సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11 కరోనా రహిత జిల్లాలను ప్రభుత్వం ప్రకటించింది. అందులో వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, ములుగు జిల్లాలకు చెందిన వారెవరూ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం లేదు. ఈ 8 జిల్లాలకు చెందిన పాజిటివ్ కేసులున్న వారందరికీ వ్యాధి నయమై వెళ్లిపోయారు.
దీంతో ఈ జిల్లాలన్నింటినీ ప్రభుత్వం కరోనా రహిత జిల్లాలుగా ప్రకటిం చినట్లు ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఇక కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోద య్యాయని అందులో వెల్లడించారు. అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1016కి చేరింది. తాజాగా 35 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 409 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం 582 మంది చికిత్స పొందుతున్నారు.
ఐదో రోజు కేంద్ర బృందం పర్యటన..
రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు తీరు, వైరస్ వ్యాప్తి నియం త్రణకు సర్కారు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసేందు కు వచ్చిన కేంద్ర బృందం ఐదో రోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను సందర్శించింది. బీఆర్కేఆర్ భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ అయింది. అనంతరం ఆ బృందం ఎస్‌ఆర్ నగర్‌లోని ఆయుర్వేద ఆస్పత్రిని, కూకట్‌పల్లిలోని కంటైన్మెంట్ జోన్లో రెండు ప్రాంతాలను పరిశీలించింది. 3 రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం మే 2 వరకు రాష్ట్రంలోనే పర్యటించనుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. చదవండి: బతుకు లాక్‌డౌన్
Comments
Please login to add a commentAdd a comment