
సాక్షి, అమరావతి : శ్రీశైలం ప్రాజెక్టుకు, డ్యాం భద్రతకు ఎలాంటి ముప్పులేదని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై గురువారం అధికారులతో మాట్లాడిన మంత్రి అనంతరం వారి నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ఈ సందర్భంగా డ్యాం భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని వివరించారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలు, అపోహలు కల్పించవద్దని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment