
ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ: హరీష్ రావు
హైదరాబాద్: ప్రతిపక్షం లేకుండానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం అన్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ మధ్యాహ్నం 1:30 గంటలకు వాయిదా పడేదని, అయితే ప్రస్తుతం సభ ఎప్పుడు వాయిదా పడుతుందా అని విపక్ష సభ్యులే ఎదురుచూస్తున్నారని హరీష్ రావు తెలిపారు.