ఎక్కడికక్కడా కబ్జా పెట్టారు. ఎవరికి అందినకాడికి వారు దోచుకున్నారు. ఏళ్లు గడుస్తున్నకొద్దీ వక్ఫ్ భూముల వ్యవహారం తేనెతుట్టెలా మారింది. ఏ పాలకులూ ఈ తుట్టెను తట్టిలేపే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడా తుట్టెను తట్టిలేపేందుకు మంత్రి హరీష్‌రావు ముందుకొచ్చారు. మెదక్ జిల్లా నుంచే సర్వే మొదలు పెట్టేందుకు అధికారులు కదిలారు. పాత రికార్డుల బూజు దులిపారు. ఒక్కొక్క పేజీని తిప్పేస్తే తొలి సర్వేలోనే జిల్లాలో 26 వేల ఎకరాల వక్ఫ్ భూమి ఉన్నట్లు తేలింది. రెండోసారి సర్వే చేస్తే మరో 10 వేల ఎకరాలు తేలుతుందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో సగభాగం జిల్లాలో ఉన్నట్లు తేలింది. అయితే ఈ భూమిలో 80 శాతం కబ్జా పాలైపోయింది. ఈ భూమిని సామాన్యుని నుంచి భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా నేతల వరకు అనుభవిస్తున్నారు. వ్యాపారులు, బడా నేతలు ఆయన మీద రాజకీయ కుట్రకు వ్యూహం పన్నేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయినా వెనుకడుగు వేసేది లేదంటున్నారు మంత్రి హరీష్‌రావు. ఆ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్థానిక ప్రాంతంలోని ముస్లింల అభివృద్ధికి, యువతకు ఉపాధి, విద్యపై ప్రాముఖ్యనిస్తూ ఖర్చు చేస్తామని మంత్రి చెప్తున్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణలో ప్రజలు తమను అర్థం చేసుకుంటారనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తరతరాలుగా పెరిగిపోతున్న అక్రమాల పుట్టను ప్రజా సంక్షేమం కోసం పెకిలిస్తామని అంటున్న మంత్రి సంకల్పానికి అండగా నిలబడాలని జిల్లాప్రజానీకం కోరుకుంటోంది.