
106 ఏళ్లు.. ఏడో పుష్కరం
నిర్మల్‌రూరల్ : ఈ అవ్వ పేరు ఎనగందుల లక్ష్మీబాయి. నిర్మల్ నివాసి. 106 ఏళ్లుంటాయి. మునిమనుమలతో కలిసి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా సోన్ ఘాట్‌కు పుష్కరస్నానానికి వచ్చింది. 'ఆ గంగమ్మ ఆశీస్సులతోనే అందరం సల్లంగున్నం.. నా కొడుకులు, బిడ్డలు, మనుమలు, వాళ్ల పిల్లలతో పుష్కర స్నానం జేసిన. ఇది ఏడోసారి' అని పేర్కొంది. వయసు మీద పడ్డా.. ఆరోగ్యం అంతగా సహకరించకున్నా.. 'నేనూ మీతో వస్తానంది' అని, ఆమె కోరికను కాదనలేక తీసుకువచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు.