
సాక్షి, హైదరాబాద్: వైద్యుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ‘తెలంగాణ ప్రభుత్వ వైద్యుల ఐక్య కార్యాచరణ సమితి’ నోటీసు ఇచ్చింది. ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.శాంతికుమారికి వైద్యుల జేఏసీ చైర్మన్ డాక్టర్ బి.రమేశ్, కన్వీనర్ డాక్టర్ ఆర్.లాలూప్రసాద్‌లు ఈ మేరకు మంగళవారం నోటీసిచ్చారు. ‘పీజీ వైద్య సీట్ల భర్తీలో ఇన్‌సర్వీస్ కోటాలో మార్పులు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన 21, 22 ఉత్తర్వులను రద్దు చేయాలి. ప్రజారోగ్య విభాగంలో వైద్యుల సంఖ్యను పెంచాలి.
అత్యవసర అలవెన్సులను పెంచాలి. ప్రభుత్వ వైద్యులకు ప్రొటోకాల్ ఉం డాలి. ఏడో వేతన సంఘం కెరియర్ అడ్వాన్స్‌మెంట్ అమలు చేయాలి. కేసీఆర్ కిట్‌కు అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలి. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులందరికీ ట్రెజరీ వేతనాలు ఇవ్వాలి. కొత్త జిల్లాలకు డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్ పోస్టులను ఏర్పాటు చేయాలి. ఎం జీఎం ఫోరెన్సిక్ వైద్యుడు రజామాలిక్ సస్పెన్షన్ ఎత్తి వేయాలి. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మా ణం వెంటనే చేపట్టాలి’ అని నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment