
'గోదావరిపై మరో మూడు బ్యారేజీలు నిర్మిస్తాం'
హైదరాబాద్: గోదావరి నదిపై మరో మూడు బ్యారేజీలు నిర్మిస్తామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్లో రెండవ దశ మిషన్ కాకతీయ పనులపై నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులకు రిటైర్డు నిపుణుల సలహాలను తీసుకుని మిషన్ కాకతీయను విజయవంతం చేస్తామని చెప్పారు. ఈ సమీక్షకు సాగునీటి నిపుణులు టి.హనుమంతురావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.