ఇరిగేషన్ శాఖలో ఎమర్జెన్సీ.. | Emergency in Irrigation department | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్ శాఖలో ఎమర్జెన్సీ..

Published Wed, Sep 21 2016 5:26 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

ఇరిగేషన్ శాఖలో ఎమర్జెన్సీ..

ఇరిగేషన్ శాఖలో ఎమర్జెన్సీ..

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆయా శాఖలో ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది సెలవులన్నింటినీ రద్దు చేసినట్లు నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి వర్షాలు, చెరువుల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. వాట్సాప్ ద్వారా మేజర్, మీడియం, మైనర్ విభాగాల సీఈలకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినందున చెరువులు తెగిపోయే ప్రమాదం ఉందని, ఈ దృష్ట్యా ఇంజనీర్లంతా వారి హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండి ప్రతి గంటకు వర్షపాతం నమోదు చేయాలని సూచించారు.

చెరువులు, ఇతర జలాశయాలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని, సిమెంట్ సంచులు, ఇసుక బస్తాలు నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. చెరువులు, రిజర్వాయర్లలో ఏ మేరకు నీళ్లు చేరాయో వాటిని నమోదు చేసి జిల్లా అధికారులకు పంపాలన్నారు. రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకొని సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఉపేక్షించబోమని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement