మెదక్ : భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్ట్లన్నీ జలకళను సంతరించుకున్నాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. శనివారం మెదక్లో హరీశ్రావు మాట్లాడుతూ... పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. సింగూరు ప్రాజెక్ట్లో ఇన్ఫో పెరగిందన్నారు. అందువల్లే నీటిని దిగువకు వదిలామని చెప్పారు. మిషన్ కాకతీయ వల్ల నీటి కొరత తీరందని హరీశ్రావు పేర్కొన్నారు.